రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, పేపర్లు మరియు కరెన్సీ నోట్లను శుభ్రపరచడానికి ఆటోమేటెడ్ యూవీ వ్యవస్థను అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ ల్యాబ్‌

Posted On: 10 MAY 2020 5:32PM by PIB Hyderabad

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) ప్రీమియర్ ల్యాబ్, హైదరాబాద్ కేంద్రంగా ప‌ని చేస్తున్న‌ "రీసెర్చ్ సెంటర్ ఇమారత్ " (ఆర్‌సీఐ) ఆటోమేటెడ్ కాంటాక్ట్‌లెస్ యూవీసీ శానిటైజేషన్ క్యాబినెట్‌ను అభివృద్ధి చేసింది. దీనికి "డిఫెన్స్ రీసెర్చ్ అతినీల లోహిత శానిటైజర్" (డీఆర్‌యూవీఎస్) అని నామ‌క‌ర‌ణం చేశారు. ఈ ప‌రిక‌రం మొబైల్ ఫోన్లు, ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కరెన్సీ నోట్లు, చెక్ లీఫ్‌లు, చలాన్లు, పాస్ బుక్‌లు, పేపర్, ఎన్వలప్‌లు మొదలైన వాటిని క్రిమిసంహ‌ర‌ణ చేసి త‌గిన విధంగా శ‌భ్రపరిచేలా దీనిని రూపొందించారు. డీఆర్‌యూవీఎస్ క్యాబినెట్ కాంటాక్ట్‌లెస్ ఆపరేషన్ కలిగి ఉంటుంది. దీంతో వైరస్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు గాను ఇది ఎంత‌గానో ఉప‌యుక్తంగా ఉండనుంది. సామీప్య సెన్సార్ స్విచ్‌లు, డ్రాయర్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ మెకానిజంతో దీని ఆపరేషన్‌ను ఆ‌టోమేటిక్ మరియు కాంటాక్ట్‌లెస్‌గా చేస్తోంది. క్యాబినెట్ లోపల ఉంచిన వస్తువులకు యూవీసీ 360 డిగ్రీల పూర్తి ఎక్స్పోజర్ను అందిస్తుంది. శానిటైజేషన్ పూర్తయిన తర్వాత సిస్టమ్ దానంత‌ట అదే స్లీప్ మోడ్‌లోకి వెళుతుంది, అందువల్ల ఆపరేటర్ పరికరం దగ్గర వేచి ఉండాల్సిన అవసరం ఉండ‌దు.

 

డీఆర్‌యూవీఎస్ క్యాబినెట్‌


కరెన్సీ నోట్ల‌ను శుభ్రపరిచే పరికరం నోట్స్‌క్లీన్‌
ఆర్‌సీఐ సంస్థ స్వయంచాలక యూవీసీ కరెన్సీ శానిటైజింగ్ పరికరాన్ని కూడా అభివృద్ధి చేసింది. దీనికి నోట్స్‌క్లీన్‌ అని నామ‌క‌ర‌ణం చేశారు. కరెన్సీ నోట్ల కట్టలను డీఆర్‌యూవీఎస్ ఉపయోగించి శుభ్రపరచవచ్చు. అయితే ప్రతి కరెన్సీ నోట్లను క్రిమిసంహారణ‌ చేయడం సమయం తీసుకునే ప్రక్రియ అవుతుంది. దీని కోసం ఒక పరిశుభ్రత సాంకేతికతను అభివృద్ధి చేయబడింది. కొత్తగా రూపొందించిన పరికరం యొక్క ఇన్పుట్ స్లాట్ వద్ద వదులుగా ఉన్న కరెన్సీ నోట్లను ఉంచితే..ఇది నోట్లను ఒక్కొక్కటిగా ఎంచుకొంటూ పూర్తి క్రిమిసంహారక కోసం యూఈసీ దీపాల గుండా తీసుకు వెళుతుంది. దీంతో క‌రెన్సీ నోట్లు వైర‌స్ ర‌హితంగా శుభ్ర‌ప‌ర‌చ‌బ‌డ‌తాయి.

 

- స్వయంచాలక యూడీసీ కరెన్సీ శుభ్రపరిచే పరికరం నోట్స్‌క్లీన్‌

***(Release ID: 1622735) Visitor Counter : 120