రైల్వే మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 2020 మే నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు 366 "శ్రామిక్ ప్రత్యేక" రైళ్లను నడిపిన - భారతీయ రైల్వేలు.

ప్రయాణీకులకు ఉచితంగా భోజనం, మంచినీరు అందిస్తున్నారు.
ప్రయాణీకులను పంపిస్తున్న రాష్ట్రం, వారిని ఆహ్వానిస్తున్న రాష్ట్రం రెండు రాష్ట్రాలు తమ సమ్మతి తెలియజేసిన అనంతరమే రైల్వేలు ఈ రైళ్లను నడిపాయి.

సామాజిక దూరం పాటిస్తున్నారు.

ఒక్కొక్క "శ్రామిక్ ప్రత్యేక" రైలులో సుమారు 1200 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నారు.

Posted On: 10 MAY 2020 4:30PM by PIB Hyderabad

వలస కూలీల ప్రయాణం కోసం దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేయడంతో, వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన యాత్రీకులు, పర్యాటకులు, విద్యార్థులు, ఇతర వ్యక్తులను ప్రత్యేక రైళ్ల ద్వారా వలసల కూలీల ప్రయాణం కోసం దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేయడంతో, "శ్రామిక్ ప్రత్యేక" రైళ్లను నడపాలని భారతీయ రైల్వేలు నిర్ణయించాయి. 

దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 366 "శ్రామిక్ ప్రత్యేక" రైళ్లు ఏర్పాటుచేయగా, 2020 మే నెల 10వ తేదీ వరకు 287 రైళ్ళు గమ్యస్థానాలను చేరాయి, మరో 79 రైళ్లు మార్గ మధ్యలో ఉన్నాయి. 

ఈ 287 రైళ్లలో -  ఆంధ్రప్రదేశ్ ( ఒక రైలు); బీహార్ (87 రైళ్లు); హిమాచల్ ప్రదేశ్ (ఒక రైలు); ఝార్ఖండ్ (16 రైళ్లు); మధ్యప్రదేశ్ (24 రైళ్లు); మహారాష్ట్ర (3 రైళ్లు); ఒడిశా (20 రైళ్లు); రాజస్థాన్ (4 రైళ్లు); తెలంగాణా (2 రైళ్లు); ఉత్తరప్రదేశ్ (127 రైళ్లు); పశ్చిమ బెంగాల్ (2 రైళ్లు)  చొప్పున వివిధ రాష్ట్రాలలోని గమ్యస్థానాలకు ప్రయాణీకులను తీసుకుని వెళ్లాయి.  

ఈ రైళ్లు - తిరుచిరాపల్లి; తిట్లగర్; బారుని; ఖండ్వా; జగన్నాథపూర్; ఖుర్దా రోడ్; ప్రయాగరాజ్; చ్ఛాప్రా;  బాలియా; గయా;పూర్ణియా; వారణాసి; దర్భాంగా; గోరఖ్పూర్; లక్నో; జాన్పూర్; హతియా; బస్తీ; కతిహార్; దానాపూర్; ముజాఫర్ పూర్; సహారా వంటి వివిధ నగరాలకు వలస కూలీలను తీసుకు వెళ్లాయి.  

ఈ శ్రామిక్ ప్రత్యేక రైళ్లల్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ, గరిష్టంగా సుమారు 1200 ప్రయాణీకులు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు.  రైళ్లు బయలుదేరేముందు ప్రయాణీకులందరినీ పూర్తిగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ప్రయాణ సమయంలో ప్రయాణీకులందరికీ ఉచితంగా భోజనం, మంచినీరు అందజేస్తున్నారు.  

 

****(Release ID: 1622731) Visitor Counter : 290