రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎంపీ-ఐడీఎస్ఏ 165వ ఈసీ స‌మావేశానికి అధ్యక్షత వహించిన ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 08 MAY 2020 8:00PM by PIB Hyderabad

మనోహర్ పారికర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనలైజెస్ (ఎంపీ-ఐడీఎస్ఏ) 165 వ మరియు మొట్టమొదటి వర్చువల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సమావేశానికి ర‌క్ష‌ణ‌ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. కోవిడ్-19 కారణంగా ప‌లు పరిమితులు ఎదుర‌వుతున్నా
తమ విధులను నిర్వర్తించినందుకు ఎంపీ-ఐడీఎస్ఏ సంస్థ  డైరెక్టర్ జనరల్, అంబాసిడర్ సుజన్ ఆర్ షెనాయ్ ని ఈసీ సభ్యులు, స్కాల‌ర్ల‌ను దేశ ర‌క్ష‌ణ మంత్రి ఈ సంద‌ర్భంగా అభినందించారు.
కోవిడ్ -19 మహమ్మారి నేప‌థ్యంలో ప‌లు అవ‌రోధాల కార‌ణంగా ఇన్‌స్ట‌ట్యూట్‌లోని కొంత మంది
స్కాల‌ర్లు, సిబ్బందికి వివిధ ఇబ్బందులు ఎదురైన‌ప్ప‌టికీ ఆ అడ్డంకుల‌ను వారు విజయవంతంగా అధిగమించగలిగార‌ని మంత్రి కితాబిచ్చారు.
ప‌రిమితులు ఉన్నా కీల‌క సంస్ధ‌గా సేవ‌లు..
త‌మ ప‌రిశోధ‌న రచనలు, వెబ్‌నార్ల త‌దిత‌రాల ద్వారా త‌మ పరిశోధనల క్ర‌మాన్ని వారు కొనసాగించగలిగార‌ని ఆయన అన్నారు. కోవిడ్ -19 వైర‌స్ నేప‌థ్యంలో ప‌రిమితులు కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ఆ పరిమితుల మధ్య తిరిగి తెరిచిన మొదటి సంస్థలలో ఎంపీ-ఐడీఎస్ఏ ఒక‌టి. తగిన భద్రతా చర్యలు తీసుకోవడం మరియు సామాజిక దూరం పాటించ‌డం వంటి మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా సంస్థ త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది. రక్షణ, భ‌ద్ర‌త రంగాల‌లో నాణ్యమైన పరిశోధనల‌తో పాటు అంతర్జాతీయ సంబంధాలలో కీలక సంస్థగా ఎంపీ-ఐడీఎస్ఏ నిర్వ‌హిస్తున్న సేవ‌ల‌ను ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌స్తుతించారు.
వివిధ ద‌ళాల‌తో విస్తృత సంబంధాలు..
కొన్ని సంవత్సరాలుగా ఎంపీ-ఐడీఎస్ఏ సాయుధ దళాలు, కేంద్ర పోలీసు సంస్థలు, పారా మిలటరీ దళాలు, ప్రభుత్వ పరిశోధనా సంస్థల‌తో పాటుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలతో విస్తృతమైన సంబంధాల్ని ఏర్పరుచుకొని శ్రద్ధగా త‌న ప‌నిచేస్తూ వ‌స్తోంది. దేశీయంగాను మరియు అంతర్జాతీయంగా పెద్ద సంఖ్యలో వివిధ థింక్ ట్యాంకులతో విస్తృత శ్రేణి మార్పిడితో పాటుగా ఇక్క‌డ స్కాల‌ర్లు ఉచితంగా త‌మ స్పష్టమైన అభిప్రాయాలను మార్పిడి చేసుకొనేందుకు గాను త‌గిన వాతావరణం క‌ల్పించారు. దీనికి తోడు స్వేచ్ఛ‌గా సంభాషించుకొనే అవకాశాన్ని ఇక్క‌డ క‌ల్పిస్తున్నారు. ఎంపీ-ఐడీఎస్ఏ సంస్థ తన భవిష్యత్ ప్రయత్నాలకు ర‌క్ష‌ణ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ప‌రిమిత వ‌న‌రుల స‌మ‌స్య‌ను అధిగ‌మించాలి..
వనరుల పరిమితుల వ‌ల్ల ఎదుర‌య్యే సవాళ్ల‌ను అధిగమించడానికి కొత్త ఆలోచనలను రూపొందించే దిశగా స్కాల‌ర్‌లు తమను తాము మేటిగా తీర్చిదిద్దుకొంటూ ముందుకు సాగాల‌ని మంత్రి సూచించారు. అనూహ్యపు సంక్షోభాల కారణంగా ఆర్థిక వ్యవస్థపై ఒత్త‌డి నెల‌కొంటున్న త‌రుణంలో ప‌రిమిత వ‌న‌రుల‌తోనే రక్షణ వ్య‌వ‌స్థను మేటిగా  ఆధునీకరించే దిశ‌గా దృష్టి సారించాల‌న్నారు. దేశ సరిహద్దుల్లో విరోధితో పోరాడటానికి సిద్ధంగా ఉన్న భారత సాయుధ దళాల ధైర్యం మరియు త్యాగాలను ఈ సంద‌ర్భంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌‌శంసించారు. మన సరిహద్దుల్లో ఉగ్రవాద నిరోధక చర్యలలో ధైర్యంగా పాల్గొన‌డంతో పాటుగానే కోవిడ్‌-19 తో పోరాడటానికి గాను త‌గిన స‌హాయాన్ని అందించ‌డానికి మ‌న‌ ద‌ళాలు చేస్తున్న సాయాన్ని మంత్రి ఈ సంద‌ర్భంగా కొనియాడారు. ఈసీ సమావేశానికి దాని సభ్యులు రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, మాజీ హోంశాఖ కార్యదర్శి శ్రీ జి కె పిళ్ళై, ప్రొఫెసర్ ఎస్ డి ముని హాజరయ్యారు. అంబాసిడ‌ర్‌ స్వాష్పావన్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ ప్రకాష్ మీనన్ (రిటైర్డ్), వైస్ అడ్మిన్ శేఖర్ సిన్హా (రిటైర్డ్), ఎయిర్ మార్షల్‌లు వి కె భాటియా (రిటైర్డ్), శ్రీ గుల్షన్ లుథ్రా  త‌దిత‌రులు  వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమావేశానికి హాజరయ్యారు.

 


(Release ID: 1622328) Visitor Counter : 208