సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

దూరదర్శన్ మరియు ఆకాశవాణి లో సమగ్ర వాతావరణ నివేదికలు

Posted On: 08 MAY 2020 9:24PM by PIB Hyderabad

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, జాతీయ ప్రజా ప్రసార మాధ్యమాలైన దూరదర్శన్ మరియు ఆకాశవాణి వార్తా బులెటిన్ల  ద్వారా భారతదేశం మొత్తం భూభాగం నుండి దృష్టి సారించి, ఎప్పటికప్పుడు సమగ్ర తాజా వాతావరణ వివరాలను ప్రసారం చేయడం జరుగుతోంది. 

డి.డి. న్యూస్ ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం తన వార్తా బులెటిన్ల ద్వారా వాతావరణ నివేదికలను ప్రసారం చేస్తోంది.  కాగా, ఆకాశవాణి తన ప్రధాన వార్తా బులెటిన్ల ద్వారా ముఖ్యమైన వాతావరణ వివరాలను రోజంతా ప్రసారం చేస్తూనే ఉంటుంది

డి.డి.కిసాన్ ఛానెల్ ప్రతీ రోజూ మూడు సార్లు ఒక్కొక్కటీ అరగంట సేపు తాజా వాతావరణ బుల్లెటిన్లను, నాలుగు సార్లు ఐదు నిముషాల వాతావరణ బులెటిన్లను ప్రసారం చేస్తుంది. 

ఈ వాతావరణ నివేదికల్లో దేశంలోని ప్రతి మారుమూల ప్రదేశం లోని స్వల్ప వివరాలతో పాటు, దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వాతావరణ పరిస్థితులను ప్రముఖంగా ప్రసారం చేయడం జరుగుతుంది.  అదేవిధంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు;  గిల్గిట్ నుండి గువాహటి వరకు; బాల్టిస్తాన్  నుండి పోర్ట్ బ్లెయిర్ వరకు వివిధ ప్రాంతాల ఉష్ణోగ్రతల వివరాలు తెలియజేయడం జరుగుతుంది.  ఈ నివేదికల్లో వివిధ ప్రాంతాల్లోని రైతులకు సలహాలుసూచనలు, చేయవలసిన, చేయకూడని పనుల వివరాలు, వ్యవసాయ నిపుణులతో చర్చలు వంటి అనేక వ్యవసాయ ఆధారిత విషయాలను కూడా పొందుపరుస్తారు

దూరదర్శన్ మరియు ఆకాశవాణి జాతీయ ఛానెళ్లతో పాటు ప్రాంతీయ వార్తా విభాగాలు కూడా తమ ప్రాంతీయ భాషల్లో వార్తా బులెటిన్ల ద్వారా తాజా వాతావరణ వివరాలను ప్రసారం చేస్తున్నాయి.  

ఈ బులెటిన్లు అన్నీ దూరదర్శన్ మరియు ఆకాశవాణి కి చెందిన యూట్యూబ్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

తాజా వాతావరణ బులెటిన్లను క్రింద పేర్కొన్న ఛానెళ్లు / లింకుల ద్వారా చూడవచ్చు

డి.డి.కిసాన్ ఛానెల్ లో వాతావరణ నివేదిక: 

https://www.youtube.com/watch?v=zwoH5iI6F0k

డి.డి.న్యూస్ ఛానెల్ లో వాతావరణ నివేదిక: 

https://www.youtube.com/watch?v=SMsthz58ihI&feature=youtu.be  

ఆకాశవాణి వార్తలు ప్రతి బులెటిన్ చివరలో తాజా వాతావరణ వివరాలు ప్రసారం చేయడం జరుగుతోంది. 

 - https://www.youtube.com/watch?v=FIjoNfUKVCs

సౌరభ్ సింగ్ 

*****


(Release ID: 1622326) Visitor Counter : 194