సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్‌ అనంతర దశలో త‌గిన విధంగా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తే భారత ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల రంగానికి ప్ర‌ధానంగా ప్రోత్సాహం ల‌‌భించవ‌చ్చు: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 08 MAY 2020 6:59PM by PIB Hyderabad

కోవిడ్ అనంత‌రం దేశ ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగం ప‌రిస్థితుల‌పై అగ్రశ్రేణి నిపుణులతో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు చ‌ర్చ‌లు జ‌రిపారు. వైద్య సౌభ్రాతృత్వం, కార్పొరేట్ ఆసుపత్రి రంగం, ప్రముఖ పరిశోధనా సంస్థల‌కు చెందిన ప్ర‌ముఖులు మరియు వైద్య ఆర్థికవేత్తలతో మంత్రి జితేంద్ర సింగ్  చ‌ర్చించారు. దాదాపు గంట‌న్న‌ర పాటు ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ రూపంలో ఈ స‌మావేశం జ‌రిగింది. చెన్నై న‌గ‌రానికి చెందిన అంతర్జాతీయ ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ వి.మోహన్, మేదాంత సంస్థ సీఎండీ డాక్టర్ నరేష్ ‌ట్రెహన్, బెంగ‌ళూరుకు చెందిన‌ నారాయణ హెల్త్ చైర్మెన్ డాక్టర్ దేవి శెట్టి, అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ డాక్టర్ సంగీత రెడ్డి, బెంగ‌ళూరు బయోకాన్ సంస్థ సీఎండీ కిరణ్ మజుందార్ షా, సీఎస్ఐఆర్ న్యూ ఢిల్లీకి చెందిన డీజీ డాక్ట‌ర్ శేఖ‌ర్ మాండేతో పాటు పుదుచ్చేరి నుండి డాక్టర్ డి.సుందరరామన్, న్యూఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డాక్ట‌ర్ శ‌క్తి గుప్తా, న్యూఢిల్లీలోని ఎన్ఐపీఎఫ్‌పీ సంస్థ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ రితిన్ రాయ్‌, న్యూఢిల్లీకి చెందిన డీహెచ్ఎఫ్ఐ సంస్థ అధ్య‌క్షుడు ప్రొఫెస‌ర్ కె. శ్రీ‌నాథ్‌రెడ్డి, ఛ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి డాక్ట‌ర్ యోగేష్ జైన్ తెలిపారు.
భ‌విష్య‌త్తు వ్యూహ‌ర‌చ‌న‌కు స‌మ‌యం అస‌న్న‌మైంది..

 


స‌మావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ తొల‌త మాట్లాడుతూ మొదటి దశలో కోవిడ్ -19 మహమ్మారి క‌ట్ట‌డికి ఆదర్శప్రాయమైన శ్రద్ధ, త‌గిన‌ వృత్తి నైపుణ్యంతో వ్యవహరించి ముందుకు సాగుతున్నామ‌ని తెలిపారు. కోవిడ్-19 అనంతర దశలో దేశంలో త‌గిన ప్ర‌ణాళికలు రూపొందించి మరియు ఈ ప్రతికూలతను మ‌నం ఎంత ఉత్తమంగా మార్చుకోవ‌చ్చో వ్యూహరచన చేయడానికి త‌గిన సమయం ఆసన్నమైందని అన్నారు. భవిష్యత్ అవసరాలను త‌ట్టుకోవ‌డానికి మ‌న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మ‌రింత బలోపేతం చేసేందుకు ఈ అవకాశాల్ని ఎంత మేటిగా
నిర్వ‌హించ‌గ‌ల‌మ‌నే విష‌యంపై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ఈ త‌రుణంలో
అంత‌ర్ దృష్టితో త‌గినట్టుగా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తే భారత ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల‌ను
భ‌విష్య‌త్తులో ప్రపంచ స్థాయి ప్రమాణాల మేర‌కు అభివృద్ధి చేసేందుకు ఇది మంచి అవ‌కాశంగా మారుతుంద‌ని తెలిపారు. అంతే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సహకారిగా అభివృద్ధి చేయడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుందని అన్నారు.
కోవిడ్‌యేత‌ర రోగుల‌పై నిర్లక్ష్యం కూడదు..
ఈ స‌మావేశంలో మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ వైద్య సౌభ్రాతృత్వం మరొ ఆందోళన ఏమిటంటే కోవిడ్‌-19 సవాలును జయించాలనే మ‌న‌ బాధ్యతను మేము నిర్వర్తించే క్ర‌మంలో కోవిడ్‌యేత‌ర రోగుల‌ను అనుకోకుండా నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. గుండె జబ్బులు, మ‌దుమేహం మెల్లిట్ వంటి సంక్రమించని వ్యాధులతో సహా క్యాన్సర్ వంటి అధిక మరణాల రేటును కలిగి వ్యాధిగ్ర‌స్తుల ప‌ట్ల నిర్ల‌క్ష్యం త‌గ‌దని పేర్కొన్నారు. అదే సమయంలో కోవిడ్‌-19 రోగులలో స‌హ‌-అనారోగ్యం (కొమొర్బిడిటీ) ద్వారా మరణాలకు కూడా దోహదం చేస్తుంద‌ని కావున ఈ స‌మ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌తో చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంద‌ని అన్నారు.
భారీగా ప‌రీక్ష‌లు చేయ‌ల్సి ఉంటుంది..
ఈ స‌మావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత‌ కోవిడ్-19కి వ్యతిరేకంగా యుద్ధం కొనసాగవచ్చ‌ని అన్నారు. ఈ క్ర‌మంలో వైర‌స్ నిర్ధార‌ణ నిమిత్తం జనాభాను పెద్ద ఎత్తున లేదా భారీగా పరీక్షించవలసి ఉంటుంద‌ని తెలిపారు. భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ నిమిత్తం ఏదైనా ప్రణాళికను రూపొందిస్తే ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని చేయాల్సిన బాధ్యత ఉంటుంద‌ని అన్నారు. చర్చ సందర్భంగా తీవ్రతను బట్టి అధిక స్థాయి నిఘా మరియు కోవిడ్ కేసుల వర్గీకరణ యొక్క అవసరాన్ని కూడా మంత్రి నొక్కిచెప్పారు. దీనికి తోడు కోవిడ్ -19 నేప‌థ్యంలో మానసికంగా కుంగిపోవ‌డం కూడా చర్చకు వచ్చింది. స‌మావేశంలో ఆర్థిక వ్యవస్థ గురించి చర్చిస్తున్నప్పుడు భవిష్యత్ ప్రణాళికలో, ఆరోగ్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల‌ని తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఇది ప్ర‌ముఖంగా మారుతుంద‌ని పేర్కొన్నారు.
ప్రస్తుత ఆరోగ్య రంగానికి ఆర్థిక ఉద్దీపన..
ప్రపంచంలోని చాలా దేశాలు భారతదేశంతో వ్యాపారం చేయడానికి ఇష్టపడతున్న ప్ర‌స్తుత త‌రుణంలో దేశంలో తయారీ మరియు ఫార్మా రంగానికి ప్రేరణ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్న అభిప్రాయం వెలువ‌డింది. ఈ స‌మావేశంలో ప‌లు ఇత‌ర సూచ‌న‌లు కూడా ముందుకు వ‌చ్చాయి. వివిధ ఎంపిక‌ల‌తో పాటు ప్రస్తుత ఆరోగ్య రంగానికి ఆర్థిక ఉద్దీపన ఇవ్వాల‌న్న అంశం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. కోవిడ్‌యేత‌ర వ్యాధుల ప‌రిస్థితుల‌తో స‌హా అంటువ్యాధులు కాని రోగాల విష‌య‌మై తీసుకోవాల్సిన ముంద‌స్తు ఆరోగ్య సంర‌క్ష‌ణ అంశాలు కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చకు వ‌చ్చాయి.

***

 


(Release ID: 1622323) Visitor Counter : 206