రైల్వే మంత్రిత్వ శాఖ
ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఐఆర్ఐఎంఈఈ) ను జమాల్పూర్ నుండి లక్నోకు మార్చడం గురించి స్పష్టత
Posted On:
07 MAY 2020 4:20PM by PIB Hyderabad
ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఐఆర్ఐఎంఈఈ) ను జమాల్పూర్ నుండి లక్నోకు మార్చాలని యోచిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఐఆర్ఐఎంఈఈ ని జమాల్పూర్ నుండి లక్నోకు మార్చడానికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక తమ పరిశీలనలో లేదని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ దిశగా వస్తోన్న వార్తలు, వాదనలు పూర్తిగా సత్య దూరమైనవని, తప్పు దారి పట్టించేవని తెలిపింది. వీటికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి, రవాణా సాంకేతిక పరిజ్ఞానం మరియు నిర్వహణలో విద్యా కార్యక్రమాలను అందించడానికి ఐఆర్ఐఎంఈఈ కార్యకలాపాలను విస్తరించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రణాళికను రూపొందించింది. ప్రస్తుత కోర్సులకు తోడు అదనంగా 1 సంవత్సరం నిడివితో గల పలు డిప్లమా కోర్సులను జమాల్‌పూర్‌లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు, ఇందుకు గాను పాఠ్యాంశాల అభివృద్ధి మరియు రూపకల్పన జరుగుతోంది. ఐఆర్ఐఎంఈఈ చరిత్ర మరియు వారసత్వం గురించి భారతీయ రైల్వే చాలా గర్వంగా ఉందని.. దీనిని ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుండి మార్చే ప్రశ్నేలేదని రైల్వే స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటుగా ఇప్పుడున్న ప్రదేశంలోనే దాని పాత్రలను మరింత విస్తరిచే దిశగా అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. భారతదేశంలో సాధారణ రవాణా రంగం మరీ ముఖ్యంగా రైల్వేలు మేటి వృద్ధితో పరివర్తనను నమోదు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. భారత రైల్వే కు చెందిన జమాల్‌పూర్‌లోని ఐఆర్ఐఎంఈఈ వంటి బాగా అభివృద్ధి చెందిన శిక్షణ మరియు విద్యా సౌకర్యం భారత రైల్వే ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా, బీహార్ మరియు పొరుగు ప్రాంతాల యువతకు అధిక నాణ్యత గల వృత్తి విద్యను మరియు నైపుణ్యాలను అందిస్తూ వస్తోంది. దీనికి తోడు ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తోంది.
(Release ID: 1621871)
Visitor Counter : 209