మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

మత్స్య పరిశ్రమ రంగానికి 12 భాషల్లో సూచనలు జారీ చేసిన - ఐ.సి.ఏ.ఆర్.

ప్రపంచవ్యాప్తంగా మత్స్య పరిశ్రమ రంగం ప్రయోజన కోసం స్వచ్చంద మార్గదర్శకాలుగా రూపొందిన ఎఫ్.ఏ.ఓ. లలో ఐ.సి.ఏ.ఆర్. సూచనలకు స్థానం.

Posted On: 07 MAY 2020 12:49PM by PIB Hyderabad

ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి లాక్ డౌన్ కు దారి తీసిన కోవిడ్-19 మహమ్మారి దేశంలోని మత్స్య పరిశ్రమ మరియు వ్యవసాయ రంగాలను అనేక విధాలుగా ప్రభావితం చేసింది.  మంచి నీటిలోనూ, ఉప్పు నీటిలోనూ చేపల పెంపకం తో పాటు విత్తన ఉత్పత్తి, చేపల ఆహారం తయారీ, సరఫరా, మార్కెట్ చైన్ వంటి మత్స్య పరిశ్రమ రంగంలోని వివిధ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తం మీద, మత్స్యకారులుకార్మికులుప్రోసెస్ చేసేవారు, వారి కుటుంబాలు ఈ మహమ్మారి వల్ల అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. మత్స్య పరిశ్రమ మీద ఆధారపడిన వారికి  జీవనోపాధి కరువయ్యింది.  

భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖ, వ్యవసాయ పరిశోధన మరియు విద్యా శాఖ (డి.ఏ.ఆర్.ఈ.), భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐ.సి.ఏ.ఆర్.) తన పరిశోధనా సంస్థల ద్వారా  వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటాదారులందరి భద్రతను నిర్ధారించడానికి గాను వివిధ సబ్-సెక్టార్లలో సంబంధం ఉన్న అందరినీ ఉత్తేజపరచడం కోసం అనేక వినూత్న చర్యలు చేపట్టింది. 

చేపలు పట్టడం, చేపల పెంపకంతో పాటు ఇతర అనుబంధ కార్యకలాపాలతో సహా, మత్స్య రంగం అభివృద్ధి, కార్మికుల భద్రత కోసం, కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి నివారణ కోసం, ఐ.సి.ఏ.ఆర్. బాధ్యత తీసుకుని మత్స్య పరిశ్రమకు చెందిన వివిధ సంస్థల ద్వారా సూచనలను జారీ చేసింది.  ఈ ప్రయత్నంలో భాగంగా, మత్స్యకారులు, ఫిషింగ్ పడవల యజమానులు, చేపల మార్కెట్, ప్రోసెస్సింగ్ ప్లాంట్ల ప్రయోజనం కోసం కోచీ లోని ఐ.సి.ఏ.ఆర్.- కేంద్ర మత్స్య పరిశ్రమ సాంకేతిక సంస్థ (ఐ.సి.ఏ.ఆర్-సి.ఐ.ఎఫ్.టి) ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు 10 వివిధ ప్రాంతీయ భాషల్లో సూచనలు రూపొందించండి. కాగా, నదులు, కయ్యలు, రిజర్వాయర్లు, మాగాణి భూముల్లో చేపల పెంపకం కార్యకలాపాల్లో నిమగ్నమైన భాగస్వాముల కోసం బారక్ పూర్ లోని ఐ.సి.ఏ.ఆర్.-కేంద్ర స్వదేశీ మత్స్య రంగ పరిశోధన సంస్థ (ఐ.సి.ఏ.ఆర్.-సి.ఐ.ఎఫ్.ఆర్.ఐ.) సూచనలను రూపొందించింది.  ఈ సూచనలను పత్రికలూ, ఎలక్ట్రానిక్ మీడియాసామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడంతో పాటు వివిధ రాష్ట్రాలలోని మత్స్య పరిశ్రమల శాఖలకు, అభివృద్ధి సంస్థలకు, ప్రభుత్వేతర సంస్థలకు పంపిణీ చేయడం జరిగింది.  దేశవ్యాప్తంగా ఈ రంగానికి చెందినవారు ఈ ప్రయత్నాన్ని స్వాగతించారు.  

సమయానుకూలంగా ఉన్న ఈ  సూచనల ప్రాముఖ్యతను గుర్తించి,  రోమ్ లోని ఆహారం మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) ఐ.సి.ఏ.ఆర్.-సి.ఐ.ఎఫ్.టి. మరియు ఐ.సి.ఏ.ఆర్.-సి.ఐ.ఎఫ్.ఆర్.ఐ. రూపొందించిన ఈ సూచనలను, ప్రపంచవ్యాప్తంగా మత్స్య పరిశ్రమ ప్రయోజనం కోసం తీసుకునే ఆసియా ప్రాంతీయ చర్యల్లో భాగంగా సుస్థిరమైన చిన్న-స్థాయి మత్స్య సంపదను భద్రపరచడానికి రూపొందించే స్వచ్చంద మార్గదర్శకాలలో  చేర్చడానికి సిఫార్సు చేసింది.

 (Webpage: http://www.fao.org/3/ca8959en/ca8959en.pdf)

ఐ.సి.ఏ.ఆర్. మరియు దాని అనుబంధ సంస్థలు చేసిన ప్రయత్నాలకు ఇది ఒక భారీ విజయం. కౌన్సిల్ చేపట్టిన ఈ ప్రయత్నాల ద్వారా ప్రపంచ మత్స్య పరిశ్రమ రంగం ప్రయోజనం పొందే అవకాశం ఉంది

 

*****



(Release ID: 1621805) Visitor Counter : 450