సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఆగ్రో ఎంఎస్ఎంఈ విధానంపై కసరత్తు చేస్తున్న కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ : శ్రీ నితిన్ గడ్కరీ
పారిశ్రామిక సమూహాలు, లాజిస్టిక్ పార్కులలో భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడానికి అవకాశంగా ఢిల్లీ-ముంబై గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే కొత్త అమరికపై నొక్కి చెప్పిన మంత్రి
ఆరోగ్యం, సౌందర్య పోషణ సంబంధించిన పరిశ్రమల్లో విదేశీ ఉత్పత్తుల బదులు భారతీయ ఆయుర్వేద ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించిన శ్రీ గడ్కరీ
Posted On:
04 MAY 2020 6:34PM by PIB Hyderabad
స్థానిక ముడి పదార్థాలను ఉపయోగించి ఉత్పత్తులను తయారు చేయడానికి గ్రామీణ, గిరిజన, వ్యవసాయ మరియు అటవీ ప్రాంతాలలో ఔత్సాహ పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సారించే వ్యవసాయ ఎంఎస్‌ఎంఇ విధానాన్ని తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తున్నట్లు ఎంఎస్‌ఎంఇ, ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు తెలియజేశారు.
ఎంఎస్‌ఎంఇలపై కోవిడ్ -19 ప్రభావంపై ఎస్‌ఎంఇ ఛాంబర్ ఆఫ్ ఇండియా, ఎస్‌ఎంఇ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్రతినిధులు, సౌందర్యపోషణ, ఆరోగ్య పరిరక్షణ పరిశ్రమ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలు కోవిడ్-19 విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సామజిక దూరం, పీపీఈ ల విషయంలో ఉన్న మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర మంత్రి తెలిపారు. దిగుమతి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా దేశీయంగానే వాటిని తయారు చేస్తూ, ఎగుమతులను విస్తరించేలా దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. మెట్రో నగరాలు కాకుండా ఇతర ప్రాంతాలలో పారిశ్రామిక క్లస్టర్లు విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు పరిశ్రమలు భాగస్వాములు కావాలని కోరారు.
మారటోరియం పొడిగించడం, లాక్ డౌన్ లోను కార్మికులకు జీతాలు చెల్లించాలని రుణాలు పొందడానికి తగు అవకాశాలు కల్పించాలని పరిశ్రమ వర్గాలు సూచనలు చేశారు.
పరిశ్రమల ప్రతినిధులు చేసిన సూచనలు, విజ్ఞాపనలు సంబంధిత శాఖ లతో చర్చించి ప్రభుత్వం తగు విధంగా సానుకూలంగా స్పందిస్తుందని శ్రీ గడ్కరీ హామీ ఇచ్చారు.
*****
(Release ID: 1621059)
Visitor Counter : 208