శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
వేగంగా, మంచి ఫలితాల సాధనకోసం పనిచేయాలని శాస్త్రీయ విభాగాలకు పిలుపునిచ్చిన డాక్టర్ హర్ష వర్ధన్.
నియంత్రణ ప్రక్రియను వేగవంతం చేయడానికి రెగ్యులేటర్లు పనిచేస్తున్నాయనీ, సి.ఎస్.ఐ.ఆర్. క్లినికల్ ప్రయోగాలకు మద్దతునిస్తోంది - డాక్టర్ హర్ష వర్ధన్.
ప్రజా రవాణా మరియు ఫీడర్ విధానం కోసం సి.ఎస్.ఐ.ఆర్.-సి.ఆర్.ఆర్.ఐ. రూపొందించిన సామాజిక దూరం వంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని ఖరారు చేసిన మార్గదర్శకాల - విడుదల.
"కోవిడ్-19 తర్వాత, ఉత్తమ మార్గంలో జీవించడానికి శాస్త్రీయ పద్దతిలో కొత్త ప్రమాణాలు ఏర్పరచుకుని, సమాజంలో ఒక కొత్త సాధారణ స్థితి అభివృద్ధి చెందుతుంది. అవి చివరికి ఉత్తమ ఆరోగ్య ప్రమాణాలుగా మారతాయి" అని డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొన్నారు.
Posted On:
04 MAY 2020 5:28PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్-19 ఉధృతిని తగ్గించడానికి సి.ఎస్.ఐ.ఆర్. చేపట్టిన వివిధ కార్యక్రమాలను కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞానం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
38 సి.ఎస్.ఐ.ఆర్. ప్రయోగశాలలను కలిపి సి.ఎస్.ఐ.ఆర్. రూపొందించిన సమన్వయ వ్యూహం గురించి సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మండే మంత్రికి వివరించారు. క్షేత్రస్థాయిలో మధ్యవర్తిత్వం మరియు సాంకేతికతల అమలు కోసం పరిశ్రమలు మరియు ఇతర ఏజెన్సీలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తున్నామనీ ఆయన చెప్పారు.
కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు సి.ఎస్.ఐ.ఆర్. ఐదు వెర్టికల్స్ ను రూపొందించింది: డిజిటల్ & మోలెక్యులర్ సర్వేలెన్స్; రాపిడ్ & ఎకనామికల్ దియాగ్నోసిస్; న్యూ డ్రగ్స్ / రీ-పర్పోసింగ్ అఫ్ డ్రగ్స్ / వాక్సిన్స్; హాస్పిటల్ అసిస్టివ్ డివైజెస్ & పి.పి.ఈ.లు; లతో పాటు కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన అభివృద్ధి చేసేందుకు ఉపయోగించే సప్లై చైన్ & లాజిస్టిక్స్ సపోర్ట్ సిస్టమ్స్ ను రూపొందించడం జరిగింది. ఈ ఐదు వర్టికల్స్ ఒక్కొక్క దానిలో ముఖ్యమైన పరిణామాలను సంబంధిత సమన్వయ డైరెక్టర్లు మంత్రికి వివరించారు.
ఎస్.&టి. ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో పాటు సానిటైజర్స్, మాస్కులు, తినడానికి సిద్ధంగా ఉండే ఆహారం వంటివి ప్రజలకు సరఫరా చేయడం ద్వారా సి.ఎస్.ఐ.ఆర్. ప్రయోగశాలలన్నీ అవసరానికి తగ్గట్టు సేవలందించాయని డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
"సి.ఎస్.ఐ.ఆర్. శాస్త్రవేత్తల ఉత్సాహాన్ని చూసి నాకు చాలా సంతోషం కలిగింది. గత సమీక్ష తర్వాతి కాలంలో సి.ఎస్.ఐ.ఆర్. మంచి పురోగతిని సాధించింది. " అని మంత్రి శాస్త్రీయ విభాగాలను అభినందించారు.
గ్లోబల్ కరోనా వైరస్ జీనోమ్ డేటా బేస్, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ షేరింగ్ అల్ ఇంఫ్లూయెంజా డేటా (జి.ఐ.ఎస్.ఏ.ఐ.డి.) లకు కోవిడ్-19 కు చెందిన 53 సెక్వెన్స్ లను సమర్పించినందుకు కూడా డాక్టర్ హర్ష వర్ధన్ ప్రశంసించారు.
సి.ఎస్.ఐ.ఆర్. అభివృద్ధి కార్యక్రమంలో మరొక ముఖ్యమైనది, ఇటీవల యు.ఎస్.-ఎఫ్.డి.ఏ. ఆమోదం పొందిన, కోవిడ్-19 రోగులకు అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడే రెమ్డేసివిర్ మందును కనుక్కోవడం. కోవిడ్-19 కోసం రూపొందించిన మరొక మందు "ఫవిపైరవీర్" క్లినికల్ ప్రయోగం కోసం, భారతదేశంలో ఉత్పత్తి చేసేందుకు సి.ఎస్.ఐ.ఆర్. ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తోంది.
వివిధ ఆసుపత్రి పరికరాలు మరియు పి.పి.ఈ.ల కొరతను సత్వరమే పరిష్కరించడానికి సి.ఎస్.ఐ.ఆర్. చేసిన కృషిని కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. బి.పి.ఏ.పి. వెంటిలేటర్ ను 35 రోజుల అతి తక్కువ సమయంలో రూపొందించిన సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.ఏ.ఎల్. కృషిని ప్రధానంగా చెప్పుకోవాలి. ఇది ధృవీకరణ దశలో ఉంది. సి.ఎస్.ఐ.ఆర్.-ఎన్.ఏ.ఎల్. సంయుక్తంగా అభివృద్ధి పరిచిన కవర్ ఆల్ కు హెచ్.ఎల్.ఎల్. నుండి 50,000 పీసులు సరఫరా కావాలని ఆర్డర్ వచ్చింది. రోజుకు 30,000 పీసులు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు.
ప్రజా రవాణా మరియు ఫీడెర్ విధానం కోసం సి.ఎస్.ఐ.ఆర్.-సి.ఆర్.ఆర్.ఐ. (కేంద్ర రహదారుల పరిశోధనా సంస్థ) రూపొందించిన సామాజిక దూరం వంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని ఖరారు చేసిన మార్గదర్శకాలను మంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు. "కోవిడ్-19 తర్వాత, ఉత్తమ మార్గంలో జీవించడానికి శాస్త్రీయ పద్దతిలో కొత్త ప్రమాణాలు ఏర్పరచుకుని, సమాజంలో ఒక కొత్త సాధారణ స్థితి అభివృద్ధి చెందుతుంది. అవి చివరికి ఉత్తమ ఆరోగ్య ప్రమాణాలుగా మారతాయి" అని డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొంటూ, వారి కృషిని అభినందించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో, సి.ఎస్.ఐ.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మండే; సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.జి.ఐ.బి. డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్; సి.ఆర్.ఆర్.ఐ. డైరెక్టర్ డాక్టర్ సతీష్ చంద్ర; సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఐ.ఐ.ఎం. డైరెక్టర్ డాక్టర్ రామ్ విశ్వకర్మ; సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఐ.పి. (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అఫ్ పెట్రోలియం) డైరెక్టర్ డాక్టర్ అంజన్ రాయ్; ఎన్.ఏ.ఎల్. డైరెక్టర్ శ్రీ జితేంద్ర యాదవ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సి.ఎస్.ఐ.ఆర్. ప్రయోగశాలలు చెందిన ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు.
***
(Release ID: 1621045)
Visitor Counter : 220