పర్యటక మంత్రిత్వ శాఖ

దేఖో అప్నా దేశ్ వెబినార్ పరంపరలో భాగంగా డార్జీలింగ్ యొక్క గొప్ప వారసత్వంపై కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తన 14వ వెబినార్ ను "బెంగాల్ బై ది హిమాలయస్" పేరుతో నిర్వహించింది.

Posted On: 04 MAY 2020 1:30PM by PIB Hyderabad

భారతదేశంలోని హిమాలయ ప్రాంతాలు సంవత్సరం పొడవునా పర్యాటకులు దర్శించడానికి అనువుగా ఉండి, వివిధ రకాల అనుభవాలకు నెలవుగా ఉంటాయిహిమాలయ పర్వత శ్రేణుల్లో 73 శాతం భారతదేశంలోనే ఉన్నాయి.  అన్ని రకాల సాహసకృత్యాలకు కేంద్రంగా ఉంటాయి. గొప్ప వృక్ష జాలం, జంతుజాలంతో పాటు జీవవైవిధ్య కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయిఎత్తైన శిఖరాలు పక్కనే సుందరమైన సరస్సులతో వైవిధ్య భరితమైన సంస్కృతికి నిలయం హిమాలయాలుఆధ్యాత్మికతో పాటు ఆరోగ్యానికీ, స్వస్థతకీ ఈ ప్రదేశం ఎంతో అనువుగా ఉంటుంది

పర్యాటక మంత్రిత్వశాఖ 2020 మే నెల 2వ తేదీన " బెంగాల్ బై ది హిమాలయాస్" పేరుతో ఏర్పాటుచేసిన 14వ భాగాన్ని హెల్ప్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన శ్రీ సుప్రతిమ్ (రాజ్) బసు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన డార్జీలింగ్ ప్రత్యేకతలనుడార్జీలింగ్ టీ చరిత్రను, డార్జీలింగ్ హిమాలయన్ రైల్వే (డి.హెచ్.ఆర్.) లేదా బొమ్మ రైలు కథను వివరించారుట్రెక్స్ & ట్రైల్స్, డాక్ బంగ్లాల వారస్తత్వం, చార్టర్ ట్రైన్, అక్కడ గ్రామాల సంస్కృతి, కుటీరాల్లో నివాసం మొదలైన వాటి గురించి కూడా సోదాహరణంగా తెలియజేశారు. 

భారతదేశంలోని హిమాలయ ప్రాంతాలను సంవత్సరం పొడవునా సందర్శించడానికి పర్యాటకులకు అనేక అవకాశాలను కల్పిస్తూ, హిమాలయాలను ఒక పర్యాటక గమ్యంగా పర్యటక మంత్రిత్వశాఖ ప్రోత్సహిస్తోంది.  కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ "స్వదేశ్ దర్శన్" పధకం కింద దేశంలోని అనేక దర్శనీయ స్థలాలను కలుపుతూ,  ప్రణాళిక బద్ధంగాప్రాధాన్యతా క్రమంలో అనేక పర్యాటక ప్యాకేజీలను రూపొందించి పర్యాటకులను ప్రోత్సహిస్తోంది.  ఈ పధకం కింద హిమాలయాల చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఒక ప్యాకేజీ కింద గుర్తించింది. 

దేశంలో  సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించే చారిత్రాత్మక చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో కొత్తగా వంద పర్వతారోహక ప్రదేశాలను ప్రారంభించింది.    

పర్యాటక మంత్రిత్వశాఖ కు చెందిన "దేఖో అప్నా దేశ్వెబినార్ పరంపరలో భాగంగా 2020 మే 2వ తేదీన తన 14వ భాగంలో  "బెంగాల్ బై ది హిమాలయాస్" కధలను ప్రదర్శించడం జరిగింది

ఈ వెబినార్  కార్యక్రమాలను https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured  వెబ్ సైట్ పై అందుబాటులో ఉంచారు.   దీనితో పాటు  భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖకు చెందిన అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ వీక్షించవచ్చు. 

 

తదుపరి వెబినార్ ను "పంజాబ్ - బియాండ్ బ్రోచర్స్" పేరుతో 2020 మే నెల 5వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.  

 

*******



(Release ID: 1620907) Visitor Counter : 148