శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 సన్నద్ధతపై సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంతో సమావేశమైన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్దన్
భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్నిడిఎస్‌టి, దాని స్వయం ప్రతిపత్తి గల సంస్థలు అంతర్జాతీయ సంస్థలకు తీసుకువెళ్ళాయి- డాక్టర్ హర్షవర్ధన్
కోవిడ్ పై -19 “ కోవిడ్ కథ” పేరుతో మల్టీ మీడియా గైడ్‌ను ప్రారంభించిన డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
03 MAY 2020 8:36PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, భూ విజ్ఞాన శాస్త్ర శాఖ మంత్రి , డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు అటానమస్ సంస్జలు(ఎఐ), డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ సబార్డినేట్ కార్యాలయాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ , టెక్నాలజీ 50 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారు చేపట్టిన శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ఆవిష్కరణలు, కోవిడ్ -19 మహమ్మారికి సంబంధించి వీరి కృషిపై ఆయన చర్చించారు.
డాక్టర్ హర్ష వర్దన్ “కోవిడ్ కథ” , పేరుతో కోవిడ్ -19 మల్టీ మీడియా గైడ్ ను ఆవిష్కరించారు. డిఎస్‌టి శాస్త్రసాంకేతిక రంగంలో దేశానికి సేవచేయడంలో 50 వసంతంలోకి అడుగుపెట్టింది.ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇందుకు సంబంధించి ఏడాదిపొడవునా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి) కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ ,డిఎస్‌టి చేపట్టిన ప్రధాన కార్యక్రమాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ఈ సంస్థ రాగల 5 సంవత్సరాలలో చేపట్టనున్న కార్యకలాపాల గురించి వివరించారు. కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా పరిశోధన, అభివృద్ధి సంస్థలు, అధ్యయన సంస్థలు, స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఇల నుంచి టెక్నాలజీ మ్యాపింగ్ ను గుర్తించి డయాగ్నస్టిక్స్‌కు మార్కెట్ రెడీ పరిష్కారాలకు ఫండ్ అందించడం.పరీక్షల నిర్వహణ, ఆరోగ్య సేవలు అందించడానికి కృషిచేయడం జరుగుతోందన్నారు.
నేషనల్ సైన్స్ , టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌ఎస్‌టిఇడిబి), సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్‌మెంట్ & డెవలప్‌మెంట్ (సీడ్) సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (ఎస్‌ఇఆర్‌బి), టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టిడిబి) , సర్వేఆఫ్ ఇండియా (ఎస్.ఒ.ఐ వంటి చట్టబద్దమైన సంస్థల నుండి సీనియర్ శాస్త్రవేత్తలు అధికారులు భారతదేశంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న వివిధ చర్యల గురించి వివరించారు..
అలాగే, శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (SCTIMST), తిరువనంతపురం, ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI), హైదరాబాద్, జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (JNCAS), నానో అండ్ సాఫ్ట్ మేటర్ సైన్సెస్ (సిఎన్ఎస్), బెంగళూరు, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్), అహ్మదాబాద్, ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ (ఎస్‌ఎన్‌బిఎన్‌సిబిఎస్), కోల్‌కతా సంస్థలు ఈ సంక్షోభానికి అడ్డుకట్ట వేయడానికి తాము చేసిన సన్నాహాల గురించి తెలిపాయి..
50 వ ఫౌండేషన్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ హర్ష్ వర్ధన్ డిఎస్టిని అభినందించారు, "డిఎస్టి , దాని స్వయంప్రతిపత్తి సంస్థలు భారతదేశంలో సైన్స్ , టెక్నాలజీని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాయి. సమాజాలలోని ప్రజలకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చాయి. ఈ సంస్థలు , విభాగాలలో పోటీ వాతావరణంలో జాతీయ శాస్త్ర సాంకేతిక విజ్ఙాన సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి డిఎస్టి మన దేశంలో పెద్ద ఎత్తున పరిశోధన, అభివృద్దికి మద్దతు అందిస్తోంది. సైన్స్ సైటేషన్ ఇండెక్స్ జర్నల్స్‌లో ప్రచురణల సంఖ్య పరంగా చైనా , యుఎస్ తరువాత ప్రపంచవ్యాప్తంగా మనదేశం 3 వ స్థానాన్ని పొందడానికి డిఎస్‌టి ప్రయత్నాలు సహాయపడ్డాయి.”
కోవిడ్ -19 పై పోరాటంలో భారత శాస్త్రవేత్తల తక్షణ ప్రతిస్పందన గురించి ప్రశంసించిన ఆయన, “భారతీయ శాస్త్రవేత్తలు ఏదైనా సవాలును ఎదుర్కోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు, ఈసారి కూడా వారు దేశాన్ని నిరాశపరచలేదు. అని అన్నారు. అనేక రంగాల్లో వేగంగా పెద్ద ఎత్తున చర్యలు అవసరమని మనం గుర్తుంచుకోవాలి, వీటిలో: (i) స్కేల్అప్ కోసం సిద్ధంగా ఉన్న సంబంధిత సాంకేతిక పరిష్కారాలను గుర్తించడానికి మద్దతు ఇవ్వడానికి అంకుర సంస్థల సమగ్ర మ్యాపింగ్; (ii) మోడలింగ్, వైరస్ లక్షణాలు దాని ప్రభావం, వినూత్న పరిష్కారాలు మొదలైన వాటిపై పనిచేసే అధ్యయన సంస్థలుచ,ఆర్ అండ్ డి ల్యాబ్‌ల నుండి పరిశ్రమలు , ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం; (iii) పరిష్కారాలను అందించడంలో సంబంధిత డిఎస్‌టి స్వయంప్రతిపత్తి సంస్థలు క్రియాశీలంగా ఉండడం ముఖ్యమైనవి. మన డి.ఎస్.టి శాస్త్రవేత్తలు అది సాధించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించిన ఎస్.సి.టిఐఎంఎస్‌టి, తిరువనంతపురం ఇప్పటికే 10 కి పైగా సమర్థవంతమైన ఉత్పత్తులతో ముందుకు వచ్చింది, వీటిలో చాలా వినూత్నమైనవి ఉననాయి.ఇవి వేగంగా వాణిజ్యపరమైన స్థాయికి చేరుకుంటున్నాయి ”అని ఆయన అన్నారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించిన రూ. 8,000 కోట్ల నేషనల్ మిషన్ ఆన్ క్వాంటం టెక్నాలజీ అండ్ అప్లికేషన్ (ఎన్‌ఎం-క్యూటిఎ) గురించి ప్రత్యేక ప్రస్తావన చేశారు. “క్వాంటం టెక్నాలజీస్ క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం క్రిప్టోగ్రఫీ, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం మెట్రాలజీ , సెన్సింగ్, క్వాంటం మెరుగైన ఇమేజింగ్ మొదలైనవి. సాధారణ ప్రజల ప్రయోజనం కోసం ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఫలాలను తీసుకురావడం ద్వారా డిఎస్‌టి దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను.” అని ఆయన అన్నారు.
.
*****
(Release ID: 1620836)
Visitor Counter : 238