కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

పీఎం కేర్స్ ఫండ్‌కు ఈపీఎఫ్ఓ ఉద్యోగుల రూ.2.5 కోట్ల విరాళం

Posted On: 03 MAY 2020 5:12PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మహమ్మారి జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కోనే విష‌య‌మై ప్రభుత్వ తీసుకుంటున్న చొరవకు మద్దతు ఇవ్వడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగులు కూడా ముందుకు వచ్చారు. వారు త‌మ ఒక రోజు జీతం మొత్తం రూ.2.5 కోట్లను స్వచ్ఛందంగా పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా అంద‌జేశారు. ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థలలో ఈపీఎఫ్ఓ ఒకటిగా వెలుగొందుతూ సాధ్యమైనంత గ‌రిష్ఠ ‌స్థాయిలో దేశ సేవకు కట్టుబడి ప‌ని చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన కోవిడ్‌-19 వైర‌స్ వ‌ల్ల మిలియన్ల మంది భారతీయుల ఆరోగ్యం మరియు ఆర్థిక భద్రతకు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. ఏవైనా అత్యవసర లేదా బాధ క‌ర పరిస్థితులను ఎదుర్కోవాలనే ప్రాథ‌మిక లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘ప్రధానమంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల నిధి’ (పీఎం కేర్స్ ఫండ్) పేరుతో పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. పీఎంజీకేవై ప్యాకేజీ కింద కోవిడ్ క్లెయిమ్‌లతో సహా ఈపీఎఫ్ సొమ్ము ఉపసంహరణ క్లెయిమ్‌లను త్వరితగతిన ప్రాసెస్ చేయడం ద్వారా వేత‌న జీవుల‌కు ఉపశమనం క‌లిగించేందుకు గాను అదనపు ప్రయత్నాల ద్వారా ఈపీఎఫ్ఓ అధికారులు మరియు సిబ్బంది ఈ క‌ష్ట ప‌రిస్థితుల్లో త‌గిన సహకరం అందిస్తూ వ‌స్తున్నారు. 

 


(Release ID: 1620663)