సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ప్రముఖ పురావస్తు శాస్త్రజ్ఞుడు ప్రొఫసర్ బి.బి.లాల్ శత జయంతి సంవత్సరం సందర్బంగా ఢిల్లీలో "ప్రొఫసర్ బి.బి.లాల్-ఇండియా రీడిస్కవర్డ్" ఈ-పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి

ప్రొఫెసర్ లాల్ భారతీయ పురావస్తు శాస్త్రం విలువైన రత్నం, అతను వలసరాజ్యాల కాలంలో ఖననం అయిన నాగరిక భారతదేశాన్ని పునరావిష్కరణ చేశారు - శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్

Posted On: 02 MAY 2020 12:46PM by PIB Hyderabad

ప్రముఖ పురావస్తు శాస్త్రజ్ఞుడు ప్రొఫసర్ బి.బి.లాల్ శత జయంతి సంవత్సరం సందర్బంగా ఢిల్లీలో  జరిగిన ఒక కార్యక్రమంలో  "ప్రొఫసర్ బి.బి.లాల్-ఇండియా రీడిస్కవర్డ్"  ఈ-పుస్తకాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ ఆవిష్కరించారు. సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ ఆనంద్ కుమార్ కూడా ఈ సందర్బంగా పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని శతజయంతి కోసం ప్రత్యేకంగా  సాంస్కృతిక శాఖ  ప్రచురించింది. 1921 మే 2వ తేదీన ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా బైదొర లో జన్మించిన ప్రొఫెసర్ లాల్ పురావస్తు శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి ఎన్నో సేవలు అందించారు. ఈ ఉదయం కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ ఉదయం ప్రొఫసర్ బి.బి.లాల్ నివాసానికి వ్యక్తిగతంగా వెళ్లి ఆయనకు జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.    

ఈ సందర్భంగా శ్రీ పటేల్ మాట్లాడుతూ ప్రొఫెసర్ బి.బి.లాల్ ఇతిహాసానికి సజీవ సాక్ష్యం అని, ఆయనలాంటి గొప్ప వ్యక్తి ఉండడం భారతదేశం ఎంతో అదృష్టం చేసుకుందని అన్నారు.

 

ప్రొఫెసర్ బి. బి. లాల్ కి 2000 సంవత్సరంలో పద్మ భూషణ్  ప్రదానం చేశారు. 1968 నుండి 1972 వరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. సిమ్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రొఫెసర్ లాల్ వివిధ యునెస్కో కమిటీలలో కూడా పనిచేశారు. 1975-76 నుండి ప్రొఫెసర్ లాల్ అయోధ్యభరద్వాజ ఆశ్రమశ్రీంగవరపురనందిగ్రామచిత్రకూట వంటి రామాయణానికి సంబంధించిన పురావస్తు పరిశోధనలు చేశారు. ప్రొఫెసర్ లాల్ వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలపై 20 పుస్తకాలు మరియు 150 కి పైగా పరిశోధనా వ్యాసాలను రచించారు.

*****


(Release ID: 1620382)