రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే భద్రత, కార్యకలాపాల సామర్థ్యం మెరుగుకు కృషి; ప్రధాన మార్గాలు, వంతెనల నిర్వహణ పనుల్లో భారత రైల్వేశాఖ వెన్నెముక సిబ్బంది నిమగ్నం; దేశవ్యాప్త దిగ్బంధం వేళ యార్డుల ఆధునికీకరణ, సిజర్స్ క్రాస్-ఓవర్ల నవీకరణ పనులు
వివిధ జోన్లలో అనేక సంవత్సరాల తరబడి పెండింగ్ పనులతో రైల్వేలకు చిక్కులు;
500 ఆధునిక-భారీ రైలుపట్టాల నిర్వహణ యంత్రాలు, ట్రాక్-సిగ్నల్-ఓవర్‌హెడ్ పరికరాలతో 10,749 యాంత్రిక పనిదినాల పనులు పూర్తి; 12,270 కిలోమీటర్ల సాధారణ మార్గం; అందులో 5,263 మలుపుల నిర్వహణ పనులన్నీ సంపూర్ణం;
అల్ట్రాసోనిక్ లోపాన్వేషణ యంత్రంతో 30,182 కిలోమీటర్ల మార్గం తనిఖీ;
రైలు మార్గాల్లో పట్టాలమధ్య పాడైన 1,34,443 వెల్డింగ్ అతుకులు పూర్తి;
దిగ్బంధాన్ని ఓ జీవితకాలపు అవకాశంగా పరిగణించి.. నిర్వహణ సంబంధిత
పెండింగ్ పనుల పూర్తికి ప్రణాళిక రూపకల్పన; పకడ్బందీగా అమలు
प्रविष्टि तिथि:
02 MAY 2020 1:14PM by PIB Hyderabad
భారత రైల్వేలకు వెన్నెముక వంటి సిబ్బంది యోధులు ప్రపంచ మహమ్మారి వ్యాప్తి ఫలితంగా విధించిన జాతీయ దిగ్బంధం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ మేరకు రైల్వేశాఖ పరిధిలోని వివిధ జోన్లలో దీర్ఘకాలం నుంచీ పెండింగ్‌లో పడిన అనేక పనులను సకాలంలో పూర్తిచేశారు. ఇందులో భాగంగా అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో పడి, చిక్కులకు దారితీస్తున్న యార్డుల ఆధునికీకరణ, సిజర్స్ క్రాస్‌ఓవర్ల నవీకరణ, వంతెనల మరమ్మతులు వంటి నిర్వహణ కార్యకలాపాలను రైల్వే సిబ్బంది దిగ్విజయంగా పూర్తిచేశారు. ఒకవైపు దేశవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసరాలు, వైద్య సామగ్రి కొరతలేకుండా సరఫరా శృంఖలానికి రైల్వేశాఖ పూర్తిస్థాయిలో చేయూత అందించింది. అదే సమయంలో రైళ్ల నిలిపివేత ఫలితంగా లభించిన సమయం, సౌలభ్యాలను ‘జీవితంలో ఓ సారి లభించిన సదవకాశం’గా పరిగణించి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిక్కులకు దారితీస్తున్న లోటుపాట్లన్నిటినీ సరిదిద్దుకుంటూ వచ్చింది. ఇందులో భాగంగా అనేక వంతెనలు, క్రాస్-ఓవర్ మార్గాలు, గర్డర్ల మార్పు, కాంక్రీట్ నిర్మాణాల మరమ్మతులు, కొత్త ఏర్పాట్లు, యార్డుల ఆధునికీకరణ వగైరా పనులన్నిటినీ పూర్తిచేసింది. పనికిరాని రోడ్ ఓవర్ బ్రిడ్జిలను తొలగించి రహదారులను విశాలం చేసింది. సాధారణ రోజుల్లో ఈ పనులన్నీ చేయాల్సి వస్తే, రైలు-రహదారి మార్గాలన్నిటా రాకపోకలను నిత్యం కొన్ని గంటలవంతున కొన్ని రోజులపాటు పనులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వెసులుబాటు లభించడంతో అన్ని పనులూ సజావుగా పూర్తయ్యాయి.


|

|

|
|

|

|

|

|

|
|

|

|

|

|

|

|

|

|
*****
(रिलीज़ आईडी: 1620377)
आगंतुक पटल : 222