ప్రధాన మంత్రి కార్యాలయం

పౌర విమానయాన రంగాన్ని గురించి చర్చించడం కోసం ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 01 MAY 2020 5:53PM by PIB Hyderabad

భారతదేశ పౌర విమానయాన రంగాన్ని మరింత సమర్ధం గా తీర్చిదిద్దడం లో సహాయకారి కాగల వ్యూహాల ను సమీక్షించడం కోసం ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న నిర్వహించారు.  ప్రయాణాలు చేసే ప్రజల కు విమానాల లో వెచ్చించవలసి వచ్చే కాలం తగ్గి, తద్ద్వారా వారి కి ప్రయోజనం చేకూరే విధం గా భారతదేశ గగనతలాన్ని కార్యసాధకం గా వినియోగించవలసి ఉన్నదని, అలాగే సైన్య వ్యవహారాల విభాగం యొక్క సన్నిహిత సహకారం తో విమాన సంస్థ లకు వాటి వ్యయాల ను ఆదా చేసుకోవడం లో సాయపడాలని నిర్ణయించడమైంది.

విమానాశ్రయాల లో మరింత సామర్థ్యాన్ని సంతరించడం తో పాటు మరింత ఆదాయాన్ని సంపాదించుకోవడం కోసం మరో 6 విమానాశ్రయాల ను- మూడు నెల ల లోగా టెండర్ ప్రక్రియ ను మొదలుపెట్టడం ద్వారా- పిపిపి ప్రాతిపదిక న అప్పగించే ప్రక్రియ ను త్వరపరచ వలసింది గా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కు సూచన చేయడమైంది.

సమావేశ క్రమం లో ఇ-డిజిసిఎ పథకాన్ని సైతం సమీక్షించడమైంది.  ఈ పథకం డిజిసిఎ యొక్క కార్యాలయం లో మరింత పారదర్శకత్వాన్ని కొనితెస్తుంది.  అంతేకాక వివిధ లైసెన్స్ లు/ అనుమతుల కోసం పట్టే కాలాన్ని తగ్గించడం ద్వారా సంబంధిత వర్గాలన్నిటి కి సహాయకారి గా నిలవనున్నది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు ఆ శాఖ అధీనం లో గల సంస్థ లు అమలు పరచే అన్ని సంస్కరణ కార్యక్రమాలు ఒక కాలబద్ధమైన విధానం లో ముందుకు సాగాలని కూడా నిర్ణయం తీసుకోవడమైంది.

హోం మంత్రి, ఆర్ధిక మంత్రి, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి, ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ల తో పాటు భారత ప్రభుత్వం లోని ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశాని కి హాజరయ్యారు.


***



(Release ID: 1620164) Visitor Counter : 219