పర్యటక మంత్రిత్వ శాఖ

ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాఖ దేఖో అప్నా దేశ్ సిరీస్ 12 వెబినార్‌ లో భాగంగా ‘ బాధ్య‌తాయుత ప‌ర్యాట‌కంలో అద్భుత మ‌హిళ‌లు‌’ కార్య‌క్ర‌మాన్ని స‌మ‌ర్పించింది.

Posted On: 01 MAY 2020 4:00PM by PIB Hyderabad

ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాఖ 12 వ వెబి‌నార్ లో 30 ఏప్రిల్ , 2020న‌ " దేఖో అప్నా దేశ్ సిరీస్" లో భాగంగా ‘ బాధ్య‌తాయుత ప‌ర్యాట‌కంలో  అద్భుత మ‌హిళ‌లు‌’ కార్య‌క్ర‌మాన్ని  ఏర్పాటు చేసింది. ఇందులో ప‌ర్యాట‌క రంగానికి చెందిన భార‌త‌దేశంలోని కొంద‌రు అద్భుత మ‌హిళ‌ల శ‌క్తిమంత‌మైన వ్య‌క్తిగ‌త క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేసింది. వీరు ప‌ర్యాట‌కానికి ప్ర‌త్యామ్నాయ ఆలోచ‌న‌లు తొడిగారు.
పర్యాటకం ద్వారా వ్యక్తులు, తమ జీవితంలో, వారు నివసించే సమాజాలలో మార్పును ఎలా సృష్టించవచ్చో వెబి‌నార్ లో వివరించారు. ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా స్థానిక వ‌న‌రుల‌ను వినియోగించుకోవ‌డం, స్థానికుల ఇళ్ల‌లో విడిదిచేయ‌డం, చిన్న కుటుంబం న‌డిపే హోట‌ల్ లో తిన‌డం ,ఇలాంటివ‌న్నీ  స్థానికులకు చాలా పెద్ద మార్పు క‌నిపించేలా చేస్తాయి.. ఆ ర‌కంగా  పర్యాటకం నుండి ప్రయోజనం పొందే ప్రాంతాలను  విస్తృతం చేయ‌డంలో ఇది సహాయపడుతుంది.

ఔట్‌లుక్ ప‌బ్లిషింగ్ గ్రూప్కు చెందిన ఔట్‌లుక్ రెస్పాన్సిబుల్ టూరిజం ఇనిషియేటివ్ టీమ్ స‌భ్యులు సొయిటీ బెన‌ర్జీ,రాధికా పి.నాయ‌ర్‌, సోనాలి చ‌ట‌ర్జీ దీనిని రూపొందించారు. కోవిడ్ అనంత‌ర ప్ర‌పంచంలో,  హోమ్ స్టేలు, మారు మూల ప‌ర్యాట‌క ప్రాంతాలు ఎక్కువ మందిని ఆక‌ర్షించ‌నున్న నేపథ్యంలో ఈ అద్బుత మ‌హిళ‌ల పాత్ర ప‌ర్యాట‌క రంగంలో ఏవిధంగా కీల‌కం కానున్నదో వారు వివ‌రించారు.
వెబినార్ ప‌ది ప్రేర‌ణాత్మ‌క క‌థ‌నాల‌ను ఈ కార్య‌క్ర‌మంలో స‌మ‌ర్పించింది..

 •స్టాన్జిన్ డోల్కర్, ల‌ద్దాక్ లోని మాన్ గ్రామానికి చెందిన ,  జూనియర్ ఖగోళ శాస్త్రవేత్త, టెలిస్కోప్ ఆపరేటర్ , ఆస్ట్రోప్రెనియూర్.
• సునీతా మ‌రావి, క‌న్హా స‌మీపంలోని బంధ తొలా గ్రామానికి చెందిన ఒక సామాన్య ఉపాధ్యాయురాలు,
 పూసల‌ ఆభరణాల తయారీదారు.
•  ఫెజిన్ కొన్యాక్, నాగాలాండ్‌లోని మోన్ జిల్లా ,షియాంగ్ గ్రామానికి చెందిన, కాఫీ పెంపకందారు, హోమ్‌స్టే యజమాని ,ఎథ్నోగ్రాఫర్ ఆమె కాఫీ తోటలు, నారింజ పండ్ల తోటలను నిర్వహిస్తున్నారు  కొన్యాక్ ల‌ పచ్చబొట్టు ఆచారాన్ని   డాక్యుమెంట్ చేస్తున్నారు..
• ల‌క్ష్మి, ఢిల్లీ, ఎన్‌సిఆర్‌కు చెందిన హాస్పిటాలిటీ నిపుణురాలు,మసాజ్ వృత్తిలో ఉన్నారు, ఆమె వైకల్యాలను అధిగమించి ఆతిథ్యరంగం,  మసాజ్ చికిత్సా వృత్తిని ఎంచుకున్నారు..
• రేఖా రౌతేలా,ఉత్తరాఖండ్‌లోని మున్సియారిలోని సర్మోలి గ్రామానికి చెందిన , హోమ్ స్టే యజమాని, బర్డ్ వాచింగ్ నిపుణురాలు  వాన్ పంచాయతీకి  పంచ్.
• రక్షా పటేకర్, మహారాష్ట్రలోని డెహేన్ గ్రామానికి చెందిన గ్రామీణ పర్యాటక నిపుణురాలు. మాస్టర్ ట్రైనర్, కమ్యూనిటీ ఆధారిత పర్యాటక ప్రాజెక్టులకు ఆతిథ్య శిక్షణ ఇస్తున్నారు.
• సజ్నా షాజీ, కేరళలోని వయనాడ్‌లోని మోతక్కర కు చెందిన వారు.  డ్రమ్మర్ , ట్రావెల్ గైడ్.
• పబిత్రా మాయ ఖావాస్, హోమ్‌చెఫ్ , ఉత్తర బెంగాల్‌లోని చుఖిమ్‌కు చెందిన పారిశ్రామికవేత్త.
• అండమాన్ , నికోబార్ దీవులకు చెందిన సుమిత్రా బిస్వాస్, స్కూబా డైవర్ , జ‌లాంత‌ర్గ‌త‌ రీఫ్ రిస్టోరర్.

పర్యాటక మంత్రిత్వ శాఖ  వెబి‌నార్ సిరీస్ , లక్ష్యం భారతదేశంలోని వివిధ పర్యాటక గమ్యస్థానాల గురించి అవగాహన కల్పించడం వాటిని ప్రోత్సహించడం , అంత‌గా తెలియ‌ని గమ్యస్థానాలు ,జనాదరణ పొందినా దానికిగ‌ల బ‌హుముఖీన‌త గురించి తెలియ‌ని గమ్యస్థానాల గురించి తెలియ‌జెప్ప‌డం కూడా దీని ల‌క్ష్యం.
ఈ వెబినార్‌ల‌ను చూడ‌లేక‌పోయిన వారి కోసం ఈ సెష‌న్‌లు కింది లింక్‌లో అందుబాటులో ఉన్నాయి.

https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/
అలాగేఇవి భార‌త ప్ర‌భుత్వ టూరిజం మంత్రిత్వ‌శాఖ అన్ని సామాజిక మాధ్య‌మ హ్యాండిల్స్‌పై ఉన్నాయి.

 


*******


(Release ID: 1620119) Visitor Counter : 204