భారత పోటీ ప్రోత్సాహక సంఘం

టెక్ డేటా కార్పొరేషన్‌లో 100% వాటాలను కొనుగోలు చేయడం మరియు నియంత్రణను పొందేందుకు టైగర్ మిడ్కో ఎల్ఎల్‌సీ చేసిన‌ ప్ర‌తిపాద‌న‌కు సీసీఐ ఆమోదం

Posted On: 30 APR 2020 8:04PM by PIB Hyderabad

టెక్ డేటా కార్పొరేషన్‌లో 100% వాటాలను కొనుగోలు చేయడం మరియు నియంత్రణను టైగర్ మిడ్కో ఎల్ఎల్‌సీ సొంతం చేసుకునేందుకు గాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. టైగ‌ర్ మిడ్‌కో అనుబంధ సంస్థ అయి‌న టైగ‌ర్ మెర్జ‌ర్ స‌బ్‌కోను టెక్ డేటాతో
విలీనం చేసిన త‌రువాత.. టైగర్ మిడ్కో ఎల్ఎల్‌సీ సంస్థ టెక్‌డేటా కార్పొరేషన్‌‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌రిశీలించిన సీసీఐ తాజా త‌న ఆమోదం తెలిపింది. టైగర్ మిడ్కో అనేది అపోలో మేనేజ్మెంట్ ఎల్.పి. యొక్క అనుబంధ సంస్థలచే నిర్వహించబడే పెట్టుబ‌డి నిధుల‌తో న‌డిచే స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహ‌క‌ల్ (ఎస్‌పీవీ). ఇది ప్రపంచ వ్యాప్తంగా వివిధ వ్యాపారాలలో పాల్గొన్న సంస్థలు జారీ చేసిన‌ ఈక్విటీ మరియు రుణాలలో పెట్టుబడి పెట్టిన నిధులను నిర్వహిస్తూ వ‌స్తోంది. టెక్ డేటా సంస్థ అమెరికాలోని నాస్‌డాక్‌లో లిస్టెడ్ సంస్థ‌. రీసెల్ల‌ర్స్‌కు సంబంధించి టెక్నాలజీ ఉత్పత్తులు, ఇత‌ర సొల్యూష‌న్స్‌ల‌ టోకు పంపిణీ విష‌యంలో ఈ సంస్థ ‌చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తోంది. టెక్ డేటా అడ్వాన్స్‌డ్ సొల్యూషన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా భారతదేశంలో టెక్ డేటా సంస్థ త‌న
కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. టెక్ డేటా కార్పొరేషన్‌లో 100% వాటాలను కొనుగోలు చేయడం మరియు నియంత్రణను టైగర్ మిడ్కో ఎల్ఎల్‌సీ సొంతం చేసుకునేందుకు గాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జారీ చేసిన వివ‌ర‌ణాత్మ‌క అర్డ‌ర్ వెలువ‌డాల్సి ఉంది. 



(Release ID: 1619824) Visitor Counter : 105