శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో హెల్త్ అండ్ రిస్క్ కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిఎస్ టి
వైరస్ వ్యాప్తిని నిరోధించడానికిగాను ఉత్తమ, సమర్థవంతమైన విధానాల ప్రచారమనేది అత్యంత ప్రాధాన్యతగల అంశం : ప‌్రొఫెసర్ ఆషుతోష్ శర్మ, కార్యదర్శి, డిఎస్ టి
Posted On:
30 APR 2020 6:09PM by PIB Hyderabad
నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ( ఎన్ సి ఎస్ టిసి), శాస్త్ర సాంకేతిక విభాగం రెండూ కలిసి హెల్త్ అండ్ రిస్క్ కమ్యూనికేషన్ అనే అంశంపై ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కోవిడ్ -19 నేపథ్యంలో ఇయర్ ఆఫ్ అవేర్ నెస్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్ ( వైఏఎస్ హెచ్)) అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆరోగ్యానికి సంబంధించి అట్టడుగు స్థాయికి కూడా సరైన సమాచారం అందాలనే లక్ష్యంతో దీన్ని మొదలుపెట్టారు. ఆరోగ్యరంగానికి సంబంధించిన అన్ని అంశాలపై ప్రజల్లో తగిన స్పృహ కలిగించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు దేశవ్యాప్తంగా అనేక సవాళ్లకు కారణమయ్యాయి. శాస్త్ర సాంకేతిక చైతన్యం, వైద్య ఆరోగ్య పరంగా సంసిద్ధత అనేవి ఆరోగ్యపరైమన అత్యవసర పరిస్థితులపైపోరాటానికి ఉపయోగపడతాయి.
ఈ కార్యక్రమంద్వారా శాస్త్ర పరంగా అభివృద్ధి, ఆరోగ్యం, ప్రమాదం పొంది వున్న పరిస్థితులకు సంబంధించి సాప్ట్ వేర్ తయారీ, శిక్షణ పొందిన ప్రచారకులు, ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో పలు వర్గాల ప్రజలకు సేవలందించేవారిని తయారు చేసుకోవడం జరుగుతుంది.
ఈ కార్యక్రమం కింద పలు వ్యూహాలను రూపొందించారు. విద్యారంగం, పరిశోధన, మీడియా, స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందినవారిని భాగస్వాములను చేస్తారు. వీరి ద్వారా సమాజంలో తగిన చైతన్యం పెంచి సవాళ్లను ఎదుర్కొంటారు.
ప్రజలకు సరైన సమాచరం అందించడం ద్వారా ప్రజారోగ్యవ్యవస్థలో వచ్చే నష్టాలను సాధ్యమైనంతమేరకు తగ్గిస్తారు. దీనికోసం పలు కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తారు. వ్యక్తిగత పారిశుద్ధ్యం, భౌతిక దూరం, నియమ నిబంధన ప్రకారం నడుచుకోవడం ఇలా పలు విషయాలపై సమాచారాన్ని ప్రజలకు అందిస్తారు.
కోవిడ్ -19 చికిత్సకోసం ఇంకా వ్యాక్సిన్లు రాలేదు కాబట్టి చికిత్సకు సంబంధించిన ఉత్తమమైన విధానాలను ప్రజలకు తెలియజేయడం చాలా ముఖ్యమైన విషయం. ఇది సమాజంలోని అన్ని వర్గాలకు చేరాలి. దాంతో కమ్యూనికేషన్ వ్యూహాలు బహుముఖంగా కొనసాగాలి. ఆసక్తికరంగా వుండాలి. సమాచార హితంగా వుండి వేగంగా ప్రజలకు చేరాలని డిఎస్ టి కార్యదర్శి ప్రొఫెసర్ ఆషుతోష్ శర్మ అంటున్నారు.
శాస్త్రీయమైన, సరైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూనే ప్రజల్లో వున్న దురభిప్రాయాలను తొలగించాల్సి వుంటుంది. సమాజంలోని అన్ని వర్గాల నేతల సాయం తీసుకోవాల్సి వుంటుంది. మత సంస్థల సాయం కూడా అవసరం. ఇలా అనేక విధాలుగా ప్రజలను చేరుకొని అనుకున్న లక్ష్యాలను సాధించడానికి వైఏఎస్ హెచ్ ను రూపొందించారు. మరిన్ని వివరాలకు : డాక్టర్ మనోజ్ కుమార్ పతాయిరియా, అడ్వయిజర్ అండ్ హెడ్ , ఎన్ సి ఎస్ టి సి, mkp[at]nic[dot]in, మొబైల్ నెంబర్: 9868114548
****
(Release ID: 1619810)
Visitor Counter : 241