బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు గనుల ప్రారంభ కార్యాచరణను సులభతరం చేసేలా ప్రాజెక్ట్ పర్యవేక్షణ విభాగాన్ని ప్రారంభించిన బొగ్గు మంత్రిత్వ శాఖ
Posted On:
30 APR 2020 6:04PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బొగ్గు గనుల ప్రారంభ కార్యాచరణను సులభతరం చేయడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ (ఎంఓసీ) ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌ను (పీఎంయు) ప్రారంభించింది.
దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడాన్ని ప్రోత్సహించే క్రమంలో భాగంగా
బొగ్గుల గనుల కేటాయింపులు పొందిన వారికి సకాలంలో ఆమోదం / అనుమతులను పొంది అవి తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలు కల్పించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు. బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ జైన్ గనుల కేటాయింపులు జరిగిన వారితో
గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. బొగ్గు ఉత్పత్తి త్వరగా ప్రారంభమయ్యేలా వారి సమస్యల పరిష్కారానికి గాను కన్సల్టెంట్ సేవలను గనుల కేటాయింపులు పొందిన వారు స్వేచ్ఛగా వాడుకోవాలని ఆయన కోరారు. బొగ్గు గనుల నిర్వహణకు కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి అవసరమైన వివిధ రకాల అనుమతులను పొందడంలో బొగ్గు గనుల కేటాయింపులు పొందిన వారికి సహాయం చేయడానికి పీఎంయు ప్రారంభించబడింది. ఇది దేశంలో బొగ్గు ఉత్పత్తిని మరింత వేగవంతం చేసేందుకు దోహదం చేయనుంది. దీర్ఘకాలంలో కమర్షియల్ బ్లాకుల వేలంపాట నందు బిడ్డర్లను ఆకర్షించడంలో సర్కారు చర్య ఎంతగానో ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఈ చర్య దేశంలో బొగ్గు పరిశ్రమ ఉత్పత్తి మరియు వ్యాపార వాతావరణాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది. పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయు) కన్సల్టెంట్‌గా మెస్సర్స్ కేపీఎంజీ నియమించబడింది.
(Release ID: 1619748)
Visitor Counter : 190