శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 కు సంబంధించి మ్యాథమెటికల్ మరియు స్టిమ్యులేషన్ అంశాల అధ్యయన నిధికి సెర్బ్ ఆమోదం
Posted On:
30 APR 2020 6:08PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిని కట్టడి చేయడానిగాను మ్యాథమెటికల్ మోడలింగ్ మరియు కంప్యూటేషనల్ అంశాలను అధ్యయనం చేయడానికి మాట్రిక్స్ పథకాన్ని రూపొందించారు. దీనికింద ప్రారంభమయ్యే 11 ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ బోర్డు ( సెర్బ్) ఆమోదం తెలిపింది. సెర్బ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని శాస్త్ర సాంకేతిక విభాగం కింద పని చేసే చట్టబద్దమైన సంస్థ.
కోవిడ్ -19 మహమ్మారి రోగుల జనాభా వైవిధ్యాన్ని, ఎలాంటి రోగ లక్షణాలు లేకపోయినా సరే వైరస్ బారిన పడివారిని, వలస జనాభా సమస్యలు, క్వారంటైన్, సామాజిక దూరం ప్రభావం, లాక్ డౌన్ ప్రభావం, సామాజిక ఆర్ధిక కారణాలు మొదలైనవాటిని ఈ ప్రాజెక్టుల కింద అధ్యయనం చేస్తారు. ఆ తర్వాత మ్యాథెమెటికల్, స్టిమ్యులేషన్ మోడల్స్ తయారు చేస్తారు. ఈ అధ్యయనాలు ప్రధానంగా భారతదేశానికి సంబంధించినవే. ఈ అధ్యయనాలు తద్వారా తయారు చేసే మోడళ్ల ద్వారా భవిష్యత్తులో మహమ్మారి రోగాల గురించి ముందే హెచ్చరించడానికి వీలు కలుగుతుంది. అంతే కాదు వాటిపై చేసే పోరాట కార్యక్రమ నిర్వహణ కూడా సులువవుతుంది.
ప్రతిపాదిత అధ్యయనాలనేవి వైరస్ సోకే అవకాశం ఎంతమేరకు అనేదాన్ని గుర్తిస్తాయి. అంటువ్యాధి నివేదికలు, ఒక రోగినుంచి ఇతర రోగులకు సంక్రమించిన నెట్‌వర్క్ నిర్మాణం తెలిస్తే అధికారుల పని సులువవుతుంది.
కోవిడ్ -19 కారణంగా మాట్రిక్స్ స్పెషల్ కింద వ్యాధి సంక్రమణకు సంబంధించిన డైనమిక్ మోడల్స్ అధ్యయనాలనేవి మహమ్మారి వైరస్‌లపై చేసే పోరాటంలో వైద్య ఆరోగ్య శాఖ నిపుణులకు, పాలకులకు ఉపయోగపడతాయి. తద్వారా సమర్థవంతమైన చర్యలు తీసుకుంటారు.
మాట్రిక్స్ పథకం కింద ప్రతిపాదనలు పంపాలనే సెర్బ్ ప్రకటనకు దేశవ్యాప్తంగా పలువురినుంచి గణనీయమైన ప్రతిపాదనలు వచ్చాయి.
(Release ID: 1619741)
Visitor Counter : 130