శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ల‌ద్దాహ్ హిమాల‌యాల్లో 35 వేల ఏళ్ల క్రితం సంభ‌వించిన న‌ది కోత గురించి వివ‌రాలు బైట‌పెట్టిన డ‌బ్ల్యు టి హెచ్ జి డ‌బ్ల్యు టి హెచ్ జి బృందం చేసిన అధ్య‌య‌నంతో న‌దుల కోత‌, అవ‌క్షేప‌ణ‌పై పెరిగే అవ‌గాహ‌న‌

Posted On: 30 APR 2020 3:25PM by PIB Hyderabad

కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన శాస్త్ర సాంకేతిక విభాగం ప‌రిధిలో ప‌నిచేస్తున్న వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయ‌న్ జియాల‌జీ ( డ‌బ్ల్య టి హెచ్ జి) శాస్త్ర‌వేత్త‌లు లద్దాహ్ హిమాల‌యాల్లో ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. వీరి తాజా ప‌రిశోధ‌న‌ల ఫ‌లితాల ప్ర‌కారం ఈ ప్రాంతంలో 35 వేల ఏళ్ల క్రితం జ‌రిగిన న‌ది కోత గురించి ప‌లు విష‌యాలు తెలిశారు. కోతకు సంబంధించిన ప‌లు ముఖ్య‌మైన ప్రాంతాల‌ను గుర్తించారు. అలాగే బ‌ఫ‌ర్ ప్రాంతాలుగా ప‌నిచేసే బాగా వెడ‌ల్పైన లోయ‌లను కూడా గుర్తించారు. వీరి ప‌రిశోధ‌న‌ల ద్వారా గ‌తంలో న‌దులు ఎలా వుండేవి, నీరు, సెడిమెంట్ రూటింగ్ మొద‌లైన వాటి గురించి వివ‌రంగా తెలుస్తుంది. మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేసుకుంటూ ఆక‌ర్ష‌ణీయ న‌గ‌రాల అభివృద్ధి కోసం దేశం అడుగులు వేస్తున్న త‌రుణంలో ఈ ప‌రిశోధ‌న‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 
ల‌ద్దాహ్ హిహాల‌యాలనేవి గ్రేట‌ర్ హిమాల‌య ప‌ర్వ‌త సానువులు మ‌రియు కారాకోర‌మ్ సానువుల‌కు మ‌ధ్య‌న ఎత్త‌యిన ప్రాంతంలో వున్నాయి. ఈ ప్రాంతం గుండా ఇండ‌స్ న‌దితోపాటు, దాని ఉప‌న‌దులు ప్ర‌వ‌హించాయి. ఇండ‌స్ న‌దికిగ‌ల ముఖ్య‌మైన ఉప‌న‌దుల్లో జ‌న్ స్కార్ న‌ది కూడా వుంది. 
తాజాగా డ‌బ్ల్యు టి హెచ్ జి వెలువ‌రించిన అధ్య‌య‌నాన్ని గ్లోబ‌ల్ అండ్ ప్లానెట‌రీ ఛేంజెస్ లో ప్ర‌చురిత‌మైంది. డ‌బ్ల్యు టి హెచ్ జికి సంబంధించిన శాస్త్ర‌వేత్త‌ల బృందం జ‌న్ స్కార్ న‌ది క్యాచ్ మెంట్ ప్రాంతాన్ని అధ్య‌య‌నం చేశారు.
 ఈ అధ్య‌య‌నానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌కోసం లింకు :
Link to study: https://doi.org/10.1016/j.gloplacha.2019.04.015

 

****



(Release ID: 1619731) Visitor Counter : 83