శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 తో సహా వైరల్ వ్యాపించకుండా చికిత్స చేయడానికి ఉత్తమ రోగ నిరోధక శక్తికి

ఉపయోగపడే ఆక్సీకరణ ఒత్తిడిని మార్చడానికి నానో మెడిసిన్ ను అభివృద్ధి చేసిన - ఎస్.ఎన్.బి.ఎన్.సి.బి.ఎస్.

Posted On: 30 APR 2020 3:21PM by PIB Hyderabad

శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని మార్చడం ద్వారా అనేక రోగాలకు చికిత్సనందించే ఒక సురక్షితమైన, తక్కువ ధరకు లభ్యమయ్యే నానో మెడిసిన్ ను కోల్కతా లోని ఎస్.ఎన్.బోస్ ప్రాధమిక విజ్ఞానశాస్త్రాల జాతీయ కేంద్రం (ఎస్.ఎన్.బి.ఎన్.సి.బి.ఎస్.)  అభివృద్ధి చేసింది. కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం కొనసాగిస్తున్న పోరుకు ఈ పరిశోధన ఒక ఆశా కిరణంలా ఉంటుందిఈ నానో మెడిసిన్ పరిస్థితులను బట్టి మన శరీరంలోని రీయాక్టీవ్ ఆక్సిజన్ స్పీసీస్ (ఆర్.ఓ.ఎస్.) లను పెంచడం లేదా తగ్గించడం చేయగలదు, తద్వారా వ్యాధిని తగ్గిస్తుంది. 

క్షీరదాలలో ఆర్.ఓ.ఎస్. యొక్క నియంత్రిత పెరుగుదల కోసం నిర్వహించిన ఈ నానో మెడిసిన్ పరిశోధన కోవిడ్-19 తో సహా వివిధ వైరస్ ల వ్యాప్తిని అరికట్టడంలో కొత్త ఆశలను కల్పిస్తుందిఅనేక రోగాలను తగ్గించడం కోసం పశువులపై చేసిన రిడక్షన్ & ఆక్సిడేషన్ ప్రాసెస్ (రెడాక్స్) ప్రయోగం పూర్తయ్యింది. మానవులపై ఈ ప్రయోగం ప్రారంభించడానికి ప్రాయోజకుల కోసం సంస్థ ఎదురుచూస్తోంది. 

నిమ్మ వంటి సిట్రస్ ఎక్సట్రాక్ట్, మాంగనీస్ సాల్ట్ కలిపిన మిశ్రమం నుండి తీసిన సూక్ష్మ రేణువులతో ఈ మందు తయారుచేస్తారు.  మాంగనీస్, సిట్రేట్ రెండింటినీ నానో సాంకేతిక పరిజ్ఞానంతో కలిపినప్పుడు ఈ నానో మెడిసిన్ ఉత్పత్తి అవుతుంది.  మన శరీరంలోని కణాలలో రిడక్షన్ & ఆక్సిడేషన్ ప్రక్రియల (రెడాక్స్) సమతుల్యతను కాపాడటానికి 

కృత్రిమంగా తయారు చేసిన ఈ నానో మెడిసిన్ చాలా ముఖ్యమన్న విషయాన్ని కనుగొన్నారు.  కణాల్లో రెడాక్స్ ప్రతిచర్యల వల్ల ఆక్సిజన్ చేరుతుంది లేదా తొలగుతుందికణాల్లో శక్తిని ఉత్పత్తి చేయడం వంటి చాలా ప్రక్రియలకు ఇవి చాలా  అవసరం.  ఈ రెడాక్స్ ప్రతిచర్యలు కణాలకు హాని చేసే రియాక్టీవ్ ఆక్సిజన్ స్పీసీస్ (ఆర్.ఓ.ఎస్.) వంటి ఉత్పత్తులను కూడా తయారుచేస్తాయి.  లిపిడ్స్ (ఫ్యాట్), ప్రోటీన్లున్యుక్లిక్ ఆమ్లాలను అవి తక్షణమే ఆక్సికరణం చేస్తాయివృద్దాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.  అయితే,  మన రోగ నిరోధక కణాలు సహజంగానే ఆర్.ఓ.ఎస్. ను ఉత్పత్తి చేస్తాయి లేదా వైరస్ లేదా బాక్టీరియాతో పాటు మన శరీరంలో పాడైపోయిన కణాలను నశింపచేసే ఆక్సికరణ ఒత్తిడిని ఉత్పత్తి చేస్తాయనే విషయాన్ని గమనించాలి.  ఆవిధంగా, ఆర్.ఓ.ఎస్. యొక్క నియంత్రిత పెరుగుదల లేదా ఆక్సీకరణ ఒత్తిడి మన రోగ నిరోధక కణాలు తమ సహజ క్రియలు మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి సహాయ పడుతుంది. 

జంతువుల కణాల్లో ఈ నానో మెడిసిన్ ద్వారా ఆక్సీకరణ ఒత్తిడిని పెంచడం వల్ల నవజాత శిశువుల్లో వచ్చే కామెర్లతో సహా వ్యాధులను నయం చేసే చికిత్సలో మంచి ఫలితాలు వచ్చాయి.   ఎలుకలపై చేసిన ప్రయోగంలో కామెర్లకు కారణమయ్యే టాక్సిక్ కణాల స్థాయిని రెండున్నర గంటల్లో ఖచ్చితంగా తగ్గించింది. నానో మెడిసిన్ సురక్షితమైనదిగా, మరియు వేగంగా వ్యాధిని తగ్గించేదిగా రుజువయ్యింది.   క్షీరదాల్లో ఆక్సికరణ ఒత్తిడి (ఆర్.ఓ.ఎస్.) నియంత్రిత పెరుగుదల సామర్ధ్యం కోవిడ్-19 తో సహా వైరస్ వ్యాప్తి నియంత్రణకు నానో మెడిసిన్ వాడకానికి కొత్త సామర్ధ్యాన్ని రుజువుచేసిందినెబులైజర్ ద్వారా శ్వాసకోశ నాళం లోకి హైడ్రోజన్ పెరాక్సైడ్ పూయడం వల్ల వచ్చిన అధిక ఆర్.ఓ.ఎస్., వైరస్ నిర్మాణాన్ని విచ్చిన్నం చేయడం ద్వారా కోవిడ్-19 నిర్వీర్యం చేయడానికి సూచించబడింది.  అయితే, హైడ్రోజన్ పెరాక్సైడ్ ను నేరుగా పూయడం వల్ల, సాధారణ శరీర కణాలు ప్రత్యక్షంగా ఆక్సికరణకు గురి కావడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల ఆ రసాయనం బదులు నానో మెడిసిన్ వాడితే  ప్రయోజనకరంగా ఉంటుంది. 

ఈ పరిశోధనా ఫలితాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 

సంబంధిత ప్రచురణల కోసం ఈ వెబ్ సైట్లు చూడండి :

https://doi.org/10.2217/nnm.15.83

https://www.livetradingnews.com/surviving-the-coronavirus-disease-how-hydrogen-peroxide-works-172241.html

https://doi.org/10.1038/s41580-020-0230-3

https://doi.org/10.1002/cmdc.202000098

https://doi.org/10.1515/bmc-2019-0019).]

---------------------------------------------------------------------------

మరింత సమాచారం కోసం దయచేసి సంప్రదించండి: 

డాక్టర్ సమీర్ కే. పాల్, 

సీనియర్ ప్రొఫెసర్, 

ఈ-మెయిల్ : skpal@bose.res.in

Picture 3

============================


(Release ID: 1619727) Visitor Counter : 179