సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

విజిలెన్సు కమీషనర్ గా నేడు పదవీ ప్రమాణం చేసిన ప్రముఖ బ్యాంకర్ శ్రీ సురేష్ ఎన్. పటేల్

Posted On: 29 APR 2020 3:45PM by PIB Hyderabad

శ్రీ సురేష్ ఎన్.పటేల్ విజిలెన్సు కమీషనర్ గా నేడు పదవీ ప్రమాణం చేశారు. భౌతిక దూరం నియమాలు పాటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ విజిలెన్సు కమీషనర్ శ్రీ సంజయ్ కొఠారి వీడియో లింక్ ద్వారా శ్రీ సురేష్ ఎన్.పటేల్ చేత పదవీ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మరో విజిలెన్సు కమీషనర్ శ్రీ శరద్ కుమార్, కార్యదర్శి ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

 

 

బ్యాంకింగ్ రంగంలో శ్రీ పటేల్ కు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఆంధ్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గాను, ఓరియంటల్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను పని చేశారు. అంతే కాకుండా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా, నాబార్డ్ బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ రురల్ డెవలప్మెంట్ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ చైర్మన్ గా, బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ రూరల్, ఎంత్రప్రేన్యూవర్షిప్ డెవలప్మెంట్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.  

ఆర్బీఐకి చెందిన బోర్డు ఫర్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ అఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ (బిపిఎస్ఎస్) శాశ్వత ఆహ్వానితుడిగా శ్రీ పటేల్ ఉన్నారు. విజిలెన్సు కమీషనర్ నియామకానికి ముందు అడ్వైజరి బోర్డు ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ ఫ్రాడ్స్ (ఏబిబిఎఫ్ఎఫ్) సభ్యుడిగా ఉన్నారు. 

విజిలెన్సు కమీషనర్ పదవీ కాలం నాలుగేళ్లు లేదా అతని వయసు 65 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటుంది. సెంట్రల్ విజిలెన్సు కమిషన్ లో సెంట్రల్ విజిలెన్సు కమీషనర్, ఇద్దరు విజిలెన్సు కమిషనర్లు ఉంటారు. 



(Release ID: 1619302) Visitor Counter : 170