గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల నమూనాల సేక‌ర‌ణ‌కు మొబైల్ కియోస్క్‌ను వినియోగిస్తున్న అగర్త‌లా స్మార్ట్ సిటీ

Posted On: 28 APR 2020 5:18PM by PIB Hyderabad

కోవిడ్‌-19 ప‌‌రీక్ష‌ల నమూనాల‌ సేకరణకు వీలుగా అగర్త‌లా స్మార్ట్ సిటీ మొబైల్ కియోస్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌కు అనువుగా ఉండేలా అగ‌ర్త‌లా నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు (సీఎంఓ) దీనిని అందించారు. కియోస్క్ ద్వారా నమూనాల సేక‌రించ‌డం  వైద్యుడికి మేటి రక్షణను క‌ల్పిస్తుంది. దీనికి తోడు వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) వృథాను కూడా ఇది నిరోధిస్తుంది. కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటంలో అగర్త‌లా చేసిన ఈ ప్రయత్నం ఒక ప్రధాన చ‌ర్య‌గా చెబుతున్నారు. మూడు చక్రాల వాహనంలో కియోస్క్‌ను ఏర్పాటు చేయడంతో ఇరుకైన దారుల గుండా వెళ్ల‌డానికి వీలుంటుంది. దీంతో చిన్నచిన్న స్థానిక స‌మూహాల్లోని వారి నుండి కూడా న‌మూనాలు సేక‌రించేందుకు ఇది స‌హాయ‌ప‌డుతుంది. దీంతో కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల నిమిత్తం నమూనాల‌ను ఇవ్వడానికి రోగులు ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు వీలు క‌లుగుతుంది. కియోస్క్ తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ సంఖ్యలో వ్యక్తుల యొక్క కోవిడ్‌-19 వైర‌స్ సామూహిక పరీక్షలు నిర్వ‌హించ‌డాన్ని మ‌రింత‌గా సులభతరం చేస్తుంది. అగర్తలా స్మార్ట్ సిటీ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), అగర్త‌లా న‌గ‌రం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కోవిడ్‌-19పై పోరుకు వీలుగా ఈ  చొరవ తీసుకున్నారు. 

 

****


(Release ID: 1619022) Visitor Counter : 247