మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        తక్కువ ఖర్చుతో కూడిన మెకానికల్ వెంటిలేటర్ రుహ్‌దార్ అభివృద్ధి చేసిన ఐఐటి బొంబాయి విద్యార్థి నేతృత్వంలోని బృందం
                    
                    
                        పుల్వామాలోనిఐయుఎస్‌టి, డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్‌లో డిజైన్‌కు రూపం
                    
                
                
                    Posted On:
                26 APR 2020 2:05PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                కోవిడ్ -19 వ్యాప్తి  తగ్గుముఖం పట్టింది.  వ్యాప్తి అదుపులో ఉందని" ప్రభుత్వం తెలిపింది.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, వ్యాధి బారిన పడుతున్న వారిలో, 80 శాతం మందికి తేలికపాటి అనారోగ్యం మాత్రమే ఉంటోంది. 15 శాతం మందికి ఆక్సిజన్ మద్దతు అవసరం ఉంటోంది. మిగిలిన 5 శాతం  మందికి తీవ్రమైన , లేదా పరిస్థితి విషమంగా ఉన్న వారికి వెంటిలేటర్లు అవసరమౌతున్నాయి.
వైరస్ సోకిన రోగులకు చికిత్స చేయడానికి అవసరమైన వైద్య మౌలిక సదుపాయాలలో వెంటిలేటర్లు ఒక ముఖ్యమైన భాగం, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి  శ్వాస అందించే కీలకపనిని ఇవి నిర్వర్తిస్తాయి..
దీనిని పరిగణనలోకి తీసుకుంటే, ప్రభుత్వం ద్విముఖ విధానాన్ని అవలంబిస్తోంది, దేశీయ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతోంది, అలాగే వైద్య సామాగ్రి కోసం ప్రపంచవ్యాప్తంగా అన్వేషిస్తోంది.. దీని ప్రకారం, ఏప్రిల్ 25, 2020 న జరిగిన మంత్రుల బృంద సమావేశానికి  అందిన తాజా సమాచారం ప్రకారం, దేశీయ తయారీదారులు వెంటిలేటర్ల ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించారు.  తొమ్మిది మంది తయారీదారుల ద్వారా 59,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు ఇచ్చారు.
 

ఈ నేపథ్యంలో, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారతీయ ఆవిష్కరణలకు,  సృజనాత్మక స్ఫూర్తికి మంచి ఫలితం ఉంటోంది.. సిఎస్‌ఐఆర్ , దాని 30కిపైగా  ల్యాబ్‌లతో సహా మొత్తంశాస్త్రవేత్తలు, ఐఐటిలు  ప్రైవేటు రంగం , పౌర సమాజానికి చెందిన అనేక సంస్థలు వివిధ పరిష్కారాలతో ముందుకు వచ్చాయి, వీటిలో ప్రతి ఒక్కటి కరోనా  మహమ్మారిపై మన యుద్ధానికి కొంతవరకు దోహదం చేస్తాయి.
ఐఐటి బొంబాయి, ఎన్ఐటి శ్రీనగర్ , ఇస్లామిక్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్  అండ్ టెక్నాలజీ (ఐయుఎస్టి), అవంతిపోరా, పుల్వామా, జమ్మూ కాశ్మీర్ ల నుంచి  ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం  దేశంలో వెంటిలేటర్ అవసరాల సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చింది. ఇది ఒక సృజనజశీలుర బృందం. స్థానికంగా లభించే వస్తువులను ఉపయోగించి తక్కువ ఖర్చుతో వెంటిలేటర్ల రూపకల్పనకు ఈ బృందం ముందుకు వచ్చింది.
ఈ వెంటిలేటరుకు  రుహ్‌దార్ వెంటిలేటర్ అని ఈ విద్యార్థుల బృందం పేరు పెట్టింది. ఐఐటి బొంబాయిలోని ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ కరోనా మహమ్మారి కారణంగా మూసివేయడంతో ,మొదటి సంవత్సరం విద్యార్థి, ప్రాజెక్ట్ హెడ్ జుల్కర్నైన్,  తన స్వస్థలమైన కాశ్మీర్‌కు వెళ్లారు. మహమ్మారి వ్యాపిస్తున్న దశలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకున్నప్పుడు, కాశ్మీర్ లోయలో కేవలం 97 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని అతను అర్థం చేసుకున్నాడు. అవసరం ఎక్కువగా ఉందని, వెంటిలేటర్ల కొరత చాలా మందికి పెద్ద ఆందోళనగా మారిందని ఆయన గ్రహించారు.

అటువంటి పరిస్థితిలో, జుల్కర్నైన్ ఐయుఎస్‌టి, అవంతిపురిలోని తన స్నేహితులు పి.ఎస్. సోహిబ్, అసిఫ్,ఎన్.ఐటి శ్రీనగర్ నుంచి మజిద్ కౌల్‌లతో ఒక బృందంగా ఏర్పడ్డారు.,ఐయుఎస్‌టిలోని డిజైన్ ఇన్నోవేషన్ సెంటర్ (DIC) నుండి సహాయం తీసుకొని, స్థానికంగా లభించే వస్తువులను ఉపయోగించి తక్కువ ఖర్చుతో వెంటిలేటర్‌ను  ఈ బృందం రూపొందించ గలిగింది. వారి ప్రారంభ లక్ష్యం ప్రయత్నించిన మరియు పరీక్షించిన రూపకల్పనను ప్రతిబింబించడం, వారు ఈ వెంటిలేటర్ల రూపకల్పన ఆలోచన చేసిన తొలిదశలో ఇప్పటికే  ఉపయోగంలో ఉన్న పరీక్షించిన డిజైన్ మాదిరి వెంటిలేటర్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వారు వారి స్వంత వెంటిలేటర్ డిజైన్ కు రూపకల్పన చేశారు.
 ప్రస్తుతం జుల్కర్నైన్  జట్టు రూపొందించిన ప్రొటోటైప్ తయారీకి సుమారు రూ .10,000 ఖర్చవుతుంది .అయితే  భారీగా వీటిని  ఉత్పత్తి చేసినపుడు   ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని జుల్కర్నైన్ చెప్పారు. . ఆసుపత్రులలో ఉపయోగించే ఉన్నతస్థాయి వెంటిలేటర్లకు లక్షల రూపాయలు ఖర్చవుతోండగా,  కోవిడ్ -19 వైరస్ కారణంగా బాధపడుతున్న రోగుల ప్రాణాలను కాపాడటానికి అవసరమైన శ్వాస అందించే కీలక ప్రక్రియను తక్కువ ఖర్చుతో రూపొందించే రుహ్‌దార్ చేయగలదని చెప్పారు
తదుపరి కార్యాచరణ గురించి మాట్లాడుతే  జుల్కర్నైన్, తమ బృందం ఇప్పుడు రూపొందించిన ప్రోటోటైప్ ను వైద్య పరీక్షలకు పంపుతామని . తగిన ఆమోదం పొందిన తర్వాత,  భారీ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామన్నారు. చిన్న తరహా పరిశ్రమల ద్వారా వీటిని ఉత్పత్తి చేయడానికి  అనుకూలంగా ఉండేలా  ఈ బృందం ప్రయత్నిస్తోంది. ఈ ప్రాడక్ట్‌కు ఎటువంటి రాయల్టీని వసూలు చేయబోరు.
తమ బృందం ఎదుర్కొన్న ప్రధాన సమస్య వనరుల కొరత అని జుల్కర్నైన్ అన్నారు. ఈ బృందం అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన డిజైన్‌తో సహా అనేక డిజైన్లను ప్రయత్నించింది. వనరుల పరిమితులను పరిగణనలోకి తీసుకుని ఈ బృందం తమదైన డిజైన్ తో ముందుకు వచ్చింది. అధునాతన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఈ డిజైన్‌ను రూపొందించామని, తాము  సాధించిన ఫలితాలతో తమ జట్టు సంతృప్తిగా ఉందని జుల్‌కర్నైన్ తెలిపారు..
ఐయుఎస్‌టి పూర్వ విద్యార్థి , సిమ్‌కోర్ టెక్నాలజీస్  సిఇఒ అయిన ఆసిఫ్ ,ఈ వెంటిలేటర్ రూపకల్పన గురించి చెబుతూ "సాంప్రదాయిక వెంటిలేటర్‌కు  ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో కూడిన వెంటిలేటర్‌కు  రూపకల్పన చేసి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉండేది. టైడల్ వాల్యూమ్, నిమిషానికి శ్వాసలసంఖ్య, శ్వాస తీసుకోవడం, వదలడం ,అది పనిచేస్తున్నంత సేపు తగిన ప్రెజర్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ  ఉండడం వంటి ప్రాథమిక పెరామీటర్లను మా బృందం సాధించగలిగింది, అని ఆసిఫ్ చెప్పారు.
ప్రస్తుత అవసర సమయంలో  ప్రయోజనకరమైన కృషి చేయాలన్న ఆకాంక్ష ఈ యువకుల బృందాన్ని ముందుకు నడిపించిందని  డిఐసి, ఐయుఎస్టి కోఆర్డినేటర్ డాక్టర్ షాకర్ అహ్మద్ నహ్వి అన్నారు. వెంటిలేటర్ ఇంజనీరింగ్ కోణం నుంచి చూసినపుడు  అది పనిచేస్తోందని, అయితే దీని పనితీరుపై వైద్యరంగంనుంచి క్లియరెన్స్ ,ధ్రువీకరణ అవసరమని ఆయన అన్నారు.
 

.
ఐయుఎస్‌టి మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మాజిద్ హెచ్. కౌల్ మాట్లాడుతూ, డిఐసి వద్ద లభించే భాగాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో  విద్యార్థుల బృందం వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసిందన్నారు.  డిఐసి సెంటర్ లోని 3-డి ప్రింటింగ్ , లేజర్-కట్టింగ్ టెక్నాలజీస్ వంటి  సౌకర్యాలు ఈ నమూనా రూపకల్పనలో  విజయానికి కీలకమైనవిగా ఉపయోగపడ్డాయని అన్నారు. ఈ కేంద్రం భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చొరవతో రూపుదిద్దుకున్నది.
 
                
                
                
                
                
                (Release ID: 1618607)
                Visitor Counter : 341