సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        కరోనా సహయాత యోజన కింద ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తుందంటూ వాట్సాప్‌లో నకిలీ వార్తలు
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                25 APR 2020 9:37PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                కరోనా సహాయత యోజన పథకం అంటూ,  భారత ప్రభుత్వం ఎవరికీ రూ .1000 ఇవ్వడం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో  (పిఐవి) ఫాక్ట్ చెక్ యూనిట్ ఈ రోజు ట్వీట్‌లో స్పష్టం చేసింది.
 ప్రభుత్వం   డబ్ల్యుసిహెచ్ఒ పేరుతో  ఒక పథకం ప్రారంభించిందని పేర్కొంటూ వాట్సప్‌లో ఒక సందేశం విస్తృతంగా ప్రచారం చేస్తున్ఏనారు. ఈ పథకం  కింద ప్రజలకు ఒక్కొక్కరికి రూ .1000 ఇస్తున్నారనీ అందులో ప్రస్తావిస్తున్నారు. ఈ సందేశంతోపాటు ప్రజలు ఆ సందేశం చివర ఇచ్చిన లంక్‌పై వారి వివరాలను  ఇవ్వాలని కోరుతున్నారు.
అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీనిపై వివరణ ఇస్తూ అది మోసపూరిత లింక్ అని దీనిపై క్లిక్ చేయవద్దని ప్రజలను హెచ్చరించింది.
https://twitter.com/PIBFactCheck/status/1253954246271070208?s=20
 
నేపథ్యం:
 సుప్పీంకోర్టు వ్యాఖ్యలను అనుసరించి, సోషల్ మీడియాలో నకిలీ వార్తల వ్యాప్తిని తనిఖీ చేయడానికి  , సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్ల కు సంబంధించి వాస్తవాలను తెలియజేయడానికి పిఐబి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.  ‘పిఐబి ఫ్యాక్ట్ చెక్ ’ అనేది ట్విట్టర్‌లో ధృవీకరించబడిన హ్యాండిల్, ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్ సందేశాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది . నకిలీ వార్తలను కనిపెట్టి అటువంటి వాటిపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తుంది.
. దీనితో పాటు పిఐబి ఇండియా   హ్యాండిల్ , ట్విట్టర్‌లో వివిధ పిఐబిప్రాంతీయ యూనిట్ హ్యాండిల్స్ ట్విట్టర్‌లో ఏదైనా విషయానికి  సంబంధించి దాని అధికారిక , ప్రామాణికమైన సమచారాన్ని అందిస్తోంది.దీనిని #PIBFactCheck అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి ట్విట్టర్ కమ్యూనిటీ ప్రయోజనం కోసం పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నాయి.
ఎవరైనా వ్యక్తి పిఐబి ఫ్యాక్ట్‌చెక్ కు టెక్స్ట్, ఆడియో , వీడియోతో సహా ఏదైనా సోషల్ మీడియా సందేశాన్ని పంపి అది వాస్తవమైనదో కాదో  ధృవీకరించుకోవచ్చు. వీటిని ఆన్‌లైన్‌లో https://factcheck.pib.gov.in/ లేదా వాట్సాప్ నం +918799711259 లేదా ఈమెయిల్: pibfactcheck[at]gmail[dot]com లో పంపవచ్చు. వివరాలు పిఐబి వెబ్‌సైట్‌లో కూడా ఉన్నాయి: https://pib.gov.in
                                                   

***
                
                
                
                
                
                (Release ID: 1618404)
                Visitor Counter : 267