రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్ -19 లాక్‌డౌన్ నేప‌థ్యంలో రోహ్తాంగ్ పాస్‌ను మూడు వారాల ముందుగానే తెరిచిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్

Posted On: 25 APR 2020 7:30PM by PIB Hyderabad

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) శ‌నివారం రోహ్తాంగ్ పాస్ (సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తు) ను తెరిచింది. కోవిడ్ -19 లాక్‌డౌన్ నేప‌థ్యంలో మధ్య మూడు వారాల ముందుగానే మంచును క్లియ‌ర్ చేసిన త‌రువాత బీఆర్ఓ ఈ రోహ్తాంగ్ పాస్‌ను తెర‌వ‌డం విశేషం. హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ మరియు స్పితి జిల్లాలను దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ పాస్‌ అనుసంధానం చేస్తుంది. గత ఏడాది మే 18న ఈ పాస్ తెరిచారు. కోవిడ్‌-19 నేప‌థ్యంలో
రైతులు సాగు సంబంధిత ప‌నులు చేప‌ట్టేందుకు మరియు అవసరమైన సామాగ్రిని తరలించ‌డానికి
లాహౌల్ లోయకు సహాయక సామగ్రిని తీసుకురావడానికి వీలుగా ర‌హ‌దారిపై పేరుకుపోయిన మంచు తొలగింపు చ‌ర్య‌ల‌ను వేగవంతం చేయాల‌ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బీఆర్ఓను  కోరింది.
క‌ఠిన అవ‌రోధాలు ఎదురైనా..
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞ‌ప్తి మేర‌కు పాస్‌ను తెరిచేందుకు గాను మనాలి మరియు ఖోక్సర్ ప్రాంతాల‌ నుండి బీఆర్‌వో వివిధ హైటెక్ యంత్రాలను తీసుకువ‌చ్చింది. గడ్డకట్టే ఉష్ణోగ్రతల‌లో మంచు తుఫానులు, మరియు రహాలా పతనం, బియాస్ నల్లా మరియు రాణి నల్లా వద్ద తరచుగా హిమపాతాలు రోహ్తాంగ్ పాస్ క్లియ‌రెన్స్ కార్య‌క‌లాపాల‌కు విఘాతం క‌లిగించాయి. కాని మంచు క్లియరెన్స్ బృందాలు మాత్రం లాహాల్ లోయ నివాసితులకు ఉపశమనం కలిగించడానికి అన్ని కోవిడ్‌-19 జాగ్రత్తలతో పగలు మరియు రాత్రి నిరంతరంగా పని చేసి రోహ్తాంగ్ పాస్ క్లియ‌రెన్స్ కార్యక్ర‌మాన్ని చేప‌ట్టారు.
స్థానిక‌ జ‌నాల‌కు ఎంతో ఉప‌శ‌మ‌నం..
అత్యవసర సామాగ్రిని తీసుకెళ్లే వాహనాల మొదటి కాన్వాయ్ సుమారు 150 మంది రైతుల‌తో ఈ రోజు లాహువల్ వ్యాలీకి ప‌య‌న‌మైంది. దీనికి బీఎర్‌వో సంస్థ మార్గనిర్దేశం చేసింది. దీంతో ఈ సంవత్సరానికి రోహ్తాంగ్ పాస్‌ అధికారికంగా ప్రారంభ‌మైన‌ట్ట‌యింది. గ‌త ఏడాదితో పోల్చితే రోహ్తాంగ్ పాస్ మూడు వారాల ముందుగానే ట్రాఫిక్ కోసం తెరవబడిందనే వార్తలు స్థానిక జ‌నాల‌కు ఎంతో ఉపశమనం కలిగించింది. ఇది స్థానిక జనాభాకు అవసరమైన సహాయక సామగ్రి మరియు వైద్య సామాగ్రిని తీసుకురావడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గాన్ని  సులభతరం  చేయ‌నుంది. దీనికి తోడు జిల్లాకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ కార్యకలాపాలు ఇప్పుడు తిరిగి ప్రారంభించేందుకు కూడా తోడ్ప‌డ‌నుంది. ఇక్క‌డ మ‌ధ్య న‌వంబర్ నుండి మ‌ధ్య మే వ‌ర‌కు వరకు అంటే దాదాపు ఆరు నెలలు మంచుతో క‌ప్ప‌బ‌డి ఉంటుంది. దీంతో పాస్ తెరవడానికి ఇక్క‌డ మంచు క్లియరెన్స్ ఆపరేషన్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది గ‌తేడాది డిసెంబర్ 12వ తేదీ వరకు తెరిచి ఉంచబడింది. శీతాకాలంలో బ‌య‌ట నుంచి ఇక్క‌డికి ఏదైనా లాజిస్టిక్స్ / సరఫరా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలంటే అవి కేవ‌లం విమాన మార్గంపైనే ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఉంటుంది.
పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ.కోటి విరాళం..
కోవిడ్‌-19 వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు గాను ప్ర‌భుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు గాను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది స‌మిష్టిగా కోటి రూపాయల సొమ్మును పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాశంగా అందించారు. ఇది వారి ఒక రోజు జీతం కంటే కూడా ఎక్కువ కావ‌డం విశేషం.

 



(Release ID: 1618310) Visitor Counter : 164