శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19ను ఎదుర్కోవడంలో భాగంగా ఆసుపత్రి స్థలాలను సమర్థవంతంగా శుభ్రపరిచే అల్ట్రా వైలెట్ క్రిమి సంహారక ట్రాలీ రూపకల్పన

UVC కాంతికి సున్నితంగా స్పందించే కరోనా వైరస్ మరియు ఇతర వైరస్, బ్యాక్టీరియా

ఫీల్డ్ ట్రయల్స్ కోసం హైదరాబాద్ లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆస్పత్రిలో వినియోగిస్తున్న యంత్రం

Posted On: 25 APR 2020 3:46PM by PIB Hyderabad

ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఎ.ఆర్.సి.ఐ), భారత ప్రభుత్వ స్వయంప్రతిపత్తి గల ఆర్&డి సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డి.ఎస్.టి), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మెక్సికన్ ఇండస్ట్రీస్ లిమిటెండ్ (ఎం.ఐ.ఎల్) సహకారంతో ఆసుపత్రి పరిసరాలను వేగంగా శుభ్రపరచడం ద్వారా కోవిడ్ -19కు వ్యతిరేకంగా పోరాడేందుకు అల్ట్రావైలెట్ ఆధారిత క్రిమి సంహారక ట్రాలీని అభివృద్ధి చేశాయి.

200 మరియు 300 ఎన్.ఎమ్.ల మధ్య తరంగ దైర్ఘ్యాల పరిధిలో ఉన్న అల్ట్రై వైలెట్ కాంతి బ్యాక్టీరియా మరియు వైరస్ వంటి సూక్ష్మ జీవులను క్రియారహితం చేయగలవు. తద్వారా గాలి మరియు ఘన ఉపరితలాలు రెండింటినీ క్రిమి రహితం చేస్తుంది. తరచుగా ఆస్పత్రులు మరియు ఇతర కాలుష్య వాతావరణంలో కనిపించే బ్యాక్టీరియా మరియు వైరస్ లను తొలగించడానికి రసాయన క్రిమి సంహారకాలు సరిపోవు. పడకల పరిమిత లభ్యత దృష్ట్యా ఆస్పత్రిలో ప్రవేశించే ముందు అప్పటికే ఉపయోగించిన రోగి –సంరక్షణ పడకలు మరియు ఆస్పత్రి గదులను వేగంగా క్రిమి రహితం చేయడం ఆస్పత్రులలో అత్యంత ఆవశ్యకం. కరోనా వైరస్ మరియు ఇతర వైరస్ లు, బ్యాక్టీరియాలు యు.వి.సి. కాంతిలో సున్నితంగా ప్రభావితం అవుతాయి. 254 ఎన్.ఎం. వద్ద గరిష్ట తీవ్రతతో యు.వి.సి. వికిరణం యొక్క సూక్ష్మి క్రిమి ప్రభావాలు వైరస్ యొక్క సెల్యులార్ నష్టానికి కారణం అవుతాయి. తద్వారా సెల్యూలార్ రెప్లికేషన్ ను నిరోధిస్తుంది. క్రిమి సంహారక రసాయన విధానాల మాదిరిగా కాకుండా, అల్ట్రావైలెట్ కాంతి భౌతిక ప్రక్రియ ద్వారా సూక్ష్మ జీవులు వేగంగా, సమర్థవంతంగా నిష్క్రియాత్మకం అవుతాయి.

 

 

ఏ.ఆర్.సి.ఐ, యు.ఓ.హెచ్. మరియు ఎం.ఐ.ఎల్. కలిసి అభివృద్ధి చేసిన యు.వి.సి. క్రిమి సంహారక ట్రాలీ (1.6 మీటర్ల ఎత్తు, 0.6 మీటర్ల వెడల్పు, 0.9 మీటర్ల పొడవు) 6 యు.వి.సి. జెర్మిసైడల్ గొట్టాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రతి దిశకు ఎదురుగా 2 గొట్టాలతో 3 వైపులా ప్రకాశిస్తాయి. ఈ దీపాల గోడలు, మంచం మరియు గది గాలి క్రిమి సంహారక జాగ్రత్తలు తీసుకుంటుండగా, నేల క్రిమి సంహారకం నేల మీద దిగువన ఉన్న 2 చిన్న యు.వి. లైట్ల ద్వారా జరుగుతుంది. రక్షిత సూట్ మరియు యు.వి. రెసిస్టెంట్ గాగుల్స్ లో ఒక ఆపరేటర్ గదిలో ట్రాలీని కదిలించినప్పుడు ఆస్పత్రి గదులు క్రిమి సంహారకం అవుతాయి.

సగటున యు.వి.సి. ట్రాలీ వ్యవస్థను సగటున నిముషానికి 5 అడుగుల వేగంతో కదిలించే ఆపరేటర్ 400 చదరపు అడుగుల గదిని కవర్ చేయవచ్చు. పూర్తి  (> 99%) క్రిమి సంహారకం కోసం 30 నిముషాల్లో ప్రస్తుత వ్యవస్థ మొదటి నమూనా మరియు ఆస్పత్రులు మరియు రైల్వే కోచ్ లలో దీన్ని సులభంగా వినియోగించవచ్చు. ఇవి కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం కూడా ప్రణాళికల్లో భాగం చేయనున్నారు. అదే విధంగా విమాన క్యాబిన్లలో వేగంగా క్రిమి సంహారకం అవసరం ఉన్నందున చిన్న కొలతలు మరియు మరింత ఆటోమేషన్ ఉన్న వ్యవస్థలు పురోగతిలో ఉన్నాయి. ఫీల్డ్ ట్రయల్స్ కోసం హైదరాబాద్ లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇ.ఎస్.ఐ.సి) ఆసుపత్రిలో ప్రస్తుత వ్యవస్థ (ప్రామాణిక ఆపరేటింగ్ విధానం మరియు భద్రతా సూచనలతో పాటు) వినియోగించబడుతోంది. రోగిని డిశ్చార్జ్ చేసిన తర్వాత మరియు ఆరోగ్య సిబ్బంది లేనప్పుడు యు.వి – లైట్ క్రిమి సంహారక వ్యవస్థ తప్పని సరిగా ఖాళీ చేయని గదుల్లో వినియోగించాల్సిన అవసరం ఉంది.

డివిజన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి ప్రొఫెసర్ ఆశుతోష్ శర్మ మాట్లాడుతూ, లోతైన అతినీల లోహిత కాంతిని ఉపయోగించి అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో ఆసుపత్రి గదులు, యంత్రాలు మరియు ఇతర ఉపరితలాలను పొడిగా మరియు క్రిమిరహితంగా చేయడం మంచి పరిష్కారమని, దీనిని డిజైనర్ ట్రాలీ బలమైన ప్యాకేజీలో ఉండడంతో పాటు సౌలభ్యంగా, వేగంగా, సమర్థవంతంగా పని చేస్తుందని తెలిపారు.

 

[దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి... ఎన్. అపర్ణారావు, సి.పి.ఆర్.ఓ, ఎ.ఆర్.సి.ఐ, aparna@arci.res.inమొబైల్ : +91-9849622731]



(Release ID: 1618192) Visitor Counter : 200