వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ప్రారంభించిన వారం రోజుల్లోనే బహుళ ప్రాచుర్యం పొందిన - "కిసాన్ రథ్" మొబైల్ యాప్.

ఆహార ధాన్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సౌకర్యాలకోసం ఈ యాప్ లో 1.5 లక్షల మందికి పైగా రైతులు, వ్యాపారులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

Posted On: 24 APR 2020 7:34PM by PIB Hyderabad

లాక్ డౌన్ సమయంలో రైతుల సౌకర్యం కోసం, క్షేత్ర స్థాయిలో వ్యవసాయ పనులకోసం భారత ప్రభుత్వానికి చెందిన కేంద్ర వ్యవసాయం, సహకారం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేక చర్యలు చేపడుతోంది. 

ఆ కార్యకలాపాల తాజా వివరాలు .

1.  రైతులువ్యాపారులు తమ వ్యవసాయ ఉత్పత్తులు ఆహారధాన్యాలు (తృణ ధాన్యాలుపప్పులు)పండ్లుకూరగాయలునూనె గింజలుసుగంధ ద్రవ్యాలుపీచు పంటలుపువ్వులుకొబ్బరి కాయలువెదురు కర్రలతో పాటు వివిధ కర్ర దుంగలుదూలాలు మొదలైన వివిధ రకాల వస్తువుల రవాణాకు అనువైన వాహనాలను గుర్తించిఎంపిక చేసుకోడానికి వీలుగా, కేంద్ర వ్యవసాయంరైతు సంక్షేమ మంత్రిత్వశాఖ "కిసాన్ రథ్" యాప్ ను 2020 ఏప్రిల్ 17వ తేదీన  ఆవిష్కరించింది.  ఈ యాప్ లో ఇంతవరకు మొత్తం 80,474 మంది రైతులు, 70,581 మంది వ్యాపారులు తమ పేర్లు నమోదుచేసుకున్నారు.

2. సంపూర్ణ లాక్ డౌన్ కారణంగా హోల్ సేల్ మండీలన్నీ 25.03.2020 తేదీన మూతబడ్డాయి. భారతదేశంలో మొత్తం 2,587 ప్రధాన / ముఖ్య మైన వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి.  వీటిలో 1,091 మార్కెట్లు 26.03.2020 తేదీన పనిచేస్తున్నాయి. కాగా, 23.04.2020 తేదీ నాటికి 2,067 మార్కెట్లు పనిచేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది

3.  దేశంలోని 20 రాష్ట్రాలలో ప్రస్తుతం ఎమ్.ఎస్.పి. పై పప్పులు, నూనె గింజల సేకరణ ప్రస్తుతం పురోగతిలో కొనసాగుతోంది.   1,79,852.21 మెట్రిక్ టన్నుల పప్పులు మరియు 1,64,195.14 మెట్రిక్ టన్నుల నూనె గింజలను నాఫెడ్ మరియు ఎఫ్.సి.ఐ. రూ.1605.43 కోట్లతో సేకరించింది.  దీనివల్ల 2,05,869 మంది రైతులు ప్రయోజనం పొందారు

4.      వేసవి పంటల కోసం నాట్లు వేసిన విస్తీర్ణం :  

వరి :  వేసవి వరి సాగు విస్తీర్ణం గత ఏడాది ఇదే సమయంలో 25.22 లక్షల హెక్టార్లు ఉండగా, ఈ ఏడాది సుమారు 34.73 లక్షల హెక్టార్లుగా నమోదయ్యింది. 

పప్పు ధాన్యాలు :  పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం గత ఏడాది ఇదే సమయంలో 3.82 లక్షల హెక్టార్లు ఉండగా, ఈ ఏడాది సుమారు 5.07 లక్షల హెక్టార్లుగా నమోదయ్యింది. 

తృణ ధాన్యాలు తృణ ధాన్యాల సాగు విస్తీర్ణం గత ఏడాది ఇదే సమయంలో 5.47 లక్షల హెక్టార్లు ఉండగా, ఈ ఏడాది సుమారు 8.55 లక్షల హెక్టార్లుగా నమోదయ్యింది. 

నూనె గింజల పంటలు  నూనె గింజల పంటల సాగు విస్తీర్ణం గత ఏడాది ఇదే సమయంలో 6.80 లక్షల హెక్టార్లు ఉండగా, ఈ ఏడాది సుమారు 8.73 లక్షల హెక్టార్లుగా నమోదయ్యింది.

5.    24.04.2020 తేదీ నాటికి సాగు విస్తీర్ణం వివరాలు

గోధుమలు : వివిధ రాష్ట్రాలు అందజేసిన వివరాల ప్రకారం గోధుమల సాగు  మధ్యప్రదేశ్ లో సుమారు 98-99 శాతం కాగా -  రాజస్తాన్ లో 90-92 శాతం; ఉత్తరప్రదేశ్ లో 82-85 శాతం; హర్యానా లో 50-55 శాతం; పంజాబ్ లో 45-50 శాతం; ఇతర రాష్ట్రాలలో 86-88 శాతంగా నమోదయ్యింది. 

 

*****



(Release ID: 1618122) Visitor Counter : 236