ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

దేశంలో ఐ టి సేవల పరిస్థితిని పరిశీలించిన శ్రీ సంజయ్ ధోత్రే

దేశంలో ఇప్పటివరకు 75 మిలియన్ల మంది ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు

Posted On: 24 APR 2020 6:16PM by PIB Hyderabad

కేంద్ర ఎలెక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్  టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న వివిధ శాఖలుప్రభుత్వ సంస్థలు కోవిడ్ -19 లాక్ డౌన్ సమయంలో  తీసుకున్న చర్యలను  గురించి కేంద్ర ఎలెక్ట్రానిక్స్ ,  ఐటి,  కమ్యూనికేషన్లు మరియు హెచ్ ఆర్ డి శాఖల  సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే సమీక్షించారు.   మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న విభాగాలు తీసుకున్న చర్యల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ సమయంలో సామాజిక దూరం నియమాలను పాటిస్తూనే తమ శక్తి వంచన లేకుండా కృషి చేయవ లసిందిగా అయన అన్ని విభాగాలను కోరారు. 

ఇప్పటివరకు దాదాపు 75 మిలియన్ల మంది తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు మంత్రికి తెలిపారు.  కోవిడ్ -19 విశ్వ మహమ్మారిపై జరుపుతున్న పోరాటంలో సామాన్యులకు సైతం ఉపయోగపడే ముఖ్యమైన సాధనంజీవన రేఖ  'ఆరోగ్య సేతుయాప్ అని మంత్రి తెలిపారు.   ఈ యాప్ గురించి దేశంలోని అన్ని ప్రాంతాలలో ,  కేవలం 2జి  ఇంటర్నెట్ సేవలు లభిస్తున్న జమ్మూ కాశ్మీర్ వంటి చోట్ల కూడా దీనిని ప్రచారం చేయాలని ఆయన అధికారులను కోరారు. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఐ టి ఆధార సేవల రంగాల  పరిస్థితిని మంత్రి నిశితంగా గమనిస్తున్నారు.   లాక్ డౌన్ తరువాత ఈ రంగాలను తిరిగి తెరవడాన్ని  గురించి అధికారులతో మంత్రి సవివరంగా చర్చలు జరిపారు.  మున్నెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో తలెత్తిన ఈ సంక్షోభ సమయంలో సామాన్యులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఐ టి రంగం పరిష్కారాలు కనుగొనాలనిసేవలు అందించాలని అధికారులకుభాగస్వామ్య పక్షాలకు మంత్రి ఉద్బోధించారు. దేశంలో ఐ టి రంగం కీలక పాత్ర పోషిస్తోందని,  ప్రతి రంగానికి అది వెన్నెముక వంటిదని ఆయన ఉద్ఘాటించారు.  ఈ సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చైతన్యవంతమైన నాయకత్వంలో భారత ప్రభుత్వం నిరంతరంగా శ్రమిస్తోందని అన్నారు.   ఈ చారిత్రక అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని,  పూర్తి వినియోగం ద్వారా సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలని ఆయన అన్నారు. 

దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల సేవా కేంద్రాల (సి ఎస్ సి) యంత్రాంగం పాత్రను  గురించి  ప్రస్తావిస్తూ ఈ సంక్షోభ సమయంలో  టెలి  మెడిసిన్ సేవలు అందించడానికి ఈ కేంద్రాల సేవలనుముఖ్యంగా  మారుమూల ప్రాంతాలలో  వాడుకోవాలని ఆయన అన్నారు.  దీనివల్ల ఈ లాక్ డౌన్ సమయంలో వైద్య సేవలు అందకా ఇబ్బంది పడుతున్న వారికి  ఎంతో  ఊరట లభించ గలదని శ్రీ ధోత్రే  అన్నారు.



(Release ID: 1618002) Visitor Counter : 289