కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

500 కిలో మీటర్లకు పైగా 22 మార్గాల్లో జాతీయ రహదారి రవాణా నెట్ వర్క్ ద్వారా అత్యవసర వస్తువులను పంపిణీ చేస్తున్న పోస్టుల విభాగం

Posted On: 24 APR 2020 7:25PM by PIB Hyderabad

కోవిడ్ -19 కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పర్యాణీకులు, విమానయాన సంస్థలు, రైల్వేలు మరియు రాష్ట్ర రహదారుల మీద రవాణా ఆగిపోవడం వల్ల దేశంలో అవసరమైన వస్తువుల సరఫరా గొలుసు నిర్వహణ దెబ్బ తింది. గతంలో కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా అండ్ జస్టిస్ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ పోస్టల్ శాఖ ఉన్నతాధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. సంక్షోభ కాలంలో ఈ విభాగం గురించి ఆలోచించమని ప్రోత్సహించారు. ఈ ప్రోత్సాహం ఫలితంగా, ప్రస్తుతం ఇంట్రా సిటీ డెలివరీ కోసం ఉపయోగించే డిపార్ట్ మెంటల్ వాహనాల సముదాయంతో రేడ్ నెట్ వర్క్ ను ప్రారంభించాలనే ఆలోచన రూపు దాల్చింది. దేశంలోని 75 నగరాలకు పైగా 34 అంతరాష్ట్ర / అంతర్-రాష్ట్ర షెడ్యూల్ తో 500 కిలోమీటర్లకు పైగా 22 పొడవైన మార్గాలతో జాతీయ రహదారి రవాణా నెట్ వర్క్ రూపొందించబడింది. ఈ చొరవ వల్ల ఇప్పుడు దేశంలో అత్యవసర వస్తువుల పంపిణీకి ఊతమిస్తోంది. ఎందుకంటే పోస్టల్ విభాగం దేశంలో ఎక్కడికైనా అవసరమైన వస్తువులను తీసుకు వెళ్ళే ప్యాకెట్లను పంపిణీ చేయగలదు.

ఔషధాలు, కోవిడ్ -19 కిట్లు, మాస్క్ లు, శానిటైజర్లు, పి.పి.ఈ.లు, వెంటిలేటర్లు, డీఫిబ్రిలేటర్లు సహా వైద్య పరికరాలను దేశంలోని అన్ని మూలలకు సరఫరా చేయడానికి పోస్టుల విభాగం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా డిపార్ట్ మెంట్ ప్రత్యేకంగా పాత, దివ్యాంగ జనులు, పెన్షనర్లకు ఇంటి వద్దకే నగదు పంపిణీ చేస్తోంది. ఈ జాతీయ రహదారి రవాణా నెట్ వర్క్ దేశ వ్యాప్తంగా ప్రజలను చేరుకోవడానికి ఈ విభాగం యొక్క మరొక ప్రయత్నం. 

 

--



(Release ID: 1617978) Visitor Counter : 121