సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కరోనాపై పోరాడుతున్న సిబ్బంది బలోపేతానికి ఆన్‌లైన్‌ కోర్సులు

కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ద్వారా 2.9 లక్షలకు పైగా ఆన్‌లైన్‌ కరోనా కోర్సులు
ప్రారంభించిన 2 వారాల్లోనే 1.83 లక్షల మందికి పైగా యూజర్లు
ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఆలోచన నుంచి రూపకల్పన

Posted On: 23 APR 2020 7:16PM by PIB Hyderabad

కరోనాపై అవగాహన కోసం కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (DoPT) ప్రారంభించిన ఆన్‌లైన్‌ కోర్సులకు అనూహ్య స్పందన దక్కుతోంది. ప్రారంభించిన 2 వారాల్లోనే కోర్సుల సంఖ్య 2.9 లక్షలను దాటింది. 1.83 లక్షల మందికి పైగా యూజర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 

    ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి (స్వతంత్ర హోదా ) శ్రీ జితేంద్ర సింగ్‌ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇదొక కొత్త తరహా ప్రయోగమని, బహుశా ఇలాంటి వాటిలో మొదటిదని అన్నారు. ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా, కరోనాపై ముందుండి పోరాడేవారిలో సాధికారత మరింత పెంచేందుకు https://igot.gov.in ఒక సాధనంలా ఉపయోగపడిందని వివరించారు. ఆన్‌లైన్‌ మీడియం ద్వారా శిక్షణ, తాజా వివరాలను అందించి, కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి ఫ్రంట్‌లైన్ కరోనా వారియర్లను సన్నద్ధం చేయడం ప్రత్యేకమైన విజయగాథ నిరూపితమైనదని అన్నారు. మిగిలినవారు వివిధ రూపాలు, కాలాల్లో దీనిని అనుకరించవచ్చని కూడా మంత్రి శ్రీ జితేంద్ర సింగ్‌ చెప్పారు.

 

 

మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా దేశవ్యాప్తంగా శిక్షణలు
    ప్రత్యేకమైన ఫ్లాట్‌ఫాం ద్వారా సరళమైన సమయాల్లో ఆన్-సైట్ ప్రాతిపదికన శిక్షణ మాడ్యూళ్ళను అందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీనివల్ల స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా శిక్షణ పొందే వెసులుబాటు కలుగుతోందన్నారు. ఈ శిక్షణ కోసం మొబైల్‌ యాప్‌ తీసుకొచ్చామని, https://bit.ly/dikshaigot లింక్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యూజర్లు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

ఆచరణలోకి వచ్చిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఆలోచన
    కొవిడ్‌పై ముందుండి పోరాడేవాళ్లను సరైన సమాచారంతో మరింత శక్తిమంతం చేయడం, వైరస్‌కు వారు బలవ్వకుండా చూడాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆలోచన నుంచి ఈ శిక్షణ కార్యక్రమం రూపుదిద్దుకుంది. కొవిడ్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం, చికిత్సల నిర్వహణ, ICU కేర్‌ మేనేజ్‌మెంట్‌, వైరస్‌ వ్యాప్తి నివారణ మరియు సంరక్షణ, రక్షణ సామగ్రి వాడకం, క్వారంటైన్‌ మరియు ఐసోలేషన్, NCC క్యాడెట్లకు శిక్షణ, కొవిడ్‌-19 కేసుల నిర్వహణ, నమూనాల సేకరణ మరియు పరీక్ష, రోగుల మానసిన ఆరోగ్యంపై శ్రద్ధ, కొవిడ్‌ సమయంలో శిశు సంరక్షణ, కొవిడ్‌ సమయంలో గర్భధారణ వంటి విషయాలను ఈ శిక్షణలో నేర్పిస్తారు. శిక్షణ మాడ్యూల్‌లో ఎప్పటికప్పుడు కొత్త శిక్షణాంశాలను చేరుస్తుంటారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌‌, పోలీసు సంస్థలు మొదలుకుని నెహ్రూ యువ కేంద్రాస్, అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల వరకు 18 రకాల అవసరాలు తీర్చడానికి శిక్షణ మాడ్యూల్స్ రూపొందించారు.


(Release ID: 1617679) Visitor Counter : 197