నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ఓడ రేవుల్లో ప్రవేశం, నిష్క్రమణ ల కోసం హోంమంత్రిత్వశాఖ ఎస్.ఓ.పి. విడుదల చేసిన అనంతరం ముంబాయి నౌకాశ్రయానికి చేరుకున్న జర్మనీ నౌక నుండి బయటకు వచ్చిన 145 మంది భారతీయ సిబ్బంది.
Posted On:
23 APR 2020 7:34PM by PIB Hyderabad
ఓడ రేవుల్లో ప్రవేశం, నిష్క్రమణ ల కోసం భారతీయ నావికులనుద్దేశించి హోంమంత్రిత్వశాఖ ఎస్.ఓ.పి. విడుదల చేసిన అనంతరం మొదటి సారి ముంబాయి నౌకాశ్రయానికి చేరుకున్న జర్మనీ నౌక నుండి 145 మంది భారతీయ సిబ్బంది ఈ రోజు బయటికి వచ్చారు.
భారతీయ సిబ్బందికి మూడు దశల్లో కఠినమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ముంబాయి పోర్ట్ ట్రస్ట్ వారి నిష్క్రమణకు మార్గం సుగమం చేసింది. వారికి విస్తృతమైన ఆరోగ్య పరీక్షలు చేయడానికి బెర్త్ దగ్గర ఏర్పాట్లు చేశారు. ముంబాయి పోర్టు ట్రస్టుకు చెందిన వైద్యులు, సిబ్బంది సహకారంతో పోర్టు ఆరోగ్య ఆరోగ్య అధికారులు మొదటి దశ పరీక్షలు చేశారు. రెండవ దశలో ఎమ్.సి.జి.ఎమ్. ఆరోగ్య అధికారులు నౌక సిబ్బందిని పరీక్షించి 14 రోజుల హోమ్ క్వారంటైన్ కు సూచిస్తూ స్టాంప్ వేశారు. ఇక మూడవ, అత్యంత కీలక దశలో నౌక నుంచి దిగిన సిబ్బంది అందరి నుంచీ శ్వాబ్ నమూనాలను పరీక్ష కోసం సేకరించారు.
ఆ తర్వాత, వారికి సంబందించిన కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ, పోర్ట్ క్లియరెన్స్ వంటి సాధారణ ప్రక్రియలన్నింటినీ పి.పి.ఈ. మరియు సామాజిక దూరం వంటి నిబంధనలు పాటిస్తూ పూర్తి చేశారు. వారి పరీక్ష నివేదికలు నెగటివ్ వచ్చే వరకు నౌక సిబ్బంది ముంబయి లోని క్వారంటైన్ లో కొనసాగుతారు.
***
(Release ID: 1617678)
Visitor Counter : 208