ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 పేషెంట్లకు మంచి పోషక విలువలుగల ఆహారాన్నితయారు చేసి సరఫరా చేస్తున్న ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వశాఖకు చెందిన పరిశోధన, విద్యాసంస్థ- ఐఐఎఫ్‌టి,
Posted On:
23 APR 2020 4:23PM by PIB Hyderabad
ఆహార ప్రాసెసింగ్ మంత్రిత్వశాఖ కు చెందిన ప్రముఖ పరిశోధన, విద్యా సంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ (ఐఐఎఫ్‌పిటి), మన దేశం కోవిడ్ -19 పై సాగిస్తున్న పోరాటానికి మద్దతునిస్తోంది. ఐఐఎఫ్‌టి, కోవిడ్ -19 పేషెంట్ల కోసం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారుచేసేందుకు ముందుకు రావడం పట్ల, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీమతి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ అభినందనలు తెలిపారు. ఆరోగ్యకరమైన , రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం పేషెంట్లకు అవసరమైన సమయంలో వీటిని తయారు చేస్తున్నందుకు ఆమె వారిని అభినందించారు.
.వైద్య చికిత్స పొందుతున్న కోవిడ్ -19 పేషెంట్లు, ఇటీవలే ఈ మహమ్మారి నుంచి తమిళనాడులోని తంజావూరు మెడికల్ కాలేజీ నుంచి కోలుకున్న వారి కోసం పోషక విలువలు పుష్కలంగా కలిగిన ఆహారాన్ని ఐఐఎఫ్‌పిటి తయారుచేస్తున్నది.
ఐఐఎఫ్‌పిటి, తంజావూర జిల్లా పాలనాయంత్రాంగం, తంజావూరు మెడికల్ కాలేజీ కోవిడ్ -19 సాగిస్తున్న పోరాటానికి మద్దతు నిస్తోంది. కోవిడ్ -19 కారణంగా రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఐఐఎఫ్‌పిటిలోని శాస్త్రవేత్తలు స్థానికంగా లభించే ఆహారపదార్థాలతో కొత్త ఆహార ఉత్పత్తుల ఫార్ములేషన్లను తయారు చేసి అందిస్తున్నట్టు డైరక్టర్ డాక్టర్ సి. అనంతరామకృష్ణన్ తెలిపారు. దీనితోపాటు, కుకీలు,రస్క్‌లు, మిల్లెట్ పాప్‌లను ఐఐఎఫ్‌పిటి వారి హెచ్ ఎసిసిపి వద్ద , ఐఎస్ఒ సర్టిఫై చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఎఫ్‌పిబిఐసిలోను ) రోజువారీ గా తయారు చేస్తున్నారు.వీటిని మెడికల్ కాలేజి, ఆస్పత్రికి సరఫరా చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని 2020 ఏప్రిల్ 21న జిల్లా కలెక్టర్, డీన్ టిఎంసి సమక్షంలో ప్రారంభించారు. అన్ని ఉత్పత్తులను ఐఐఎఫ్‌టి సిబ్బంది ఎంతో జాగ్రత్తగా తయారు చేసి వాటిని ప్యాకెట్లలో ఉంచుతున్నారు.
ఎండిన మునగ ఆకులు(మోరింగా), వేరుశనగ పొడి , పాలవిరుగుడు ప్రోటీన్లతో బ్రెడ్ ముక్కలను సమృద్ధం చేస్తున్నారు ఇందులో 9.8 శాతం ప్రోటీన్, 8.1 శాతం పీచుపదార్థంతో తోపాటు సహజసిద్ధమైన రోగనిరోధక శక్తిని పెంపొందించే వెల్లుల్లి, పసుపు, అల్లం, మిరియాలు , ఇతర మసాలా దినుసులు ఉండేట్టు చూస్తున్నారు.
కుకీలలో 14.16 శాతం ప్రొటీన్, 8.71 శాతం పీచుపదార్థం తోపాటు వివిధ దినుసుల ప్రయోజనాలు ఉండేట్టు చూస్తున్నారు. అలాగే రస్క్‌లలో 12.85 శాతం ప్రోటీన్ ,10.61 శాతం పీచుపదార్థం తో మంచి పోషకాలతో రుచికరంగా తయారు చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా నిల్వచేయడానికి ఎలాంటి సింథటిక్ అడిటివ్‌లు ఉపయోగించడంలేదు. వీటిని తయారు చేసిన వెంటనే ప్యాకింగ్, లేబుల్ వేసి ఆస్పత్రికి పంపుతారు.
దీనికితోడు ఐఐఎఫ్‌పిటి కి ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ రెఫరల్ లేబరెటరీ ఉంది. డిపార్టమెంట్ ఆఫ్ ఫుడ్‌సేఫ్టీ, క్వాలిటీ టెస్టింగ్ విభాగం హ్యాండ్ శానిటైజర్లను జిల్లా పోలీసు యంత్రాంగం కోసం, కోవిడ్ నిరోధానికి సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనే అధికారుల కోసం తయారు చేస్తున్నది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఈ హ్యాండ్ శానిటైజర్లను తయారు చేయడం జరుగుతోంది.
ఐఎఫ్‌పిటి గురించి...
ఐఐఎఫ్ పిటి జాతీయ స్థాయి విద్యా పరిశోధన సంస్థ. ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఫుడ్‌ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ కింద పనిచేస్తోంది. ఈ సంస్థ ప్రధాన క్యాంపస్ తమిళనాడులోని తంజావూరులో ఉండగా లయజాన్ కార్యాలయాలు పంజాబ్లోని భటిండా, అస్సాంలోని గౌహతిలో ఉన్నాయి.ఐఐఎఎఫ్‌పిటి ఫుడ్ ప్రాసెసింగ్ , వాల్యూ అడిషన్, ఆహార నాణ్యత, భద్రత, బిజినెస్ ఇంక్యుబేషన్‌కు సంబంధించి పలు కార్యకలాపాలు చేపడుతోంది.
***
(Release ID: 1617593)
Visitor Counter : 250