శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 ప్రభావ నియంత్రణలో సామర్థ్యాన్ని నిరూపించుకున్న ఎన్‌జీవో నెట్‌వర్క్‌ ఎన్‌జీవో నెట్‌వర్క్‌కు శాస్త్ర, సాంకేతిక విభాగం మద్దతు

Posted On: 22 APR 2020 5:37PM by PIB Hyderabad

భారతదేశంలో కొవిడ్‌-19 ప్రభావాన్ని పరిమితం చేయడంలో తన పనితీరును, దేశంలోని 22 రాష్ట్రాలలో విస్తరించిన, బలమైన శాస్త్ర, సాంకేతిక (S&T) సామర్థ్యమున్న ఎన్‌జీవోల నెట్‌వర్క్‌ నిరూపించుకుంది. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన నివారణ చర్యలపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, స్థానిక అధికారులను ప్రశంసించింది. S&T నెట్‌వర్క్‌కు 'శాస్త్ర, సాంకేతిక విజ్ఞాన డిపార్టుమెంటు' (DST) కు చెందిన 'సైన్స్‌ ఫర్‌ ఈక్విటీ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (SEED) దీనికి మద్దతు ఇస్తోంది.

శాస్త్ర, సాంకేతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎన్‌జీవో నెట్‌వర్క్‌ బాసట
    భారత ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న 'ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్' (PSA) మార్గదర్శకాలకు అనుగుణంగా సుమారు 1,20,000 ఫేస్ మాస్కులు తయారు చేశారు. కొవిడ్-19 ద్వారా ప్రధానంగా ప్రభావితమవుతున్న ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ, గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్ ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ట్రాలకు ఆ మాస్కులను పంపిణీ చేశారు. నెట్‌వర్క్‌లోని 30 ఎన్జీఓలు,  కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ల  ద్వారా పంపిణీ చేపట్టారు. దీనిని అనుసరించేలా నెట్‌వర్క్‌లోని ఇతర ఎన్జీవోలను కూడా క్రియాశీలం చేశారు.

3డి ప్రింటెడ్‌ మాస్కులు, శానిటైజర్లు తయారీ
    సరికొత్త ఓపెన్‌ సోర్స్‌ డిజైన్‌ ద్వారా రూపొందించిన 3డి ప్రింటెడ్‌ ఫేస్‌ మాస్కులను మహారాష్ట్రలోని 2500 పోలీసు సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫారసుల ప్రకారం తయారైన హ్యాండ్ శానిటైజర్లు పంపిణీ కోసం సిద్ధం చేశారు. USFDA మార్గదర్శకాలకు అనుగుణంగా కుంకుడుకాయలను వినియోగించి వంద శాతం సహజ ద్రవ హ్యాండ్ వాష్‌లను తయారు చేశారు.  ఇథనాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిసరాల్, మాసిపత్రి సారంతో హ్యాండ్ శానిటైజర్లు అభివృద్ధి చేశారు. 
    మరో 15 రోజుల్లో 3 లక్షల ఫేస్ మాస్క్‌లు, 3 వేల ఫేస్ షీల్డ్స్, 15 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్, 5 వేల లీటర్ల లిక్విడ్ హ్యాండ్ వాష్ ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. మహిళా సాధికార సంఘాలు, రైతు సంఘాలు, యువతను ఇందులో భాగస్వాములను చేసేలా సమీకరిస్తున్నారు. రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌ (SRLM) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటోంది. కొవిడ్ మహమ్మారిని నియంత్రించడంలో కీలకమైన ఈ అంశాలపై సమాజంలో అవగాహన, సామర్థ్యాన్ని పెంచేలా ఈ ఎన్జీఓ నెట్‌వర్క్‌ కృషి చేస్తోంది.

SHGs మహిళలకు ప్రత్యామ్నాయ ఆదాయం
    కొవిడ్‌-19 నియంత్రణ చర్యలు కాకుండా, స్వయం సాధికార సంఘాల మహిళలకు ప్రత్యామ్నాయ ఆదాయం లభించేలా కూడా NGO నెట్‌వర్క్‌ కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి. DST మద్దతు ఉన్న ఎన్జీఓ నెట్‌వర్క్ ద్వారా అమలవుతున్న ఈ కార్యక్రమాల కారణంగా, గ్రామీణ జనాభాపై అధిక ఖర్చులు, వైరస్‌ వ్యాప్తి ప్రభావం తగ్గింది.

    తక్షణ, మధ్యంతర, దీర్ఘకాలిక S&T సేవల అవసరాన్ని వివరించిన DST కార్యదర్శి శ్రీ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, "సమాజంలోని విస్తృత భాగాలకు ఎన్జీఓలు చేరుకున్నాయి. ప్రత్యేకించి అల్పాదాయ వర్గాలకు చేరువయ్యాయి. సామూహిక అవగాహన నుంచి కొవిడ్-19 సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి, రక్షణ సహాయాల పంపిణీకి, తయారీకి, కొత్తవారికి శిక్షణ ఇవ్వడానికి భారీ సహాయకారిగా మారాయి. DST నుంచి ముఖ్య మద్దతు పొందుతున్న 30 ఎన్జీఓలు సహాయ కార్యక్రమాలపై వేగంగా చర్యలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది ”.

    DST ఎన్జీవో నెట్‌వర్క్‌కు సలహాలు ఇవ్వడంతోపాటు, S&T చర్యల ద్వారా సామాజిక వ్యాప్తి నుంచి కొవిడ్‌-19ను నియంత్రించడానికి వేగంగా చర్యలు చేపట్టింది. సామాజిక దూరం, క్వారంటైన్, మాస్కులు, శానిటైజర్లు, ఆరోగ్యం మరియు పరిశుభ్రత పద్ధతులు, మానసిక ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంపొందించే విధానాల వంటి కీలక అంశాల పట్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తోంది. గ్రామీణ జీవనోపాధి, పోషకాహారం, సామాజిక ఆర్థిక స్థితులతో కొవిడ్‌ నియంత్రణ చర్యలు ముడిపడి ఉన్నాయని స్పష్టమైన నేపథ్యంలో ఈ అట్టడుగు సామాజిక నెట్‌వర్క్ యొక్క S & T సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి.

    ( మరిన్ని వివరాల కోసం డా.సునీల్‌ కె. అగర్వాల్‌, సైంటిస్ట్,sunilag[at]nic[dot]in,    
 మొబైల్‌ నంబర్‌ 9999689732 ను సంప్రదించవచ్చు ).

***



(Release ID: 1617370) Visitor Counter : 187