గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19తో పోరాడటానికి ఫరీదాబాద్ జిల్లా పరిపాలన యంత్రాంగం వివిధ ర‌కాల చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంది; ప‌ర్య‌వేక్ష‌ణ‌తో పాటు అవగాహన పెంపొందించ‌డానికి సాంకేతికత వినియోగం

Posted On: 22 APR 2020 6:07PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు ఫ‌రిదాబాద్ జిల్లా యంత్రాంగం వివిధ ర‌కాల చ‌ర్య‌ల‌ను చేప‌ట్టిందిః ఆహార పంపిణీకి కార్యాచరణ ప్రణాళిక కోవిడ్‌-19 నేప‌థ్యంలో జాతీయ లాక్‌డౌన్ అమ‌లవుతు‌న్న కారణంగా, అనేక పట్టణ పేద మరియు తక్కువ ఆదాయ కుటుంబాల వారు త‌గిన ఆహారం కొనడానికి చాలినంత డబ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వీరికి తక్షణ సహాయం అవ‌స‌ర‌మ‌వుతోంది. ఈ నిరుపేద కుటుంబాలలో చాలా మందికి రోజువారీ ఆదాయంతోనే ఆహారం ల‌భిస్తుంది. రోజువారీ సంపాదన లేకుంటే వారికి పూట గ‌డ‌వ‌డం కూడా క‌ష్ట‌మే. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ కార్పొరేషన్ ఫరీదాబాద్ త‌మ ప‌రిధిలో మొత్తం 40 వార్డుల్లోని స్థానిక పౌర సమాజాన్ని అన్నార్తుల ఆక‌లిని తీర్చేందుకు నిమగ్నం చేసింది. పేద‌ల ఆక‌లి తీ‌ర్చేందుకు గాను స్వ‌చ్ఛంద సంస్థ‌లతో పాటు, వార్డ్ కౌన్సిలర్లు, వాలంటీర్ల‌ను ఆహారం పంపిణీకి జిల్లాలోని పరిపాలన యంత్రాంగానికి సహాయం చేస్తున్నారు. ఈ కార్యాచరణ ప్రణాళికకు హెచ్‌ఎస్‌వీపీ అడ్మినిస్ట్రేటర్ నోడల్ ఆఫీసర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా. ఆయ‌న‌కు హెచ్‌ఎస్‌వీపీ ఎస్టేట్ ఆఫీసర్ తో పాటుగా ఇత‌రులు స‌హ‌య‌క‌రంగా
నిలుస్తున్నారు. ఫరీదాబాద్ ఎస్‌డీఎం కార్ పాస్ మరియు గుర్తింపు కార్డుల జారీ రూపంలో సహాయాన్ని అందిస్తుంది. పౌర సమాజం, సెమీ గవర్నమెంట్ మరియు ప్రభుత్వేతర సంస్థలు, సీఎస్ఆర్‌ ఫండ్స్, రెడ్ క్రాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్, మున్సిపల్ కార్పొరేషన్ నిధులు, మధ్యాహ్నం భోజన పథకంలో లభించే ఆహార పదార్థాలు, అంగన్‌వాడీ రేషన్, పీడీఎస్‌ మరియు ఇతర ప్రభుత్వ పథకాల ఇత‌ర వ‌న‌రుల ద్వారా ల‌భించే నిధుల‌తో ఆహారాన్ని త‌యారు చేసి పేద‌ల‌కు అంద‌జేస్తున్నారు. వారం రోజుల‌కు స‌రిపోయేలా వండిన ఆహారం మరియు రేషన్ స‌రుకుల‌ను ఆక‌లితో ఉంటున్న పేద‌ల ఇంటి వ‌ద్ద‌కే పంపిణీ చేస్తున్నారు.

.



కంట్రోల్ రూమ్, ఫోటో డాక్యుమెంటేషన్ః  కోవిడ్ కంట్రోల్ రూమ్ ఇన్‌చార్జిగా ఎస్‌డీఎమ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎస్‌డీఎం ఇక్క‌డి ఆపరేటర్లకు శిక్షణ ఇస్తోంది. దీనికి తోడు కోవిడ్‌కు సంబంధించి చేప‌డుతున్న ప‌నుల సమాచార సంకలనాన్ని కూడా నిర్ధారిస్తుంది. డీపీఆర్ఓ, ఫరీదాబాద్ వారు ఆహార పంపిణీ కార్యకలాపాలను వార్డ్ నోడల్ అధికారులు లేదా సామగ్రిని పంపిణీ చేసే స్వచ్ఛంద సేవకుల మొబైల్ ఫోన్‌ల ద్వారా డాక్యుమెంట్ చేయడానికి ఏర్పాట్లు చేసింది. వీరందించే స‌మాచారంతో వార్డ్ వారీగా ఫోటో డాక్యుమెంటేషన్ చేసి డిజిటల్ రూపంలో వీటిని నిల్వ చేస్తోంది. ఆహార పంపిణీ సంద‌ర్భంగా సామాజిక దూరాన్ని క‌చ్చితంగా పాటిస్తున్నారు.



కోవిడ్‌-19 వేళ‌ పొడి రేషన్ నిల్వ మరియు తయారీకి ప్రణాళికః
ఫరీదాబాద్ జిల్లా పరిపాలన యంత్రాంగం జిల్లాలో ఉంటున్న‌ అన్ని వ‌య‌స్కుల వారికి ఆహారం అందించేందుకు అవసరమైన‌ ప్రణాళికను రూపొందించింది. ఫరీదాబాద్‌లోని డీఎఫ్‌ఎస్‌సీ, డీఎం-హాఫెడ్, రెడ్‌క్రాస్ సొసైటీ, ఎస్‌డీఎమ్‌తో సంప్రదించి నోడల్ ఆఫీసర్ మార్గదర్శకత్వంలో ఒక వ్యూహంతో నిర్ధిష్ట‌ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ సంస్థల నుండి వలస కార్మికులు / అసంఘటిత రంగ కార్మికులు / ఇత‌ర ఆర్థిక బాధలో ఉన్న వివిధ వ‌ర్గాల వివరాలు సేకరించారు. 14,000 కుటుంబాలకు (ప్రతి కుటుంబానికి ఐదుగురు సభ్యులు) 50% అదనపు నిల్వ‌తో రేష‌న్ అంచ‌నా వేయ‌బడింది. ఈ కాలంలో ప్రభుత్వ సహాయం మొత్తంగా  21000 కుటుంబాల వారికి అవ‌స‌ర‌మ‌ని అంచనా వేయబడింది. ఈ రేష‌న్ నిల్వ కార్య‌క్ర‌మం కోసం ఫరీదాబాద్ సెక్టార్-12 లో ఇటీవ‌ల కొత్తగా నిర్మించిన ఇండోర్ స్టేడియంను జిల్లా పరిపాలన యంత్రాంగం ఎంపిక చేసింది. ఎంసీఎఫ్, హెచ్‌ఎస్‌వీపీ, రెడ్‌క్రాస్ సొసైటీ, జిల్లా సైనిక్ బోర్డ్, ఫైర్ బ్రిగేడ్, పోలీస్, హర్యానా రోడ్‌వేస్ వంటి వివిధ విభాగాలలోని ప్రభుత్వ అధికారుల బృందంగా ఏర్పాటు చేశారు. జిల్లా పరిపాలన యంత్రాంగానికి చెందిన ఒక అధికారిని దీనికి ఇన్‌చార్జిగా నియమించారు.


పొడి రేషన్ సేకరణ: జిల్లా యంత్రాంగం 21000 పూర్తి పొడి రేషన్ ప్యాకెట్ల త‌యారీ లక్ష్యాన్ని అందించడానికి ల‌క్ష్యంగా నిర్ధారించుకున్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ప్రముఖ భూమిక‌ను ఇందుకు అభ్య‌ర్థించ‌డ‌మైంది. ఇందుకు గాను బ‌ల్లాబ్‌ఘ‌ర్ (ఫరీదాబాద్), పల్వాల్ జిల్లాలో గ‌ల హోడ‌ల్లో గ‌ల రెండు సరఫరా వనరులను అధికారులు ఇందుకోసం గుర్తించారు. వీటికి 20000 ప్యాకెట్ల పూర్తి పొడి రేషన్లను సరఫరా చేసే సామర్థ్యం ఉంది.
పర్యవేక్షణ, నిర్వ‌హ‌ణ నిమిత్తం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం..
ప్ర‌స్తుత లాక్‌డౌన్‌ పరిస్థితులను నిర్వహించడానికి ఫరీదాబాద్ నగరాన్ని ఫరీదాబాద్ స్మార్ట్ సిటీ ఐసీసీసీ పోలీసు సిబ్బంది 24x7 నిరంత‌రాయంగా పర్యవేక్షిస్తున్నారు.
- ఐసీసీసీ వద్ద ట్రాఫిక్ లైట్లను ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఏదైనా వైద్య అవసరం / అత్యవసర పరిస్థితుల్లో, అంబులెన్స్‌లను ట్రాఫిక్ లైట్ల కారిడార్‌లో ఐసీసీసీ ద్వారా ఎలాంటి అవాంత‌రాలు లేకుండా ప్రయాణానికి అనుమతించేలా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

 



అవగాహనను వ్యాప్తి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం వాడ‌కం..
- కోవిడ్‌-19 రక్షణ మార్గదర్శకాలపై అవగాహన కల్పించడానికి పోలీసు సిబ్బంది స్మార్ట్ సిటీ ఐసీసీసీ కంట్రోల్ సెంటర్ నుండి స్థానిక‌ పౌరులకు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (పీఏ) వ్య‌వ‌స్థ‌ను వినియోగిస్తున్నారు.
- కోవిడ్‌-19 నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు గాను ప్రభుత్వ సందేశాలు మరియు ప్రదర్శనలను చూపించి అవగాహన పెంచడానికి స్థానిక యంత్రాంగా వేరియబుల్ మెసేజ్ సైన్ (వీఎంఎస్‌) బోర్డులను ఉపయోగిస్తున్నారు.
- క‌రోనా వైర‌స్ వ్యాప్తి  వంటి సంక్షోభ‌పు స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు జిల్లా హెల్ప్ డెస్క్ సమాచారంతో పాటు అస‌ర‌మైన ఇత‌ర స‌మాచారం పాజిటివిటీని వ్యాప్తి చేసేందుకు గాను ఫరీదాబాద్ స్మార్ట్ సిటీ వాట్సాప్ వంటి వివిధ డిజిటల్ సోషల్ మీడియా వివిధ వేదిక‌లను ఉపయోగిస్తుంది.
-ఫరీదాబాద్ పౌరులు ఇంట్లో త‌యారు చేసుకున్న మాస్క్‌ల వాడ‌కం గురించిన‌
స‌ల‌హాల‌ను, ఇంట్లో మాస్క్‌ల త‌యారీకి వాటి వాడ‌కానికి సంబంధించిన వివిధ నైపుణ్య‌త‌ల‌ను అందించేందుకు కూడా ఈ వేదికను వినియోగిస్తున్నారు. ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ ద్వారా స్మార్ట్ సిటీ ఫరీదాబాద్‌లోని 5 లక్షల మంది పౌరులకు అవ‌గాహ‌న‌ను క‌ల్పిస్తున్నారు.
-కోవిడ్‌-19కు సంబంధించి ప్ర‌భుత్వం అందిస్తున్న వివిధ సలహాలు మరియు హెల్ప్ డెస్క్ సమాచారాన్ని పౌరుల‌కు అందించేందుకు గాను ఫ‌రీదాబాద్ యంత్రాంగం ఫేస్‌బుక్‌, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాల ద్వారా కూడా ప్రచారం నిర్వ‌హి‌స్తోంది. 

 

 

 

 

 

 

 

 

 

 

***



(Release ID: 1617318) Visitor Counter : 233