నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

కరోనా మహమ్మారి నేపథ్యంలో అవసరమైన సేవలను అందించేందుకు 900 మంది సర్టిఫైడ్ ప్లంబర్ల జాబితాను విడుదల చేసిన స్కిల్ ఇండియా
ఇండియన్ ప్లంబింగ్ స్కిల్స్ కౌన్సిల్ (ఐ.పి.ఎస్.సి) అవసరమైన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్న నిపుణులైన, దృవీకరించబడిన ప్లంబర్ల జాబితాను అందించింది.

70 మందికి పైగా అనుబంధ శిక్షణ భాగస్వాములు అవసరమైన వారికి ఆహారం మరియు అత్యవసర సామగ్రిని అందిస్తున్నారు.

భారతీయ ప్లంబింగ్ వర్క్ ఫోర్స్ కోసం ఆరోగ్య మరియు భద్రతా మార్గదర్శకాల విడుదల

Posted On: 22 APR 2020 1:50PM by PIB Hyderabad

కోవిడ్ -19 సంక్షో సమయంలో ప్లంబింగ్ వంటి అవసరమైన సేవల అవసరాన్ని గుర్తించి, స్కిల్ ఇండియా కార్యక్రమానికి అనుసంధానించబడిన ఇండియన్ ప్లంబింగ్ స్కిల్స్ కౌన్సిల్ (ఐ.పి.ఎస్.సి), నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎం.ఎస్.డి.ఈ) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా లౌక్ డౌన్ కాలంలో సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్న 900 మందికి పైగా ప్లంబర్ల జాబితాను  సిద్ధం చేసింది. ఐ.పి.ఎస్.సి. తన అనుబంధ శిక్షణ భాగస్వాములను ఆహారం మరియు అవసరమైన సామగ్రి పంపిణీ డ్రైవ్ లను నిర్వహించేందుకు, తయారీ మరియు పంపిణీ కార్యకలాపాల్లో అవసరమైన సహాయాన్ని అందించాలని కోరింది. ఆహార పంపిణీ/ ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు 70కి పైగా శిక్షణా కేంద్రాలు నామినేట్ చేయబడ్డాయి.

కఠినమైన ఆరోగ్య మరియు భద్రతా నిబంధనల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ప్లంబింగ్ వర్క్ ఫోర్స్ ను పరిశీలించేందుకు మార్గదర్శకాలను ఐ.పి.ఎస్.సి. రూపొందించింది. ప్రత్యేక ఐ.పి.ఎస్.సి. టెక్నికల్ టాస్క్ ఫోర్స్ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. మార్గదర్శకాలు నివాస భవనాలు, అపార్టు మెంట్లు, ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు మరియు ఇతర సంస్థల వివరాలు సహా ముఖ్యమైన చేయదగిన మరియు చేయకూడని మరియు స్థాన నిర్ధిష్ట ముందు జాగ్రత్త చర్యలను కలిగి ఉంటాయి.

 

మార్గదర్శకాల్లోని కొన్ని ముఖ్యాంశాలు :

1.   సామాజిక దూరాన్ని పాటించాలి.

2.   ఉపకరణాలు, పరికరాలు, టచ్ పాయింట్లను క్రిమిసంహారక చేయాలి – తగిన మోతాదులో వినియోగించాలి.

3.   నగదు రహిత లావాదేవీకి ప్రాధాన్యత ఇవ్వాలి.

4.   ఉపయోగించిన పదార్థాన్ని పారవేయాలి.

5.   సంక్షోభ సమయంలో స్వయంసేవ కోసం వినియోగదారులకు అవగాహన కల్పించాలి.

6.   అవసరమైన మేరకు బ్యాక్‌ట్రాకింగ్ కోసం లాగ్‌ను నిర్వహించాలి.

2020 ఏప్రిల్ 15న హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2020 ఏప్రిల్ 20 నుంచి ప్లంబర్లు తమ సేవలను అందించేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది.

కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే మాట్లాడుతూ ఈ మార్గదర్శాలను రూపొందించడంలో ఐ.పి.ఎస్.సి. చురుకైన ప్రయత్నాలు ప్రశంసనీయమని, కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారతజాతి సాగిస్తున్న పోరాటంలో ఇది స్వాగతించదగిన పరిణామమని తెలిపారు. అందరూ కలిసి పని చేయడంతో పాటు ఈ పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలతో పాటు ముందు వరుసలో పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల ప్రయత్నాలకు మద్ధతు అందించాలని తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి ఈ మధ్య తన ప్రసంగంలో పంచుకున్న ఏడు అంశాలను ప్రతి పౌరుడు అనుసరించాలని, ఈ ఘోరమైన మహమ్మారిపై పోరాటానికి ఇది విస్తృతంగా సహాయపడుతుందని తెలిపారు. దేశానికి తమ సేవల ద్వారా సహకరించేందుకు స్వచ్ఛంద సేవకుల నుంచి ఐ.పి.ఎస్.సి. నిరంతర అభ్యర్థనలను అందుకుంటోంది కాబట్టి ఈ 900 సంఖ్య భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ఆయన వివరించారు.

ఇండియన్ ప్లంబింగ్ స్కిల్స్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్. రాజేంద్ర కె సోమనీ మాట్లాడుతూ, భారత పౌరుల ఆరోగ్య మరియు భద్రతకు చాలా ప్రాధాన్యత ఉందని, దేశ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్లంబింగ్ శ్రామిక శక్తి చాలా ప్రాధాన్యత అందిస్తుందని తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో శ్రామిక శక్తి మరిన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవలసిన అవసరం ఉందని, ఎమ్. కె. గుప్తా నేతృత్వంలోని టెక్నికల్ టాస్క్ పోర్స్ ఈ మార్గదర్శకాలను రూపొందించిందని తెలిపారు.

భారతదేశంలో ప్లంబింగ్ రంగం అసంఘటితమైనది. కాంట్రాక్టు మరియు వలస శ్రామిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కాంట్రాక్టర్లు, తయారీ దారులు మరియు కన్సల్టెంట్స్ వంటి వివిధ వైవిధ్య భరితమైన ఉప విభాగాలు ఉండే ఈ రంగంలో ఏ సంస్థ ప్రాతినిథ్యం వహించలేదు. నైపుణ్యం కలిగిన మానవశక్తి డిమాండ్ మరియు సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఐ.పి.ఎస్.సి. ప్రారంభమయ్యింది. ఈ నైపుణ్య లోటును తగ్గించడంలో సహాయపడేందుకు ప్లంబింగ్ సమాజానికి సంపూర్ణ నైపుణ్య అభివృద్ధికి మద్ధతుగా వృత్తి నైపుణ్యంలో నిలకడగా ఇది రాణిస్తోంది. ప్రస్తుతం ఐ.పి.ఎస్.సి.లో సుమారుగా 230 శిక్షణా కేంద్రాలు, 250 సర్టిఫైడ్ శిక్షకులు మరియు 85 సర్టిఫైడ్ మదింపుదారులు ఉన్నారు. భారతీయ ప్లంబింగ్ రంగంలో ఈ వ్యవస్థను అధికారికం చేసేందుకు సంబంధించిన ఇతర ముఖ్యమైన కార్యకలాపాల్లో స్కిల్ ఇండియా మిషన్ దిశగా పరిశ్రమను నిమగ్నం చేసేందుకు ఐ.పి.ఎస్.సి. నిరంతరం కృషి చేస్తోంది.

ఎం.ఎస్.డి.ఈ. నైపుణ్యాల ఉపాధిని పెంచడం పై దృష్టి పెడుతుంది. 2014లో ప్రారంభమైనప్పటి నుంచి విధానం, ఫ్రేమ్ వర్క్ మరియు ప్రమాణాలను లాంఛనప్రాయంగా గణనీయమైన కార్యక్రమాలు మరియు ప్రమాణాలను చేపట్టింది. కొత్త కార్యక్రమాలు మరియు పథకాలను ప్రారంభించడం, కొత్త మౌలిక సదుపాయాలను సృష్టించడం మరియు ఉన్న సంస్థలను అభివృద్ధి చేయడం, రాష్ట్రాలతో భాగస్వామ్యం, పరిశ్రమలతో నిమగ్నం కావడం, నైపుణ్యం కోసం సామాజిక అంగీకారం మరియు ఆకాంక్షలను సరిచూడడం, ఇప్పటికే ఉన్న ఉద్యోగాలకు మాత్రమే కాకుండా, భవిష్యత్ లో రాబోయే ఉద్యోగాలకు కూడా కొత్త నైపుణ్యాలు మరియు ఆవిష్కరణలను నిర్మించడానికి నైపుణ్యం కలిగిన మానవ శక్తి డిమాండ్ మరియు సరఫరా మధ్య అంతరాన్ని తగ్గించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకూ స్కిల్ ఇండియా కింద మూడు కోట్లకు పైగా ప్రజలకు శిక్షణ అందించారు. తమ ప్రధాన కార్యకమమైన కౌశల్ వికాస్ యోజన (పి.ఎం.కె.వి.వై) 2016-2020 కింద మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకూ 92 లక్షలకు పైగా అభ్యర్థులకు శిక్షణ అందించింది.

 

--(Release ID: 1617084) Visitor Counter : 118