రాష్ట్రపతి సచివాలయం
రాష్ట్రపతి ఎస్టేట్‌లో కోవిడ్-19 పాజిటివ్ కేసు గుర్తించడం గురించి వచ్చిన వార్తలపై సమాచారం
Posted On:
21 APR 2020 4:26PM by PIB Hyderabad
రాష్ట్రపతి ఎస్టేట్‌లో కోవిడ్-19 పాజిటివ్ కేసు గుర్తించడం గురించి మీడియాలో వచ్చిన వార్తలు, ఊహాగానాల నేపథ్యంలో ,దానికి సంబంధించిన వాస్తవాలు కింది విధంగా ఉన్నాయి.:
ఎ) సెంట్రల్ ఢిల్లీకి చెందిన ఒక కోవిడ్ -19 పేషెంటు, ఇతర రోగలక్షణాలు కూడా ఉండడంతో న్యూఢిల్లీలోని బిఎల్ కపూర్ ఆస్పత్రిలో 13.04.2020న మరణించడం జరిగింది. ఆ వ్యక్తి రాష్ట్రపతి సెక్రటేరియట్ ఉద్యోగికానీ, రాష్ట్రపతి ఎస్టేట్ లో నివసిస్తున్నవ్యక్తికానీ కాదు.
బి) మరణించినవ్యక్తి కి సంబంధించిన కాంటాక్టులను పరిశీలించిన తర్వాత,రాష్ట్రపతి సెక్రటేరియట్ ఉద్యోగి కుటుంబ సబ్యలు ఒకరు మరణించిన వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉన్నట్టు గుర్తించారు.
సి)ఈ ఉద్యోగి తన కుటుంబంతో కలిసి రాష్ట్రపతి ఎస్టేట్‌లోని పాకెట్1, షెడ్యూలు-ఎ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ కుటుంబంలోని మొత్తం ఏడుగురు సభ్యులను 16-04-2020 న మందిర్ మార్గ్‌లోని క్వారంటైన్‌కు తరలించారు.
డి) ఆ తర్వాత , మరణించిన వ్యక్తితో సంబంధం కలిగిన కుటుంబ సభ్యులలో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణైంది. రాష్ట్రపతి సెక్రటేరియట్ ఉద్యోగితో సహా ఇతర కుటుంబ సభ్యులందరికీ నెగటివ్ గా నిర్ధారణ అయింది..
ఇ) విపత్తు నిర్వహణ చట్టం 2005,ఎపిడమిక్ డిసీజ్ చట్టం 1897 కింద నియమితులైన అథారిటీ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రపతి ఎస్టేట్ లోని పాకెట్ 1 లోని 115 ఇళ్ల వారిపై బయట తిరగకుండా ఆంక్షలు విధించారు. ఇందులో నివాసం ఉంటున్న వారిని ఇళ్లకు పరిమితం కావాలని సూచించారు. ఈ ఇళ్లలోని వారికి ఇంటివద్దకే నిత్యావసర సరకులు అందజేస్తున్నారు.
ఎఫ్) ఇప్పటివరకూ రాష్ట్రపతి సెక్రటేరియట్ లోని ఏ ఉద్యోగి కోవిడ్ -19 పాజిటివ్ కింద నిర్ధారణ కాలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వైరస్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్రపతి సెక్రటేరియట్, స్థానిక పాలనాయంత్రాంగం తీసుకుంటోంది.
.
********
(Release ID: 1616970)
Visitor Counter : 223