శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 రోగనిర్ధారణ కిట్‌ల ఉత్పత్తిని పెంచడానికి స్వదేశీ సంస్థకు టిడిబి ప్రోత్సాహం
ఫ్లూ లాంటి లక్షణాల నమూనాల నుండి రియల్ టైమ్ పిసిఆర్ ఆధారిత మాలిక్యులర్ డయాగ్నొస్టిక్ కిట్- కోవిడ్ -19 ను పరీక్షించి కనుగొంటుంది
Posted On:
21 APR 2020 5:29PM by PIB Hyderabad
పూణేలోని మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అభివృద్ధి చేసిన కోవిడ్ -19 డయాగ్నొస్టిక్ కిట్‌ల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సహాయం చేసేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి) చట్టబద్ధమైన సంస్థ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు (టిడిబి) ఆమోదించింది. కోవిడ్-19 తో పోరాడటానికి సాంకేతికంగా వినూత్న పరిష్కారాల ప్రతిపాదనల కోసం చేసిన ఆహ్వానానికి స్పందించిన మైలాబ్ సంస్థ దరఖాస్తు చేసుకుంది.
ఫ్లూ లాంటి లక్షణాలను ప్రదర్శించే వ్యక్తుల నమూనాల నుండి కోవిడ్ - 19 ని స్క్రీన్ చేసి గుర్తించే రియల్ టైమ్ పిసిఆర్ ఆధారిత మాలిక్యులర్ డయాగ్నొస్టిక్ కిట్‌ను అభివృద్ధి చేసిన మొట్టమొదటి స్వదేశీ సంస్థ మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్. టిడిబి సహాయంతో ఆ సంస్థ ప్రస్తుత మాన్యువల్ ప్రాసెస్ నుండి ఆటోమేషన్ ద్వారా కిట్ల ఉత్పత్తిని పెంచుతారు, తద్వారా దాని ప్రస్తుత సామర్థ్యాన్ని రోజుకు 30,000 పరీక్షల నుండి ఒక లక్ష పరీక్షలకు పెంచుతుంది. రాబోయే కొద్ది నెలల్లో కంపెనీ ఆటోమేషన్‌ను పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ కిట్‌ను ఐసిఎంఆర్, సిడిస్కో ఆమోదించాయి. జాతీయ అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని చాలా తక్కువ సమయంలో కిట్‌ను తేనున్నారు.
నిఘా, ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ, ప్రయోగశాల ప్రోత్సాహం, ముఖ్యంగా, అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల ఐసొలేషన్, వెంటిలేటర్ నిర్వహణ పరంగా సంసిద్ధత, కోవిడ్-19 వ్యాప్తిని నివారించడం కోసం టిడిబి భారతీయ కంపెనీలు సంస్థల నుండి మార్చి 20న దరఖాస్తులను ఆహ్వానించింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం వ్యాపారాత్మకంగా వినియోగించడం కోసం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు ఆర్థిక సహాయం అందించడం టిడిబి ఉద్దేశం. ఆహ్వానానికి ప్రతిస్పందించిన సంస్థలలో మైలాబ్ ఒకటి.
ఈ ప్రయత్నానికి దేశం వ్యాధులు సంబంధిత అంశాల ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయడం. రోగ పరీక్ష, ఐసోలేషన్, కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం తక్షణ అవసరం. అలాగే వ్యాధి వ్యాప్తి గొలుసు విచ్ఛిన్నం కావడం కూడా చాలా అవసరం. కాబట్టి టిడిబి ఈ అంశాలకు సంబంధించిన ప్రక్రియకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఐఐటీలు, ఐఐఎస్‌సిలు, ఎయిమ్స్, ఐసిఎంఆర్, డిఎస్టి, డిబిటి వంటి ప్రభుత్వ మరియు విద్యాసంస్థల నిపుణుల ద్వారా కఠినమైన మూల్యాంకనం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
“వైరస్ కాలంలో పని మాకు వేగం, సామర్థ్యం, నాణ్యతతో అపూర్వమైన ప్రయోజనం పొందడానికి తీవ్రత ఎలా ఉంటుందో నేర్పింది, శక్తి, నైపుణ్యం కలిగిన యువ నిపుణుల బృందాన్ని కలిగి ఉండటం ఈ ప్రయత్నానికి మూలం!” అని డిఎస్టి కార్యదర్శి, టిడిబి ఛైర్మన్ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అభిప్రాయపడ్డారు.
M/s MyLab Discovery Solutions, Pune
[మరిన్ని వివరాల కోసం సంప్రదించండి : సీడీఆర్ నవనీత్ కౌశిక్ Sc 'E', టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు, navneetkaushik.tdb[at]gmail[dot]com , Mob: 9560611391]
(Release ID: 1616949)
Visitor Counter : 217