వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ సమయంలో అండమాన్ & నికోబార్ దీవులకు 2 నౌకలు, లక్షద్వీప్ దీవులకు 7 చిన్న నౌకల్లో ఆహార ధాన్యాలు రవాణా చేసిన ఎఫ్.సి.ఐ.
గత 27 రోజుల్లో అండమాన్ & నికోబార్ దీవులకు ఒక నెల సరాసరికి రెట్టింపుకంటే ఎక్కువగా సుమారు 6500 మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు ; లక్షద్వీప్ కి ఒక నెల సరాసరికి దాదాపు మూడు రెట్లు ఎక్కువగా 1750 మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలను ఎఫ్.సి.ఐ. రవాణా చేసింది.
Posted On:
21 APR 2020 4:14PM by PIB Hyderabad
క్లిష్టపరిస్థితుల్లో ఉన్నపుడు, భాగస్వాములకు రవాణా వాహనాలు, నిత్యావసర వస్తువులు అందుబాటులో లేనప్పుడు, ఎఫ్.సి.ఐ. ట్యాంకు అందుబాటులో ఉన్న వనరులను, వివిధ రవాణా పద్దతులను ఉపయోగించి దేశంలోని సుదూర దీవుల్లో సమృద్ధిగా ఆహారధాన్యాలు అందుబాటులో ఉండే విధంగా సేవలందిస్తోంది.
లాక్ డౌన్ అమలులో ఉన్న గత 27 రోజుల్లో లక్షద్వీప్ తో పాటు అండమాన్ & నికోబార్ దీవులకు ఆహార ధాన్యాల నిరంతర సరఫరా కోసం భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ.) తీవ్రంగా కృషి చేసింది. సుదూర ప్రాంతాలు కావడం, సరైన రవాణా వాహనాలు అందుబాటులో లేకపోవడం వంటి అవాంతరాలు ఎదురైనప్పటికీ, ఈ దీవుల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పి.డి.ఎస్.) కింద ఆహార ధాన్యాల సరఫరా కొనసాగేలా చూడడానికి తీవ్రంగా శ్రమించవలసి వచ్చింది. ఈ దీవుల్లో ప్రజలు పూర్తిగా పి.డి.ఎస్. పైనే ఆధారపడి ఉండడంతో, ఈ దీవులకు సకాలంలో ఆహారధాన్యాలు అందేలా చూడడం అతి ముఖ్యమైన విషయం. దేశవ్యాప్తంగా లోక్ డౌన్ కొనసాగుతున్న గత 27 రోజుల్లో ఎఫ్.సి.ఐ. అండమాన్ & నికోబార్ దీవులకు 7 నౌకలు, లక్షద్వీప్ దీవులకు 7 చిన్న నౌకల్లో ఈ దీవులకు ఒక నెలలో సరాసరిన రవాణా అయ్యేదానికి సుమారు రెట్టింపు కంటే ఎక్కువగా ఆహార ధాన్యాలు రవాణా అయ్యాయి.
అండమాన్ & నికోబార్, లక్షద్వీప్ దీవులకు భారతదేశం నుండి రోడ్డు, రైలు మార్గాలు లేకపోవడంతో ఆహారధాన్యాలు రవాణా చేయడానికి కేవలం సముద్ర మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. అండమాన్ & నికోబార్, లక్షద్వీప్ దీవుల్లో ఎఫ్.సి.ఐ. కి ఒక్కొక్క డిపో ఉన్నాయి. అవి పోర్ట్ బ్లెర్ లో 7080 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో ఒకటి, ఆండ్రోత్ లో 2500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో మరొకటి డిపోలు ఉన్నాయి. పోర్ట్ బ్లెర్ లో ఉన్న ప్రధాన డిపో కి సరకులను రవాణా చేయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ రేవు నుండి వచ్చిన ఆహార ధాన్యాలను ఓడ లోనే అండమాన్ & నికోబార్ దీవుల వ్యాప్తంగా ఉన్న 12 ప్రధాన పంపిణీ కేంద్రాలకు (పి.డి.సి.లకు) నేరుగా తరలించి, పి.డి.ఎస్. ద్వారా ఆహార ధాన్యాలను సులువుగా ప్రజలకు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. లక్షద్వీప్ దీవుల్లో పి.డి.ఎస్. అవసరాలను ఆండ్రోత్ వద్ద ఉన్న 2500 మెట్రిక్ టన్నుల ఎఫ్.సి.ఐ. గిడ్డంగి ద్వారా నెరవేరుస్తారు. కర్ణాటక లోని మంగళూరు ఓడ రేవు నుండి ఆండ్రోత్ లోని ఎఫ్.సి.ఐ. గిడ్డంగికి నేరుగా ఆహారధాన్యాలను నేరుగా రవాణా చేస్తారు, అక్కడ నుండి లక్షద్వీప్ లోని చిన్న చిన్న దీవులకు స్థానిక పాలనా యంత్రాంగం ఆహారధాన్యాలను రవాణా చేస్తుంది.
లాక్ డౌన్ సమయంలో గత 27 రోజుల్లో మంగళూరు ఓడ రేవు నుండి లక్షద్వీప్ దీవులకు 1750 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలును రవాణా చేశారు. ఇది 600 మెట్రిక్ టన్నుల నెల వారీ సరాసరి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. అదేవిధంగా, ఇదే సమయంలో, కాకినాడ ఓడ రేవు నుండి పోర్టుబ్లెయిర్ తో పాటు అండమాన్ & నికోబార్ లోని వివిధ దీవుల్లో ఉన్న వివిధ పి.డి.సి. లకు సుమారు 6,500 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు రవాణా చేశారు. ఇది 3000 మెట్రిక్ టన్నుల నెల వారీ సరాసరి కంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల నెలకొన్న అనేక అడ్డంకులను అధిగమిస్తూ ఈ దీవుల్లో ఆహారధాన్యాల సరఫరా నిరంతరాయంగా కొనసాగడానికి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. 27 రోజుల లాక్ డౌన్ సమయంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పి.ఎమ్.జి.కె.ఏ.వై.) కింద పంపిణీ చేసిన అదనపు కేటాయింపుతో సహా లక్షద్వీప్ దీవుల్లో సుమారు 1100 మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు, అండమాన్ & నికోబార్ దీవుల్లో 5500 మెట్రిక్ టన్నుల ఆహారధాన్యాలు పంపిణీ చేయడం జరిగింది. పి.ఎమ్.జి.కె.ఏ.వై. కింద లక్షద్వీప్ ఇప్పటికే మూడు నెలల కోటాను సేకరించి నిల్వ చేసుకోగా, అండమాన్ & నికోబార్ దీవులు రెండు నెలల కోటా కంటే ఎక్కువగా ఆహారధాన్యాలను సేకరించి, నిల్వ చేసుకుంది.
****
(Release ID: 1616813)
Visitor Counter : 158