ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్ -19 యుగంలో జీవితం
Posted On:
19 APR 2020 6:32PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనలను లింకిడిన్‌లో పంచుకున్నారు. ఇవి యువకులు , వివిధ రంగాల నిపుణులకు ఆసక్తి ని కలిగిస్తాయి.
ప్రధానమంత్రి లింక్‌డిన్‌లో పంచుకున్న తన ఆలోచనలకు సంబంధించిన పాఠం సంక్షిప్త తెలుగు అనువాదం...
“ ఈ శతాబ్దపు మూడవ దశకానికి ఇది ఒక ఒడుదుడుకుల ప్రారంభం.కోవిడ్ -19 తనతోపాటే ఎన్నో అంతరాయాలనూ తీసుకొచ్చింది. కరోనా వైరస్ వృత్తిపరమైన జీవితానికి గల హద్దులను చెప్పుకోదగిన స్థాయిలో మార్చి వేసింది. ఈరోజులలో ఇల్లే ఒక కొత్త కార్యాలయం. ఇంటర్నెట్ ఇప్పుడు ఒక కొత్త సమావేశ మందిరం. కొంతకాలం వరకూ , ఆఫీసు విరామ వేళలో సహచర ఉద్యోగులతో కలిసి కబుర్లు చెప్పుకోవడం ఒక చరిత్ర. నేనూ ఈ మార్పులకు అనుగుణంగా ఉంటున్నాను. చాలా వరకు సమావేశాలు, అవి సహచర మంత్రులతో కానివ్వండి, అధికారులు, ప్రపంచ నాయకులతో కానివ్వండి, అవి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో వివిధ వర్గాల నుంచి సమాచారం తెలుసుకునేందుకు , సమాజంలోని వివిధ వర్గాల వారితో సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతున్నాయి.ఎన్.జి.ఒలు, పౌరసమాజం గ్రూపులు , కమ్యూనిటీ ఆర్గనైజేషన్లు ఇలా ఎంతో మందితో సంప్రదింపులు జరిగాయి. రేడియో జాకీలతో కూడా మాట్లాడడం జరిగింది.
.దానికితోడు, నేను రోజూ ఎన్నో ఫోన్ కాల్స్ చేస్తున్నాను. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలనుంచి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాను.
ఈ కాలంలో ప్రజలు తమ పనిని కొనసాగించే మార్గాలు చూస్తున్నారు. ఇళ్లలోనే ఉండండనే సరైన సందేశాన్ని తెలియజేస్తూ మన సినీనటులు కొన్ని వీడియోలు రూపొందించారు. మన గాయకులు ఆన్ లైన్ కచేరీ నిర్వహించారు. చెస్ క్రీడాకారులు చెస్‌ను డిజిటల్‌గా ఆడారు. ఆరకంగా కోవిడ్ -19 పై పోరాటానికి వారు తోడ్పడ్డారు. ఇదొక వినూత్నమైనది !
పనిప్రదేశంలో ఇప్పుడు అన్నీ ముందు డిజిటల్‌రూపంలోనేగా రూపుదిద్దుకుంటున్నాయి. అవును ఇలా ఎందుకు కాకూడదు?
అన్నింటికంటే ముఖ్యంగా, చాలావరకు టెక్నాలజీ వల్ల మార్పు ప్రభావం తరచూ పేదల జీవితాల్లో కనిపిస్తుంటుంది. ఈ సాంకేతికతే అధికార శ్రేణులను కూల్చేస్తుంది. మధ్యవర్తులను తొలగిస్తుంది, సంక్షేమ చర్యలను వేగవంతం చేస్తుంది.
ఇందుకు సంబంధించి నేను మీకు ఒక ఉదాహరణ చెబుతాను. 2014లో మాకు సేవ సేవచేయడానికి అవకాశం లభించినపుడు , మేము ఈ దేశ ప్రజలను ప్రత్యేకించి పేద ప్రజలను వారి జన్‌ధన్ ఖాతా, ఆధార్, మొబైల్ నెంబర్‌తో అనుసంధానం చేయడం ప్రారంభించాం. ఈ చిన్న అనుసంధానత దశాబ్దాలుగా కొనసాగుతున్న అవినీతికి, ప్రతిఫలాపేక్షకి అడ్డుకట్ట వేసింది. అంతేకాదు ఒక చిన్న మీట నొక్కి నగదు బదిలీ చేయడానికి ప్రభుత్వానికి వీలు కలిగించింది.
ఈ మీట నొక్కడం అనేది ఫైల్‌లోని వివిధ అధికార శ్రేణుల స్థానంలో వచ్చిచేరింది. అంతేకాదు,వారాల తరబడి జాప్యాన్నీ తొలగించింది. ప్రపంచంలో నే అతిపెద్ద మౌలిక సదుపాయాలు కలిగిన దేశం ఇండియా. ఈ మౌలిక సదుపాయాలు కోవిడ్-19 పరిస్థితులలో కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం కలిగించింది. పేదలు , అవసరమైన వారికి నేరుగా వారి ఖాతాలలోకి నగదు బదిలీకి ఇది ఎంతగానో ఉపయోగపడింది.
మరో ముఖ్యమైన చెప్పుకోదగిన రంగం విద్యారంగం. ఈ రంగంలో ఎంతో మంది నిష్ణాతులైన ప్రొఫెషనల్స్ వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ రంగంలో స్ఫూర్తిదాయక సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. భారత ప్రభుత్వం కూడా టీచర్లకు, ఈ- అభ్యాసకులకు సహాయపడేందుకు దీక్షా పోర్టల్ వంటి వాటిని చేపట్టింది. ఈ పుస్తకాలకు, ఇతర లెర్నింగ్ మెటీరియల్ కు SWAYAM పోర్టల్ ఉంది.
ఇవాళ, ప్రపంచం నూతన వ్యాపార నమూనాల కోసం చూస్తోంది.
వినూత్న ఉత్సాహానికి పేరుగాంచిన యువ భారతదేశం, కొత్త పని సంస్కృతిని అందించడంలో నాయకత్వ స్థానంలో ఉండగలదు.
ఈ కొత్త వ్యాపార, పని సంస్కృతిని ఆంగ్ల ఒవెల్స్ లా పునర్ నిర్వచించాలి.
నేను వాటిని - అసాధారణ ఒవెల్స్ అంటాను- ఎందుకంటే ఆంగ్ల భాషలోని ఒవెల్స్‌లాగా , కోవిడ్ అనంతర ప్రపంచంలో ఏ వ్యాపార నమూనాకైనా ఇవి అత్యావశ్యక అంశాలుగా ఉండబోతాయి.
అనుసరణీయత:
సులభ అనుసరణీయత కలిగిన వ్యాపార , జీవన శైలి నమూనాలు ప్రస్తుత సమయంలో అవసరం.
అలా చేయడమంటే, సంక్షోభ సమయంలో కూడా మన కార్యాలయాలు, వ్యాపారాలు వాణిజ్యం వేగంగా కొనసాగుతూ జీవితాలు కోల్పోకుండా చూడడానికి వీలు కల్పించడమే.
డిజిటల్ చెల్లింపులను అందిపుచ్చుకోవడం అనసరణీయతకు ఒక ఉదాహరణ. ప్రస్తుత సంక్షోభ సమయంలో చిన్న, పెద్ద దుకాణ దారులు వ్యాపారంతో అనుసంధానత కలిగి ఉండాలంటే డిజిటల్ ఉపకరణాలపై పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. డిజిటల్ లావాదేవీల పరివర్తనలో భారతదేశం ప్రోత్సాహకరమైన రీతిలో ముందుకు దూసుకుపోతున్నది.
మరో ఉదాహరణ టెలిమెడిసిన్. ఇప్పటికే మనం ఆస్పత్రికి, క్లినిక్ కు వెళ్లకుండానే పలు రకాల సలహాలు పొందగలుగుతున్నాం. ఇదికూడా ఒక సానుకూల అంశమే. ప్రపంచవ్యాప్తంగా టెలిమెడిసిన్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి సాయపడే వ్యాపార నమూనాల గురించి మనం ఆలోచించగలమా?
సమర్ధత:
మనం సమర్థత అని చెప్పుకునే దాని గురించి పునర్ నిర్వచించుకోవడంపై ఆలోచన చేయవలసి ఉంది. ఆఫీసులో ఎక్కువ సమయం గడపడం ఒక్కటే సమర్థత కారాదు.
ఎంత కృషి జరగిందన్న దానికంటే ఉత్పాదకత , సామర్థ్యానికి ప్రాధాన్యతనిచ్చే నమూనాల గురించి మనం బహుశా ఆలోచించాలి. నిర్ణీత వ్యవధిలో ఒక పనిని పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఉండాలి.
సమ్మిళితత్వం:
పేదలు ,అత్యంత బలహీనులతోపాటు ఈ భూగ్రహ రక్షణకు వ్యాపార నమూనాలు అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనివ్వాలి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో మనం కీలక పురోగతి సాధించాం. మానవ కార్యకలాపాలు మందగిస్తే , ప్రకృతి ఎంత త్వరగా పుంజుకోగలదో భూమాత తన వైభవాన్ని మన కళ్లకు కట్టింది..
భూమి మీద మన ప్రభావాన్ని తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాలు, అభ్యాసాలను అభివృద్ధి చేయడంలో మంచి భవిష్యత్తు ఉంది. తక్కువతో ఎక్కువ చేయండి.
తక్కువ ఖర్చుతో , పెద్ద ఎత్తున ఆరోగ్య పరిష్కారాలపై పని చేయవలసిన అవసరాన్ని కోవిడ్ -19 మనం గ్రహించేలా చేసింది. మానవాళి ఆరోగ్యం , శ్రేయస్సుకు పూచీపడడానికి జరిగే ప్రపంచ కృషికి దారిచూపే దీపకాంతిగా మనం మారవచ్చు.
ఎలాంటి పరిస్థితులలో అయినా సమాచారం, యంత్రాలు, మార్కెట్లు మన రైతులకు అందుబాటులో ఉండే లా చేసే ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టాలి. తద్వారా మన పౌరులకు నిత్యావసర వస్తువులు అందాలి.
అవకాశం:
ప్రతి సంక్షోభం ఒక అవకాశాన్ని తీసుకువస్తుంది. కోవిడ్ -19 అందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతం అందివచ్చే అవకాశాలు, ప్రగతి అంశాలు ఏమిటో అంచనా వేద్దాం.
కోవిడ్ -19 అనంతర ప్రపంచంలో భారతదేశం, మరింత ముందుకు దూసుకువెళ్లవలసి ఉంది. దీనిని సాధించడంలో మన ప్రజలు, మన నైపుణ్య లక్ష్యాలు, మన కీలక సామర్ధ్యాలను వినియోగించాలి.
సార్వజనీనత:
కోవిడ్ -19 వ్యాప్తికి జాతి, మతం, రంగు, కులం, భాష, ప్రాంతం వంటివేమీ లేవు. మన స్పందన, మన వైఖరి ఐక్యతకు , సౌభ్రాతృత్వానికి ప్రాధాన్యతనిచ్చదిగా . ఈ విషయంలో మన మంతా కలసికట్టుగా ఉన్నాం.
గతంలో ,దేశాలు, సమాజాలు ఒకదానికొకటి తలపడినట్టు కాకుండా, ఇవాళ మనం అంతా ఒక ఉమ్మడి సవాలును ఎదుర్కొంటున్నాం. భవిష్యత్తు సమైక్యత, సంక్షోభాలనుంచి సత్వరం కోలుకోవడంపైనే ఉంటుంది.
భారతదేశం నుంచి తదుపరి వచ్చే పెద్ద ఆలోచనలు అంతర్జాతీయంగా పనికివచ్చేవిధంగా, అనుసరించే విధంగా ఉండాలి. ఇవి కేవలం ఇండియాను సానుకూల మార్పు దిశగా తీసుకువెళ్లే సమర్ధత కలిగినవి మాత్రమే కాక మొత్తం మానవాళికి ఉపకరించే విధంగా ఉండాలి.
రోడ్లు, గిడ్డంగులు, ఓడరేవులు వంటి భౌతిక మౌలిక సదుపాయాల పట్టకంలోనుంచి మాత్రమే లాజిస్టిక్స్ ను గతంలో చూసేవారు. కానీ ఈ రోజుల్లో లాజిస్టికల్ నిపుణులు తమ ఇంటి నుంచే ప్రపంచ సరఫరా వ్యవస్థలను నియంత్రించగలరు.
తగిన భౌతిక, వర్చువల్ మౌలికసదుపాయాలు గల భారతదేశం, కోవిడ్ -19 అనంతర ప్రపంచంలో సంక్లిష్టమైన ఆధునిక బహుళజాతి సరఫరా వ్యవస్థలో, ప్రపంచ కీలక కేంద్రంగా ఆవిర్భవించగలదు..
సందర్భానికి తగినట్టు సంసిద్ధమై, అవకాశాన్ని అందిపుచ్చుకుందాం.
దీనిగురించి ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్నికోరుతున్నాను. ఈ చర్చలో మీ వంతు పాత్ర పోషించండి.
బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ (బివైఒడి) నుంచి వర్క్ ఫ్రం హోం (డబ్ల్యుఎఫ్ హెచ్)కు మార్పు సందర్భంగా కార్యాలయ , వ్యక్తిగత స్థాయిలో సమతూకం పాటించడంలో కొత్త సవాళ్లు మన ముందుకు వస్తాయి.
ఏది ఏమైనా, మీరు ఫిట్ నెస్, వ్యాయామానికి సమయం కేటాయించండి
యోగా అంటే శారీరక , మానసిక శ్రేయస్సును పెంపొందించుకోవడమే.భారతీయ సంప్రదాయ ఔషధాలు శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహయపడతాయని తెలుసు.
ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడే ప్రొటోకాల్‌ను ఆయుష్ మంత్రిత్వశాఖ వెలువరించింది. వీటిని కూడా చూడండి.
చివరగా, ముఖ్యమైన విషయం, ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండవ. ఇది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే యాప్. ఇది కోవిడ్ -19 వ్యాప్తని అరికట్టేందుకు అవకాశం ఉన్న యాప్. మరింత మంది డౌన్‌లోడ్ చేసుకుంటే , దీని ప్రభావమూ మరింతగా ఉంటుంది.
మీ అందరి స్పందనకోసం ఎదురుచూస్తూ..
***
(Release ID: 1616288)
Visitor Counter : 358
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam