కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఉనాలో క్యాన్సర్తో బాధపడుతున్న శిశువుకు అత్యవసర ఔషధాలను అందించిన ఇండియా పోస్ట్

Posted On: 19 APR 2020 6:16PM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో క్యాన్సర్తో బాధపడుతున్న 8 సంవత్సరాల శిశువుకు అత్యవసరమైన మందులను  ఇండియా పోస్ట్ అందించింది. ఉనాకు చెందిన శాలిని క్యాన్సర్తో బాధపడుతున్నది, ఆమె రోజువారీ మందులు ఉనాలో లభించనందువలన వాటిని ఢిల్లీ నుండి కొరియర్ ద్వారా తెప్పించుకుంటుంది. లాక్డౌన్ కారణంగా కొరియర్ సేవలు అందుబాటులో లేకపోవడం వలన, వారి దగ్గర 19 ఏప్రిల్ 2020 వరకు మాత్రమే మందులు అందుబాటులో ఉండగా   వారు  ఢిల్లీలోని తమ స్నేహితుడిని మందులను పంపించడానికి మార్గం చూడమని అభ్యర్థించారు.  ఆయన కేంద్ర కమ్యూనికేషన్లు, చట్టము మరియు న్యాయ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారి సహాయాన్ని అభ్యర్థించారు.  వారి అభ్యర్థనను అందుకున్న మంత్రి ఇండియా పోస్టు వారికి శాలినికి అందించవలసిన  మందులను 19 ఏప్రిల్ 2020 ముందే అందిచవలసిందిగా ఆదేశించారు. ఢిల్లీ, హర్యానా, పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ ఇండియా పోస్ట్ సర్కిళ్ళ సమన్వయంతో  ప్రత్యేక మెడికల్ వ్యాన్ను ఏర్పాటు చేసి ఉనాలోని శాలిని ఇంటికి 19 ఏప్రిల్ 2020 ఉదయానికి మందులను అందించారు.

 

ఇండియ పోస్టుకు చెందిన పోస్టుమాన్ 19 ఏప్రిల్ 2020 మధ్యాహ్నానికి శాలిని తల్లికి మందులను అందించగా  వారు  తమ అమ్మాయికి కావలసిన మందులను సకాలంలో అందించినందుకు ఇండియా పోస్టుకు కృతజ్ఞతలు తెలిపారు.

 అత్యవసర సమయంలో మందులను సకాలంలో అందించిన ఇండియా పోస్టు వారిని కేంద్ర మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ అభినందించారు. శాలిని మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో అత్యవసరమైన వస్తువులు మరియు సేవలను సరియైన సమయంలో అవసరమైన వారికి అందించే విధంగా ఆదేశాలు అందించిన మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారి సమన్వయం గమనార్హం.

***


(Release ID: 1616165) Visitor Counter : 242