నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
భారతదేశంలో పున: వినియోగ పరికరాల తయారీ పార్కుల ఏర్పాటుకోసం ఎంఎన్ ఆర్ ఇ భారీ ప్రణాళికలు
ఆసక్తిని కనబరుస్తూ స్పందించిన ట్యుటికోరిన్ పోర్ట్ ట్రస్ట్, మధ్యప్రదేశ్, ఒడిషా ప్రభుత్వాలు
చైనానుంచి వైదొలుగుతున్న కంపెనీలను ఆకర్షించడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు
దేశంలో వినియోగం కోసం, ఎగుమతి చేయడానికి ఆర్ ఇ పరికరాల తయారీకోసం విధానపరంగా ప్రధానమైన మార్పులద్వారా ప్రోత్సాహకాలు.
Posted On:
18 APR 2020 10:55AM by PIB Hyderabad
పున: వినియోగ శక్తిని ఉత్పత్తి చేయడానికి పనికొచ్చే పరికరాల తయారీ పరిశ్రమల స్థాపన కోసం కేంద్ర నూతన మరియు పున: వినియోగ శక్తి వనరుల శాఖ సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ రంగంలో పరికరాల తయారీ ద్వారా దేశంలో పున : వినియోగ శక్తి వనరులు పెరిగి తద్వారా దేశంలోను, అంతర్జాతీయంగాను లబ్ధి పొందవచ్చని భావిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, పలు నౌకాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం ఉత్తరాలు రాసింది. ఈ పార్కులను నెలకొల్పడానికి 50-500 ఎకరాల స్థలాన్ని చూడాలని కోరింది. కేంద్ర మంత్రిత్వశాఖ చేసిన అభ్యర్థనకు ట్యుటికోరన్ నౌకాశ్రయ ట్రస్ట్, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలు ఇప్పటికే స్పందించాయి.
ఈ అంశంపై కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన కార్యదర్శి శ్రీ ఆనంద్ కుమార్ ఆయా పున: వినియోగ శక్తి తయారీ కంపెనీలతో సమావేశమయ్యారు. అంతే కాదు దీనికి సంబంధించి పలు దేశాల వాణిజ్య కమిషనర్లతోను, ప్రతినిధులతో మాట్లాడి భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈ మధ్యనే దీనికి సంబంధించి అమెరికాలో జరిగిన అమెరికా భారతదేశ్ వ్యూహాత్మక భాగస్వామ్య సమావేశంలో కేంద్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి వెబినార్ ద్వారా పాల్గొని ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా కంపెనీలను ఆహ్వానించారు.
ఈ పార్కులద్వారా సిలికాన్ ఇన్గాట్స్ అండ్ వేఫర్స్, సౌర బ్యాటరీలు మరియు మాడ్యూల్స్, పవన విద్యుత్ పరికరాలు, ఇంకా ఇతర అనేక విడిభాగాలను తయారు చేస్తారు. అలాగే ఈ కంపెనీలు తమ సేవలను, తయారు చేసే పరికరాలను అంతర్జాతీయంగా ఎగుమతి చేసుకొని లబ్ధి పొందవచ్చు.
చాలా కంపెనీలు తమ తయారీ పరిశ్రమలను చైనానుంచి ఇతర దేశాలక తరలిస్తున్న తరుణంలో వాటిని దేశంలోకి ఆహ్వానించడానికి భారతదేశంలో పలు విధాన పరమైన మార్పులు చేస్తున్నారు. దీనిలో భాగంగా కేంద్ర పున : వినియోగ శక్తి వనరుల శాఖ పలు నిర్ణయాలు తీసుకుంటున్నది.ఈ రంగంలో పెట్టుబడులకోసం కృషి చేయడానికిగాను ఒక బోర్డును ప్రారంభించింది. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం నింపడానికిగాను విద్యుత్ కొనుగోలు ఒప్పందాల నియమాలను బలోపేతం చేసింది. ఈ రంగంలోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కార్పొరేషన్లయిన పిఎఫ్ సి, ఆర్ ఇ సి మరియు ఇరెడాలు తమ రీ పేమెంట్ ఛార్జీలను రెండు శాతం తగ్గించాయి. ఈ విధంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ ఈ రంగంలో పెట్టుబడిదారులకు వున్న అడ్డంకులను తొలగిస్తున్నారు.
(Release ID: 1615649)
Visitor Counter : 224