వ్యవసాయ మంత్రిత్వ శాఖ

లాక్‌డౌన్ కాలంలో వ్య‌వ‌సాయ కార్య‌క‌లాపాలను కొన‌సాగించేందుకు వీలుగా వివిధ వ్యాపార కొన‌సాగింపు చ‌ర్య‌ల‌గురించి చ‌ర్చించిన కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి

సంవ‌త్స‌రం చివ‌రి వ‌ర‌కూ ట్రాక్ట‌ర్లు, పొలందున్నేయంత్రాలు, వ‌రికోత యంత్రాలు మ‌రో 51 ర‌కాల వ్య‌వ‌సాయ యంత్రాల న‌మూనాల ప‌రీక్ష‌, అనుమ‌తుల అప్‌డేటింగ్ వాయిదా.
విత్త‌న డీల‌ర్ల లైసెన్సుల గ‌డువు, దిగుమ‌తుల అనుమ‌తులను 2020 సెప్టెంబ‌ర్ వ‌ర‌కు పొడిగింపు.
దీనితోపాటు ప్యాక్ హౌస్‌ల చెల్లుబాటు, జూన్ 30 తో గ‌డువు తీరే ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రీట్‌మెంట్ స‌దుపాయాల‌కు సంబంధించి గ‌డువు మ‌రో ఏడాది పొడిగింపు

వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల ర‌వాణాకు వీలుగా కిసాన్ ర‌థ్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌.

Posted On: 17 APR 2020 8:51PM by PIB Hyderabad

వ్య‌వ‌సాయశాఖ తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై కేంద్రం వ్య‌వ‌సాయం , రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ , స‌హాయ‌మంత్రులు శ్రీ పురుషోత్తం రూపాల‌, శ్రీ కైలాస్ చౌద‌రితో క‌ల‌సి సీనియ‌ర్ అధికారుల‌తో చ‌ర్చించారు.
వ్యాపార కొన‌సాగింపున‌కు, రైతు సంక్షేమం, స‌హ‌కారానికి అలాగే  ప్ర‌స్తుత సంక్షోభ స‌మ‌యంలో  వ్య‌వ‌సాయ కార్య‌క‌లాపాలు ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కొన‌కుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డంపై చ‌ర్చించారు. ఇందుకు సంబంధించి ఈ కింది నిర్ణ‌యాలు తీసుకున్నారు.
 - సబ్సిడీ కార్యక్రమాల కింద రైతులకు వ్యవసాయ యంత్రాల  సరఫరాలో ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌కుండా చూసేందుకు ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ యంత్రాల యాదృచ్ఛిక  శాంపిళ్ల ప‌రీక్ష‌నుంచి మిన‌హాయించారు. అలాగే టెస్ట్‌రిపోర్టుల గ‌డువు తీరిన త‌ర్వాత త‌దుప‌రి బ్యాచ్ టెస్టింగ్‌, సిఎంవి.ఆర్ అప్‌డేటింగ్‌,ట్రాక్ట‌ర్లు, ప‌వ‌ర్ టిల్ల‌ర్ల‌కు సిఒపి, టైప్ ఆమోదం, ఉమ్మ‌డి హార్వెస్ట‌ర్లు, ఇత‌ర స్వ‌యం చోదిత వ్య‌వ‌సాయ‌పనిముట్ల‌కు 31.12.2020 వ‌ర‌కు అనుమ‌తి పొడిగింపు . స‌వ‌రించిన బిఐఎస్ ప్ర‌మాణాలు ఐఎస్ 12207-2019 ప్ర‌కారం , నూత‌న సాంకేతిక కీల‌క 51 యంత్రాల స్పెసిఫికేష‌న్‌కు సంబంధించి అనుమ‌తులు 31-12-2020 వ‌ర‌కు పొడిగింపు .
- లాక్‌డౌన్ కాలంలో విత్తన రంగాన్ని సులభతరం చేయడానికి, గడువు ముగిసిన లేదా గడువు ముగిసే విత్తన డీలర్ల లైసెన్స్ చెల్లుబాటును 30.09.2020 వరకు పొడిగించడానికి ప్రభుత్వం అంగీకరించింది.
-
 దిగుమతి చేసుకునే పార్టీల విత్తనం, నాట్ల‌కు ఉప‌యోగించే సామగ్రి  అవసరాన్ని దృష్టిలో ఉంచుకున్న త‌ర్వాత   దిగుమతి అనుమతుల చెల్లుబాటును సెప్టెంబర్ 2020 వరకు పొడిగించాలని నిర్ణయం.
--ప్లాంట్ క్వారంటైన్‌ వ్యవస్థలో, అన్ని ప్యాక్-హౌసెస్, ప్రాసెసింగ్ యూనిట్లు , ట్రీట్‌మెంట్ స‌దుపాయాల‌  చెల్లుబాటును విస్తరించాలని నిర్ణయించారు.  2020 జూన్ 30తో గ‌డువు ముగిసే వాటిని ఏడాది పొడిగించాల‌ని నిర్ణ‌యించారు.,  ఎలాంటి  తనిఖీ చేయకుండా స‌ర‌ళ‌త‌ర‌ విధానం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని సులభతరం చేయ‌డానికి ఉప‌క‌రిస్తుంది.
లాక్‌డౌన్ స‌మ‌యంలో క్షేత్ర స్థాయిలో వ్య‌వ‌సాయ కార్య‌క‌లాపాలు కొన‌సాగ‌డానికి , రైతులు కార్య‌క‌లాపాలు సాగించ‌డానికి వ్య‌వ‌సాయ శాఖ ప‌లు చ‌ర్య‌లు తీసుకుంది. ఇందుకు సంబంధించిన తాజా వివ‌రాలు ఇలా ఉన్నాయి.
ఆహార ధాన్యం (తృణధాన్యాలు, ముతక తృణధాన్యాలు, పప్పుధాన్యాలు మొదలైనవి), పండ్లు ,కూరగాయలు, నూనె గింజ‌లు , సుగంధ ద్రవ్యాలు, ఫైబర్ పంటలు, పువ్వులు, వెదురు,  చిన్న అటవీ ఉత్పత్తులు, కొబ్బరికాయలువంటి ఉత్ప‌త్తులకు స‌రైన ర‌వాణా ను రైతులు ఎంచుకోవ‌డానికి వీలుగా కేంద్ర వ్య‌వ‌సాయ శాక మంత్రి శ్రీ న‌రేంద్ర‌సింగ్ తోమార్‌, ఈరోజు కిసాన్ ర‌థ్ యాప్‌ను ప్రారంభించారు.
రైల్వేలు, 567 పార్సెల్ స్పెషల్స్ (వీటిలో 503 టైమ్ టేబుల్ పార్శిల్ రైళ్లు) నడపడానికి 65 మార్గాలను రైల్వే ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా 20,653 టన్నుల సరుకులను రవాణా చేశాయి.

లాక్‌డౌన్ కాలంలో 24.3.2020 నుండి ఇప్పటి వరకు  ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పిఎం-కిసాన్) పథకం కింద ,సుమారు 8.78 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు ఇప్పటివరకు రూ.17,551 కోట్లు విడుదల చేశారు.

ప్రధాన మంత్రి గ‌రీబ్‌ కల్యాణ్ యోజన (పిఎం-జికెవై) కింద రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు సుమారు 88,234.56 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు విడుద‌ల చేశారు.

*****



(Release ID: 1615615) Visitor Counter : 194