రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో , వినూత్న ఆలోచనలతో రికార్డు స్థాయిలో సరకు రవాణాచేస్తున్న భారతీయ రైల్వేలు
ఉత్తరాది నుంచి అన్నపూర్ణ రైళ్లు, దక్షిణాది నుంచి జైకిసాన్ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. దీనితో సుదూరప్రాంతానికి అత్యంత వేగవంతమైన ప్రత్యేక సరకు రవాణా రైళ్లకు నాంది పలికినట్టయింది
దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడానికి దాదాపు 80 కి పైగా రేక్‌లలో 5000 టన్నుల ఆహారధాన్యాలను లోడ్ చేసిన రైళ్లు సుదూర ప్రాంతానికి అత్యంత వేగంగా నడుస్తున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 16 మధ్య 3.2 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను లోడ్ చేశారు. గత ఏడాది ఇదే సమయంలో లోడ్ చేసిన సరుకు 1.29 మిలియన్ టన్నులు.
Posted On:
17 APR 2020 6:25PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా కోవిడ్ -19, కారణంగా లాక్ డౌన్ అమలులో ఉండడంతో ప్రజలకు అవసరమైన సరకుల చేరవేసేందుకు భారతీయ రైల్వే తనవంతు కృషి చేస్తోంది. దేశంలో కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు, ఈ సవాలును ఎదుర్కోవడంలో ప్రభుత్వప్రయత్నాలను మరింత బలోపేతం చేసేందుకు రైల్వే శాఖ ఆహార ధాన్యాల వంటి అత్యవసర సరకులును తమ సరకురవాణా సర్వీసుల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటోంది..
అత్యవసర వస్తువుల సరఫరా సక్రమంగా సాగేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనితోపాటు వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి ఆటంకం లేకుండా రవాణా చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
గత సంవత్సరం. గత ఏడాది ఇదే కాలంలో 1.29 మెట్రిక్ టన్నులతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 16 మధ్య 3.2 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు లోడ్ చేయబడ్డాయి. గత ఏడాది ఏప్రిల్ తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ లో ఆహార ధాన్యాల రవాణా ఎక్కువ స్థాయిలో జరిగింది. 2020 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 16 మధ్య 3.2 ఎం.టిల ఆహార ధాన్యాలను లోడ్ చేశారు. గత ఏడాది ఇదే కాలంలో లోడ్ అయిన సరకు 1.29 ఎం.టిలు.
పెద్దమొత్తంలో వేగంగా సరకు రవాణా జరిగేందుకు భారతీయ రైల్వే రెండు సరకు రవాణా రైళ్లను కలిపి ఒకటిగా నడిపే వినూత్న పద్ధతి అవలంబించింది. ఇందుకు సంబంధించిన విజయగాధలు, వినూత్న ఆవిష్కరణలు ఉత్తర రైల్వే, దక్షిణ మధ్య రైల్వే నుంచి వచ్చాయి.
ఉత్తర రైల్వే 5000 టన్నుల సుదూర ప్రాంతానికి వెళ్లే ఆహారధాన్యాల రైళ్లను ఏర్పాటు చేసింది. ఇలాంటి 25 అన్నపూర్ణ రైళ్లు ఏర్పాటు చేసి వాటిని 16-04-2020 వరకు నడిపింది. ఈ రైళ్లు అస్సాం, బీహార్, గోవా,గుజరాత్, కర్ణాటక,మహారాష్ట్ర, మణిపూర్, నాగాలాండ్, ఒడిషా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరం రాష్ట్రాలకు సరకు రవాణా చేసింది. ఈ సుదూర ప్రాంత ఆహార ధాన్యాల రైళ్లు,ఎన్.ఎఫ్.ఆర్ రైల్వేలోని న్యూ బొంగైగావ్ వరకు వెళ్లాయి.
ఉత్తర రైల్వే లాగే, దక్షిణ మధ్యరైల్వే , ప్రత్యేకంగా జైకిసాన్ ప్రత్యేక రైళ్లను నడిపే వినూత్న ఆలోచన చేసింది.దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆహారధాన్యాలను వేగంగా రవాణా చేసేందుకు దీనిని చేపట్టింది.
ఈ విధానంలో రెందు వేర్వేరు ప్రాంతాలలో లోడ్ అయిన రెండు సరకు రవాణా రైళ్లను సమీప జంక్షన్‌లో ఒకే రైలుగా మార్చి వాటిని నిర్దేశిత గమ్యస్థానాలకు పంపారు. ప్రయాణికుల రైళ్లు లేకపోవడంతో సరకు రవాణా రైళ్లకు రైలు మార్గం అందుబాటులో ఉండడం కలిసి వచ్చింది.
సాధారణ సమయాలలో, ఒక సరకురవాణా రైలు 42 వ్యాగన్ల లో 2600 టన్నుల ఆహార ధాన్యాలను తీసుకువెళుతుంది. అయితే రెండు సరకు రవాణా రైళ్లను ఒకటిగా కలపడం అంటే 42 + 42= 84 వ్యాగన్ల ద్వారా 5200 టన్నుల సామర్ధ్యం గల ఆహార ధాన్యాలను ఒకే మార్గంలో పంపడానికి వీలు కలిగింది. దీని వల్ల సరకు రవాణా రైళ్లు గమ్యస్థానం చేరడానికి పట్టే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గినట్టయింది.
దక్షిణమధ్య రైల్వే జోన్ రెండు ప్రత్యేక జైకిసాన్ సరకు రవాణా రైళ్లను ప్రారంభించింది. మొదటి రైలు దక్షిణమధ్య రైల్వే లో తెలంగాణాలోని డోర్నకల్ జంక్షన్ నుంచి దక్షిణ రైల్వే (సేవూరు,చెట్టినాడ్)కువెళ్లంది. ఇందుకోసం డోర్నకల్ జంక్షన్‌లో రెండు ఆహార ధాన్యాల రైళ్లను ఒకటిగా కలిపారు. అలాగే రెండో జైకిసాన్ ప్రత్యేక రైలును కూడా తెలంగాణాలోని డోర్నకల్ లోనే ఒకటిగా కలిపి దక్షిణ రైల్వే (దిండిగల్, ముడియపాక్కమ్) పంపారు. ప్రత్యేకించి ఈ రైళ్లు సగటున గంటకు 44 కిలోమీటర్ల వేగంతో నడిచాయి. ఆ రకంగా అత్యవసర సరకులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చాలన్న లక్ష్యాన్ని నెరవేర్చినట్టయింది.
లాక్డౌన్ కారణంగా కఠినమైన పని పరిస్థితుల కారణంగా సరఫరా గొలుసులో కొనసాగింపును నిర్వహించడం గట్టిగా ఉంది. టెర్మినల్ విడుదల / కార్మిక లభ్యత కోసం డిఎంలు / ఎస్పీలతో జిల్లా స్థాయిలో, రాష్ట్ర సమన్వయ అధికారులు, మరియు ఎంహెచ్‌ఎతో అత్యున్నత స్థాయిలో భారత రైల్వే ఆపరేటింగ్ ఆఫీసర్లు నిరంతరం సమన్వయం చేస్తున్నారు.
లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన క్లిష్ట పని పరిస్థితులలో సరకు సరఫరా వ్యవస్థలు సజావుగా సాగించడం కష్టమైన వ్యవహారం. జిల్లాస్థాయిలో డిఎంలు, ఎస్‌పిలు , రాష్ట్రస్థాయి సమన్వయ అధికారులు, ఉన్నతస్థాయిలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ , భారతీయ రైల్వేలోని నిర్వహణాధికారులు కార్మికుల అందుబాటును బట్టి టెర్మినల్ రిలీజ్ కు నిరంతరం సమన్వయంతో పనిచేస్తున్నారు. ఆయా రాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎఫ్.సి.ఐ నుంచి సరకు రవాణా చేయాల్సిన గమ్యస్థానాలను ముందుగానే పక్కాగా ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు.
ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో , సిబ్బందిని ఇంటి నుండి నియంత్రణా వ్యవస్థకు, కార్యాలయానికి తరలించడం అత్యవసర వాహనాలలో, వర్క్‌మన్ ప్రత్యేక రైళ్ల ద్వారా జరుగుతోంది. నియంత్రణా వ్యవస్థ , ఇతర కార్యాలయాల పరిశుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. తద్వారా సిబ్బంది తాము సురక్షితంగా ఉన్నామన్న విశ్వాసంతో పనిచేయడానికి వీలు కలుగుతుంది.
(Release ID: 1615469)
Visitor Counter : 202