నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

2000 మెగావాట్ల గ్రిడ్ అనుసంధాన‌ సోలార్ పీవీ ప్రాజెక్ట్ నిమిత్తం ఈ-రివర్స్ వేలాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన ఎన్‌హెచ్‌పీసీ

Posted On: 17 APR 2020 6:53PM by PIB Hyderabad

దేశంలో ఎక్కడైనా 2000 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పీవీ ప్రాజెక్ట్ ఏర్పాటు నిమిత్తం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ ఈ-రివ‌ర్స్ వేలాన్ని (ఈ-ఆర్ఏ) విజయవంతంగా నిర్వహించింది. ఎన్‌హెచ్‌పీసీ సీఎండీ ఎ.కె. సింగ్, సంస్థ డైరెక్ట‌ర్ (టెక్నిక‌ల్‌) వై.కె. చౌబే సమక్షంలో ఈ వేలం ప్ర్ర‌క్రియ జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర విద్యుత్ మరియు కొత్త & పునరుత్పాదక ఇంధన వ‌న‌రుల శాఖ మంత్రి ఆర్‌.కె. సింగ్ ట్విట్ట‌ర్‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. “2000 మెగా వాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన సౌర‌
ఉత్పాదక సామ‌ర్థ్య‌పు యూనిట్‌ ఏర్పాటు చేయడానికి సంబంధించిన బిడ్‌ను విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ విజ‌య‌వంతంగా పూర్తి చేసింది అని తెలిపారు. యూనిట్ ఒక్కింటికి రూ.2.55/ 2.556 పోటీ టారీఫ్ వ‌ద్ద ఈ-ఆర్ఏను పూర్తి చేసిన‌ట్టుగా వివ‌రించారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న సమయంలో తాము వర్చువల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఔత్సాహిక భాగ‌స్వామ్య ప‌క్షాల వారితో పరస్పర సంప్ర‌దింపులు జ‌రుపుతూ కొత్త బిడ్ల‌నూ తీసుకు వ‌చ్చిన‌ట్టుగా తెలిపారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడం, వ్యాపార నిర్వ‌హ‌ణ‌ను మ‌రింత‌గా సుల‌భ‌త‌రం చేసేందుకు గాను గ‌త కొన్ని తాము చేపట్టిన అనేక చర్యల ఫలితంగానే మేటి టారీఫ్ వ‌ద్ద ప్ర‌తిపాదిత ప్రాజెక్ట్ ఈ-ఆర్ఏ విజ‌య‌వంతమైన‌ట్టుగా ఆయ‌న వివ‌రించారు. పెట్టుబడిదారులకు ఎదుర‌య్యే వివిధ స‌మ‌స్య‌ల‌ను దాదాపు క‌నిష్టీక‌రించేందుకు గాను తాము కట్టుబడి ఉన్నామని మంత్రి తెలిపారు. మొత్తంగా 3140 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడుగురు బిడ్డర్ల‌ పోటీ మ‌ధ్య‌ ఈ-ఆర్‌ఐ నిర్వహించారు. మొత్తం 2000 మెగావాట్ల సామ‌ర్థ్య‌పు యూనిట్కు సంబంధించిన‌ ప్రారంభ టారీఫ్‌ను తొల‌త యూనిట్‌కు రూ.2.71/ నుంచి రూ.2.78గా నిర్ణ‌యించ‌గా.. యూనిట్‌కు రూ.2.51 నుండి 2.56 / కనిష్ట ఈ-ఆర్ఏ టారీఫ్ ల‌భించింది. కోవిడ్ - 19 కారణంగా భారతదేశంలో పూర్తి లాక్‌డౌన్‌ అమ‌లులో ఉన్నప్పటికీ, ఎన్‌హెచ్‌పీసీ ఈ-రివర్స్ వేలంను విజయవంతంగా పూర్తి చేయ‌డం విశేషం. 


(Release ID: 1615466) Visitor Counter : 175