సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

మరల ఉపయోగించే వీలున్న మాస్కులను సరఫరాచేసిన ఢిల్లీ రోటరీ క్లబ్(ఆర్సిడి)

ఈ మాస్కులు లాక్డౌన్ సమయంలో ఇళ్ళలో తయారు చేయబడినవి

Posted On: 17 APR 2020 6:02PM by PIB Hyderabad

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపునుందుకుని కొవిడ్-19 సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు సహాయం చేయడానికి రోటరీ క్లబ్

ఆఫ్ ఢిల్లీ హెరిటేజ్ వారు పత్రికా సమాచార కార్యాలయం(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వారి సమన్వయంతో సుమారు 50,000 మరల ఉపయోగించే వీలు కలిగిన మాస్కులను సరఫరా చేస్తున్నారు.

ఈ మాస్కులు లాక్డౌన్ సమయంలో టైలర్లు తమ ఇంటి నుండి తయారు చేసినవి, వీటిని  ఈ రోజు సమాచార ప్రసార కార్యాలయం

 ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ కులదీప్ సింగ్ ధట్వాలియా సరఫరా చేసారు, కాగా ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ ఢిల్లీ హెరిటేజ్ వారి తరఫున పిఐబి అదనపు డిజి శ్రీ రాజీవ్ జైన్ సమన్వయపరచారు.

 

 

ఈ మాస్కులను ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ శ్రీ అనంద్ కుమార్ గారికి అందజేసారు,   ప్రెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి

 శ్రీ సి.కె. నాయక్ మరియు సిఐఎస్ఎఫ్ ఉప కమాన్డెంట్ శ్రీ సందీప్ మన్హాస్ గార్లు జాతీయ మీడియా సెంటర్ వద్ద ఈ  కార్యక్రమానికి హాజరయ్యారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మరియు ఇతర సంస్థల భాగస్వామ్యంతో రోటరీ ఢిల్లీ హెరిటేజ్ వారు ఈ సరఫరా కార్యక్రామాన్ని చేపట్టగా సమీప భవిష్యత్తులో ఢిల్లీ పోలీసు వారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. గ్రేట్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ నవీన్ కుమార్ గారు కూడా సుమారు 40,000 మాస్కులను సరఫరా చేసారు మరియు ఈ ముగ్గురు గ్రహీతలకు తమ పానీయాలను అందించారు.



(Release ID: 1615438) Visitor Counter : 169