రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 నేపథ్యంలో ఎరువుల ఉత్పత్తి, రైతులకు అందుబాటులో ఉండి వారికి అందేలా నిశితంగా సమీక్షిస్తున్న ఎరువుల శాఖ
Posted On:
16 APR 2020 3:08PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి వల్ల తలెత్తిన విపత్కర పరిస్థితిని ఎదుర్కోవటానికి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి సదానంద గౌడ, సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవియా, ఎరువుల కార్యదర్శి విభాగం శ్రీ చబీలేంద్ర రౌల్ దేశంలో ఎరువుల, ఉత్పత్తి, పంపిణీ కార్యకలాపాలను నిశితంగా సమీక్షిస్తున్నారు. శాఖలో అత్యున్నత స్థాయిలో అందరు నిమగ్నమై దేశం అంతటా రైతులకు అవసరమైన ఎరువులు లభించడం పై చర్యలు చేపట్టారు. ఉత్పత్తి, సరఫరా గొలుసులోని ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే రియల్ టైమ్ పర్యవేక్షణ జరుగుతోంది. తగినంత ఎరువుల లభ్యతను నిర్ధారించడానికి కేంద్రంలోని వివిధ ఏజెన్సీలతో, రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల పాలనా వ్యవస్థలతో పూర్తి సమన్వయం చేసుకుంటున్నారు. రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని చెబుతూ "ప్రస్తుతానికి లభ్యత తగినంతగా ఉంది" అని శ్రీ గౌడ ట్వీట్ చేశారు.
ఎరువుల రాకపోకలు సజావుగా ఉండేలా ఫెర్టిలైజర్ కంపెనీలు చేపట్టే చర్యలపై ఎరువుల శాఖ తగు ఆదేశాలు ఇచ్చింది. ఎరువుల బస్తాలను తెచ్చే అరల అన్ లోడింగ్ విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా రైల్వే, వ్యవసాయ మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. ప్లాంట్లకు సమీపంలో అదనపు నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా తగు మార్గాలను అన్వేషించాలని ఎరువుల శాఖ తెలిపింది. ఎరువుల సరఫరా నిరాటంకంగా ఉండేలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యవసాయ శాఖలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎరువులు నిత్యావసర వస్తువుగా పర్యవేక్షణ చేయాలని ఫెర్టిలైజర్స్ మంత్రి సూచించారు.
ఎరువుల రవాణా, సరఫరా సందర్బంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా సామజిక దూరం, శానిటేషన్ వంటి చర్యలు చేపట్టాలని ఎరువుల శాఖ తగు ఆదేశాలు జరీ చేసింది. మహమ్మారి వ్యాప్తి ని నిరోధించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఫెర్టిలైజర్స్ కంపెనీలు సామజిక బాధ్యతగా తమ సీఎస్ఆర్ బడ్జెట్ నుండి విరివిగా విరాళాలు ఇవ్వాల్సిందిగా రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి పిలుపునిచ్చారు. ఉద్యోగులు కూడా తమ జీతాల నుండి ఈ మహత్కార్యానికి విరాళాలు ఇవ్వాలని సూచించారు.
*********
(Release ID: 1615147)
Visitor Counter : 275