వ్యవసాయ మంత్రిత్వ శాఖ

2020 ఖ‌రీఫ్ పంట‌ల‌పై జాతీయ స‌ద‌స్సుకు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అద్య‌క్ష‌త‌ వ‌హించిన కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌

రాష్ట్రాలు ఖ‌రీఫ్ ల‌క్ష్యాల‌ను సాధించ‌డానికి కృషి చేయాలి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాల‌తో ప‌నిచేయాలి : శ్రీ న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌
ఆహార ధాన్యాల ఉత్ప‌త్తి ల‌క్ష్యం 2020-21 సంవ‌త్స‌రానికి 298.0 మిలియ‌న్ ట‌న్నులుగా నిర్ణ‌యం
గావ్‌,గ‌రీబ్, కిసాన్‌లు ప్ర‌స్తుత సంక్షోభ స‌మ‌యంలో ఇబ్బందులు ప‌డ‌కుండా ప్ర‌ధాన‌మంత్రి హామీ: శ్రీ‌న‌రేంద్ర సింగ్ తోమ‌ర్

Posted On: 16 APR 2020 3:26PM by PIB Hyderabad

ఖరీఫ్ లక్ష్యాన్ని సాధించడమే అన్ని రాష్ట్రాల లక్ష్యమని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం మిషన్ మోడ్‌లో చేపట్టాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. వీడియో సమావేశం ద్వారా ఖరీఫ్ పంటల 2020 జాతీయ సమావేశంలో ప్రసంగించిన ఆయన, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ఏవైనా అడ్డంకుల‌ను ఎదుర్కొంటుంటే వాటిని భారత ప్రభుత్వం తొలగిస్తుందని హామీ ఇచ్చారు.

లాక్‌డౌన్‌ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునివివిధ స‌మ‌స్య‌లు,  ఖరీఫ్ సాగుకు సంసిద్ధత గురించి  చర్చించడం , రాష్ట్రాలతో సంప్రదించి తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల జాబితాను సిద్ధం చేయ‌డం, జాతీయ ఖరీఫ్ సమావేశం  ప్రధాన లక్ష్యం.
కరోనావైరస్ వల్ల ఏర్ప‌డిన‌ అసాధారణ పరిస్థితిని వ్యవసాయ రంగం పోరాట పటిమతో ఎదుర్కోవ‌ల‌సి ఉందని, ప్రతి ఒక్కరూ  సంద‌ర్భానికి త‌గిన‌ట్టు ప‌నిచేయాల‌ని  శ్రీ తోమర్ అన్నారు. ఈ సంక్షోభ సమయంలో గావ్‌, గారిబ్ , కిసాన్" (గ్రామం, పేద లు రైతులు) బాధపడకుండా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారని ఆయన అన్నారు. పిఎం ఫసల్ బీమా యోజన, భూసార ప‌రిరక్ష‌ణ కార్డు  పథకం అనే రెండు పథకాలను ప్రతి రైతుకూ వివరించాలని శ్రీ తోమర్ రాష్ట్రాలను కోరారు.

లాక్‌డౌన్ కారణంగా వ్యవసాయరంగం ప్రభావితం కాకుండా ఉండేలా అఖిల భారత అగ్రి ట్రాన్స్‌పోర్ట్ కాల్ సెంటర్‌ను ప్రారంభించినట్లు  రాష్ట్రాలకు మంత్రి తెలిపారు. ఈ-నామ్‌ను విస్తృతంగా ఉపయోగించాలని ఆయన కోరారు. సామాజిక దూరం,  సామాజిక బాధ్యత ప్రమాణాలను పాటిస్తూ , వ్యవసాయ రంగానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన మినహాయింపులు,  సడలింపులను అమలు చేయాలని శ్రీ తోమర్ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.
.2020-21 సంవత్సరానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని 298.0 మిలియన్ టన్నులుగా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో, ఆహార ధాన్యాల  ఉత్పత్తి లక్ష్యం 291.10 మిలియన్ టన్నులు కాగా, సుమారు 292 మిలియన్ టన్నుల మేర‌కు అధిక ఉత్పత్తి రాగ‌ల‌ద‌ని అంచ‌నా .ప్రధానంగా సాగు విస్తీర్ణంలో పెరుగుద‌ల‌, వివిధ పంటల ఉత్పాదకత పెరుగుద‌ల కార‌ణంగా దిగెబ‌డి పెర‌గ‌వ‌చ్చ‌ని అంచ‌నా.
జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొన్న వారి నుద్దేశించి ప్ర‌సంగిస్తూ , వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీ పార్శోత్తం రూపాలా , పిఎం ఫసల్ బీమా యోజన ప్రయోజనాలను రైతులకు వివరించాలని సూచించారు. మన దేశంలో వ్యవసాయం , ఉద్యాన రంగం అనేక రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధికి కీలకమైనదిగా మారిందని శ్రీ రూపాలా అన్నారు.
గత సంవత్సరం (2018-19) లో, రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జ‌ర‌గ‌డంతో పాటు, దేశం,25.49 మిలియ‌న్ హెక్టార్ల‌లో, సుమారు 313.85 మిలియన్  మెట్రిక‌ల్ ట‌న్నుల ఉద్యాన వ‌న పంట‌ల‌ను   పండించింది. ఇది మొత్తం ప్రపంచ పండ్ల ఉత్పత్తిలో 13 శాతం. చైనా తరువాత కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని ఆయన అన్నారు.

వ్య‌వ‌సాయ శాఖ స‌హాయ మంత్రి  శ్రీ కైలాష్ చౌదరి మాట్లాడుతూ, వర్షపాత విధానంలో మార్పుతో పాటు వాతావరణ మార్పుల పరిస్థితిలో, 2018-19లో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని 285 మిలియన్ టన్నులు సాధించింది, ఇది 2019-20లో292 మిలియన ట‌న్నుల‌కు పెరగ‌నుండ‌డం గొప్ప విష‌యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంకితభావంతో , సమన్వయంతో  సాగిస్తున్న కృషి, వివిధ ర‌కాల సాంకేతిక పురోగతి వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయని ఆయన అన్నారు.
మన దేశం ఆహారధాన్యాల  మిగులు దేశంగా మారినప్పటికీ,  గ్రామీణ ప్రాంతాల‌లో ఆహారం , పోషకవిలువ‌లు భ‌ద్ర‌త క‌ల్పించ‌డానికి,  వ్యవసాయం , ఉద్యానవన రంగాల ఉత్పత్తి , ఉత్పాదకతను పెంచాల్సిన‌ అవసరం ఉందని  శ్రీ సంజయ్ అగర్వాల్ ,కార్యదర్శి (వ్యవసాయం, సహకారం ,రైతు సంక్షేమం)  త‌మ ప్ర‌సంగంలో అన్నారు.

పంట‌ల ఉత్ప‌త్తి పెంచ‌డానికి , రైతుల ఆదాయాన్ని పెంచ‌డానికి త‌మ మంత్రిత్వ‌శాఖ ప్ర‌ధాన‌మంత్రి కృషి సించాయి యోజ‌న (పిఎంకెఎస్‌వై) కింద ప‌ర్ డ్రాప్ మోర్ క్రాప్ కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున అమ‌లు చేస్తున్న‌ట్టు ఆయ‌న ఈ స‌మావేశంలో పాల్గొన్న వారికి వివ‌రించారు.పంరంప‌రాగ‌త్  కృషి వికాస్‌యోజ‌న‌(పికెవివై) , ప్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌, ఈ నామ్ , ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధియోజ‌న‌, కేంద్ర ప‌థ‌క‌మైన ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ పెన్ష‌న్ స్కీమ్‌,నూనె గింజ‌లు, పప్పులు, పంట‌ రైతుల‌కు వారి ఉత్ప‌త్తి ఖ‌ర్చు కంటే రెండిత‌లు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించేందుకు పిఎం- ఆశా ప‌థ‌కం అమ‌లుతోపాటు కోవిడ్ -19 ప‌రిస్థితుల కార‌ణంగా డైర‌క్ట్ మ‌ర్కెటింగ్ , వ్య‌వ‌సాయ యాజ‌మాన్యానికి సంబంధించి త‌గిన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ అయిన‌ట్టు ఆయ‌న చెప్పారు.
 
గత రెండు దశాబ్దాలలో (1988-89 నుండి 2018-19) వరకు సాగు , వ్యవసాయ భూమి విస్తీర్ణం సుమారు 2.74 మిలియన్ హెక్టార్ల వరకు తగ్గిందని వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎస్.కె. మ‌ల్హోత్రా చెప్పారు . అయితే, అదే కాలంలో స్థూల పంట విస్తీర్ణం 182.28 మిలియన్ హెక్టార్ల నుండి 196.50 మిలియన్ హెక్టార్లకు పెరిగింది, నికరంగా పంట‌వేసింది 140 మిలియన్ హెక్టార్లలోనే ఇందులో పెద్ద‌గా మార్పు లేదు.. వివిధ సాంకేతిక ప‌ద్ధ‌ల వినియోగం, ప్ర‌భుత్వప‌రంఆ విధానప‌ర‌మైన చ‌ర్య‌ల‌ కారణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి 169.92 మిలియన్ టన్నుల నుండి 284.96 మిలియన్ టన్నులకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

రబీ పంటలకు సంబంధించి, లాక్‌డౌన్ కార‌ణంగా  రైతులు  బ‌య‌ట‌కు వెళ్లేందుకుఅనుమ‌తించ‌క‌పోవ‌డంతో ,  గ్రామ‌, బ్లాక్ స్థాయిలో  అన్ని రాష్ట్రాలు గ్రామ , బ్లాక్ స్థాయిలో ధాన్యం సేకరణను చేప‌ట్టాల‌ని నిర్ణయించాయి. అదనంగా, అన్ని రాష్ట్రాలు రైతుల నుండి ప్రత్యక్ష మార్కెటింగ్ ద్వారా పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
 
.
అన్ని రాష్ట్రాలకు ఇందుకు సంబంధించిన‌/ మార్గదర్శకాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా గ్రామ‌ / బ్లాక్ స్థాయిలో ఇటువంటి ఇన్‌పుట్‌లు  సకాలంలో లభించేలా చూడటానికి విత్తనాలు , ఎరువులతో నిండిన ట్రక్కులు , వాహనాలు వెళ్ళ‌డానికి సడలింపు ఇచ్చారు.. రైతులకు ఎలక్ట్రానిక్ ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి తెచ్చింది.  మెరుగైన ఆర్థిక రాబడిని అందించడానికి ప్రభుత్వం ఈ-నామ్ వ్యవస్థను బలోపేతం చేసింది.
గడ‌చిన ప‌లు దశాబ్దాలలో అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎక్కువ భాగం సాగుభూమి ఇప్పటికీ వర్షాధారంగా ఉంది.  వర్షాలు కుర‌వ‌నప్పుడు , రైతులు తమ పంటల‌ను కాపాడుకోవ‌డం కోసం ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి "ప్రధాన మంత్రి కృషి సిన్చాయీ యోజన" (పిఎంకెఎస్వై) ,నీటిస‌ర‌ఫ‌రాకు హామీ ఇస్తూ   సాగు విస్తీర్ణాన్ని విస్తరింప‌చేస్తోంది., నీటి వృధాను అరిక‌ట్ట‌డానికి  వ్యవసాయ క్షేత్రంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని -నీటిపారుదల వ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుపరచడం  నీటి పొదుపు న‌కు సంబంధించి ఇత‌ర సాంకేతిక ప‌రిజ్ఞానాల‌ను చేప‌డుతున్నారు.

స్పెషల్ సెక్రటరీలు, అదనపు కార్యదర్శి (వ్యవసాయం) , డిఎసి & ఎఫ్‌.డ‌బ్ల్యుఎ, , ఐసిఎఆర్ నుండి సీనియర్ అధికారులు , వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ సదస్సులో పాల్గొన్నారు.  ఖరీఫ్ సీజన్లో విస్తీర్ణం, ఉత్పత్తి , ఉత్పాదకత పెంచడానికి ఆయా రాష్ట్రాల్లో అవలంబించాల్సిన ప‌ద్ధ‌తులు, సాధించిన విజ‌యాలు, ఎదురౌతున్న సవాళ్లు , వ్యూహాలను పంచుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్లు,  అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఐదు బృందాలుగా  ఒక ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు.



(Release ID: 1615054) Visitor Counter : 510