శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కొవిడ్-19పై పోరాటంలో భాగంగా తమ ఇళ్ళలో మాస్కులు తయారు చేస్తున్న పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాకు చెందిన మహిళలు

Posted On: 15 APR 2020 7:28PM by PIB Hyderabad

కొవిడ్-19 నుండి తమ గ్రామ ప్రజల, వలస కార్మికులు, ఆహార మరియు రేషన్ సరఫరాచేసేవారి  రక్షణ కోసం   పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లా హాజీపూర్ బ్లాకుకు చెందిన గుజ్వాల్హార్ గ్రామానికి చెందిన యువ మహిళల బృందం గ్రామ సర్పంచ్ శ్రీ నారీందర్ సింగ్ నాయకత్వంలో నిరంతరాయంగా మాస్కులను తయారు చేస్తున్నారు. ఈ మాస్కులు ఉచితంగా పంపిణీ  చేస్తున్నారు.

 పంజాబ్ రాష్ట్ర ఎస్&టి కౌన్సిల్(పిఎస్సిఎస్టి), చండీగఢ్ వారి సహకారంతో శాస్త్ర మరియు సాంకేతిక విభాగం(డిఎస్టి) వారు  మహిళల కోసం సామాజిక కార్యక్రమం క్రింద  కొవిడ్-19 పోరాడటానికి  హోషియార్పూర్ జిల్లా తల్వారా బ్లాకులో ’టెక్నలాజికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ వుమెన్ ఆన్ ఎనర్జీ ఫ్రం రూరల్ బయోమాస్’ కార్యక్రమాన్ని ప్రారంభించి అమలుపరుస్తున్నారు.

“స్థానిక నాయకత్వం సహకారంతో సామాన్య ప్రజల కోసం ఇళ్ళలో మాస్కుల తయారీ గురించిన అవగాహన పెరిగింది. ఇది కొవిడ్-19 వ్యాప్తిని మందగించేలా చేసి అడ్డుకుంటుంది” అని శాస్త్ర మరియు సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొ.అశుతోష్ శర్మ అన్నారు.

భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కార్యాలయం వారు ఆదేశాల ప్రకారం మహిళలు 6 ఏప్రిల్ 2020న ఇళ్ళలో మాస్కులను తయారుచేసే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అవసరైన ముడి సరుకును 10 రోజుల్లోనే పిఎస్సిఎస్టి వారు సరఫరాచేసారు, తక్కువ సమయంలోనే ఈ మహిళల బృందం 2000లకు పైగా నాణ్యత కలిగిన మాస్కులను తయారుచేసి గుజ్వాల్హార్ దగ్గరలోని నాలుగు గ్రామాల్లోని వలస కార్మికులకు మరియు చిన్న చిన్న దుకాణదారులకు అందించారు.

పిఎస్సిఎస్టి తల్వారా బ్లాకులోని 30 గ్రామాలకు గ్రామ సర్పంచులు, స్థానిక స్వయం సహాయక బృందాలవారు, మహిళలు & రైతులతో వాట్సప్ గ్రూపును ప్రారంభించారు. ఈ కేంద్ర /రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ సలహాలను ఈ గ్రూపు సభ్యులకు  ఈ వాట్సప్ ద్వారా అందించబడతాయి. ప్రభుత్వాలు అందించే మార్గదర్శకత్వాలను ప్రజలకు ఎప్పటికప్పుడు  అందిస్తున్నారు, ఈ వాట్సప్ బృంద సభ్యులు ఈ విధమైన మార్గదర్శకత్వాన్ని స్వాగతిస్తున్నారు.

మరిన్ని వివరాల కోసం: డా. ఇందుపూరి, శాస్త్రవేత్త, ’ఎఫ్’ డిఎస్టి  indub.puri[at]nic[dot]inమొబైల్: 9810557964

 

చిత్రం: సమూహం నిర్వహిస్తున్న కార్యకలాపాల సంగ్రహావలోకనం

****


(Release ID: 1614875) Visitor Counter : 178